టీనేజ్‌లో ప్రియాంక బికినీ ట్రీట్: 18 ఏళ్ల వయసులో ఆమె ఎలా ఉందో చూశారంటే!

చూపు తిప్పుకోకుండా చేయగల అందం.. అద్భుతమైన నటన.. అబ్బురపరిచే హావభావాలు.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇలా ఎన్నో రకాలుగా ప్రేక్షకులను అలరిస్తూ సుదీర్ఘ కాలంగా ఇండియాలోనే టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది ప్రియాంక చోప్రా. చిన్న వయసులోనే తన అందంతో ప్రపంచాన్ని గెలిచిన ఈ సుందరాంగి.. హీరోయిన్ అయిన తర్వాత గ్లోబల్ స్టార్‌గా మారిపోయింది. ఇక, వివాహం తర్వాత స్పీడు తగ్గించినా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ప్రేక్షకులను, అభిమానులు అలరిస్తూనే ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ప్రియాంక చోప్రా ఓ పాత బికినీ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ పిక్‌పై మీరు కూడా ఓ లుక్కేయండి!

చిన్నప్పుడే ప్రపంచ సుందరిగా

చిన్నప్పుడే ప్రపంచ సుందరిగా

హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే ప్రియాంక చోప్రా మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే 2000లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. తద్వారా ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత ఈ అమ్మడు సినిమాల్లోకి పరిచయమైంది. అలా తక్కువ సమయంలోనే స్టార్‌గా మారిపోయి.. సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తోంది.

గ్లోబల్ స్టార్‌గా... లవ్‌లో పడింది

గ్లోబల్ స్టార్‌గా... లవ్‌లో పడింది

సుదీర్ఘమైన ప్రయాణంలో ప్రియాంక చోప్రా హిందీలోనే కాకుండా చాలా భాషల్లో సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే హాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చి.. అక్కడ ఈ భామ పలు వెబ్ సిరీస్‌లతో పాటు కొన్ని ఆంగ్ల చిత్రాలు, ప్రైవేట్ ఆల్బమ్‌లను చేసింది. తద్వారా గ్లోబల్ స్టార్‌గా ఎదిగింది. ఆ సమయంలోనే ప్రియాంక చోప్రా.. తన కంటే చిన్నోడైన సింగర్ నిక్ జోనస్‌తో ప్రేమలో పడింది.

నిక్‌తో వివాహం.. కల్చర్ మార్చి

నిక్‌తో వివాహం.. కల్చర్ మార్చి

చాలా కాలం పాటు నిక్ జోనస్‌తో డేటింగ్ చేసిన తర్వాత ప్రియాంక చోప్రా 2018 డిసెంబర్‌లో అతడిని పెళ్లి చేసుకుంది. వైభవంగా జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చారు. వివాహం తర్వాత ప్రియాంక పూర్తిగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఫారెన్ కల్చర్‌ను అలవాటు చేసుకున్న ఈ బ్యూటీ.. మితిమీరిన హాట్ ట్రీట్‌తో రెచ్చిపోతోంది.

డివోర్స్ అంటే.. తల్లైన బ్యూటీ

డివోర్స్ అంటే.. తల్లైన బ్యూటీ

పెళ్లి తర్వాత ప్రియాంక చోప్రా తన భర్త నిక్‌ జోనస్‌తో కలిసి తెగ ఎంజాయ్ చేస్తోంది. అయితే, వీళ్లిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. కానీ, వీటిని ప్రియాంక చోప్రా ఖండించింది. దీంతో ఈ వార్తలకు పుల్‌స్టాప్ పడింది. ఇదిలా ఉండగా.. కొద్ది రోజుల క్రితమే నిక్ దంపతులు సరోగసి ద్వారా ఓ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

అందులో మాత్రం ఫుల్ బిజీగా

అందులో మాత్రం ఫుల్ బిజీగా

అప్పట్లో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపినా.. ఇప్పుడు వెండితెరపై పెద్దగా సందడి చేయకున్నా.. ప్రియాంక చోప్రా మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా తన వ్యక్తిగత, సినీ సంబంధ విషయాలు వెల్లడిస్తూ ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటోంది.

గ్లామర్ ట్రీట్ ఇస్తూ రచ్చ చేస్తూ

గ్లామర్ ట్రీట్ ఇస్తూ రచ్చ చేస్తూ


ఇండియాలోని మిగిలిన హీరోయిన్లతో పోలిస్తే ప్రియాంక చోప్రా మరింత ఎక్కువగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటుందన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తన ఫొటోలు, వీడియోలు వదులుతుంది. వీటిలో ఎక్కువ శాతం అందాలు ఆరబోస్తూ దిగినవే ఉంటాయి. మరీ ముఖ్యంగా బికినీ ధరించిన ఫొటోలను కూడా ప్రియాంక షేర్ చేస్తూ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

టీనేజ్ బికినీ పిక్ వదిలిందిగా

టీనేజ్ బికినీ పిక్ వదిలిందిగా

చాలా ఏళ్లుగా సోషల్ మీడియాలో తెగ సందడి చేసే ప్రియాంక చోప్రా తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బికినీ మాత్రమే ధరించి ఘాటు ఫోజులు ఇచ్చింది. అయితే, ఇది తన 18వ ఏట దిగిన పిక్ అని ఆమె తెలిపింది. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇది విపరీతంగా వైరల్ అయిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X