‘సలార్’ సినిమాలో ప్రపంచ సుందరి: ప్రభాస్ కోసం భారీ రిస్క్.. 3 నిమిషాలకు రూ. కోటిన్నర ఖర్చు!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఒకటి విడుదల కాకముందే మరో మూడు ప్రాజెక్టులను ప్రకటించి ఆశ్చర్య పరిచిన అతడు.. ఒక దాని తర్వాత ఒకటి పట్టాలెక్కిస్తున్నాడు. ఇప్పటికే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' అనే మూవీ చేస్తున్న ప్రభాస్.. ఇటీవలే 'సలార్' అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను కూడా ప్రారంభించేశాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాలోకి ప్రపంచ సుందరిని దింపుతున్నారు. అంతేకాదు.. ఆమె కోసం 3 నిమిషాలకు రూ. కోటిన్నర ఖర్చు చేస్తున్నారు. ఆ సంగతులు మీకోసం!

అది రెడీ అవుతోంది.. ఈ ఏడాదే వస్తున్నాడు

అది రెడీ అవుతోంది.. ఈ ఏడాదే వస్తున్నాడు

జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న చిత్రం 'రాధే శ్యామ్'. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీ కూడా పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతుంది. ఈ మూవీలో ప్రభాస్ సరికొత్త పాత్రలో నటిస్తున్నాడు. దీని టీజర్ ఫిబ్రవరి 14న వస్తుంది.

దీని కంటే ముందే ప్రకటన.. ఇదే మొదలైంది

దీని కంటే ముందే ప్రకటన.. ఇదే మొదలైంది

'రాధే శ్యామ్' పట్టాలపై ఉండగానే ప్రభాస్.. నాగ్ అశ్విన్ తెరకెక్కించబోయే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ దీన్ని నిర్మిస్తున్నారు. దీనితో పాటు 'ఆదిపురుష్' అనే హిందీ చిత్రాన్ని కూడా ప్రకటించాడు. ఓం రౌత్ రూపొందించనున్నాడు. వీటి తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మూవీ ప్రకటించాడు. అన్నింటికంటే ముందే దీన్ని మొదలెట్టాడు.

 సింగరేణి గనుల్లోకి ప్రభాస్.. షెడ్యూల్ కంప్లీట్

సింగరేణి గనుల్లోకి ప్రభాస్.. షెడ్యూల్ కంప్లీట్

'కేజీఎఫ్' మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ - ప్రభాస్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'సలార్'. హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నాడు. తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ఇక, ఇటీవలే సింగరేణి గనుల్లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. మొదటి షెడ్యూల్‌లో యాక్షన్ సీక్వెన్స్ చిత్రకరించారు.

‘సలార్' సినిమాలో ప్రపంచ సుందరి కూడా

‘సలార్' సినిమాలో ప్రపంచ సుందరి కూడా

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న 'సలార్'లో హీరోయిన్‌గా బాలీవుడ్ భామను తీసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, ఊహించని విధంగా దక్షిణాది హీరోయిన్ శృతి హాసన్‌ను ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రం కోసం ఆమెకు ఏకంగా రూ. కోటికి పైగానే రెమ్యూనరేషన్ కూడా చెల్లిస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే మాజీ ప్రపంచ సుందరిని కూడా తీసుకొస్తున్నారట.

3 నిమిషాలకు రూ. కోటిన్నర ఖర్చు చేస్తూ

3 నిమిషాలకు రూ. కోటిన్నర ఖర్చు చేస్తూ

ప్రభాస్‌కు దేశ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ దృష్ట్యా 'సలార్'ను పాన్ ఇండియా రేంజ్‌తో రూపొందిస్తున్నారు. అందుకు అనుగుణంగానే సినిమాను హై లెవెల్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం మాజీ మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రాను తీసుకున్నారని తెలుస్తోంది. అంతేకాదు, ఆమె కోసం ఏకంగా 3 నిమిషాలకు రూ. కోటిన్నర ఖర్చు చేస్తున్నారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X