షర్ట్ విప్పేసి ప్రియాంక చోప్రా హాట్ ట్రీట్: పైనుంచి అందాలను చూపిస్తూ ఘాటుగా!
భారతీయ చలన చిత్ర రంగంలో ఎంతో మంది స్టార్ హీరోయిన్లుగా వెలుగొందిన సంగతి తెలిసిందే. అందులో కొందరు మాత్రమే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును దక్కించుకున్నారు. తద్వారా గ్లోబల్ బ్యూటీగా పేరు సంపాదించుకున్నారు. అలాంటి వారిలో ముందుగా చెప్పాల్సిన పేరు ప్రియాంక చోప్రా. మిస్ వరల్డ్‌గా ఎంపికైన తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. వెనుదిరిగి చూసుకునే పరిస్థితే రాలేదు. అంతలా ఈ అమ్మడు ప్రభావాన్ని చూపించింది.
ఈ క్రమంలోనే హాలీవుడ్‌లోనూ నటించింది. ఇక, నిక్ జోనస్‌ను వివాహం చేసుకున్న తర్వాత పంథాను మార్చుకున్న ప్రియాంక.. తరచూ హాట్ ట్రీట్ ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ సెల్ఫీని వదిలింది. దానిపై మీరూ లుక్కేయండి!

చిన్న వయసులోనే మిస్ వరల్డ్
ప్రియాంక చోప్రా టీనేజ్‌లోనే మోడల్‌గా తన కెరీర్‌ను ఆరంభించింది. ఈ క్రమంలోనే అప్పట్లోనే ఎన్నో అందాల పోటీల్లో పాల్గొని దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత అంటే 2000లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. తద్వారా ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ అమ్మడు చిన్న వయసులోనే వరల్డ్ వైడ్‌గా ఫేమస్ అయిపోయింది.

సినిమాల్లోకి ఎంట్రీ... స్టార్‌డమ్
మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్న ప్రియాంక చోప్రా ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. దీంతో ఆమెకు సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 2002లో 'తమీజాన్' అనే తమిళ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ వెంటనే బాలీవుడ్‌లోకి సైతం అడుగు పెట్టింది. అక్కడి నుంచి వెనుదిరిగి చూడకుండా దాదాపు ఇరవై ఏళ్లుగా తన హవాను చూపిస్తూ దూసుకపోయింది.

హాలీవుడ్‌లోకి వెళ్లి... లవ్ ట్రాక్
సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో భాషల్లో నటించిన ప్రియాంక చోప్రా.. కొన్నేళ్ల క్రితమే హాలీవుడ్‌లోకి సైతం అడుగు పెట్టింది. అక్కడ ఈ భామ పలు వెబ్ సిరీస్‌లతో పాటు కొన్ని ఆంగ్ల చిత్రాలు, ప్రైవేట్ ఆల్బమ్‌లను కూడా చేసింది. తద్వారా గ్లోబల్ స్టార్ అయింది. అదే సమయంలోనే ప్రియాంక చోప్రా.. తన కంటే చిన్నోడైన అయిన అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌తో లవ్ ట్రాక్‌నూ నడిపింది.

నిక్‌తో పెళ్లి తర్వాత మారింది
ప్రియాంక చోప్రా.. నిక్ జోనస్‌తో డేటింగ్ చేస్తున్న విషయం బయటకు రావడం అప్పట్లో సంచలనం అయింది. చాలా రోజుల పాటు అతడితో ప్రేమాయణం సాగించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ఇండియాలో వివాహం చేసుకుంది. వైభవంగా జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చారు. వివాహం తర్వాత ప్రియాంక పూర్తిగా మారిపోయింది.

అందులో మాత్రం ఫుల్ బిజీగా
అప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నా.. ఈ మధ్య అవకాశాలు లేక ఖాళీగా ఉన్నా హీరోయిన్ ప్రియాంక చోప్రా మాత్రం సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది.

ఎక్కువగా అలాంటివే వదిలి
మిగిలిన హీరోయిన్లతో పోలిస్తే ప్రియాంక చోప్రా మరింత ఎక్కువగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటుందన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తన ఫొటోలు, వీడియోలు వదులుతుంది. వీటిలో ఎక్కువ శాతం అందాలు ఆరబోస్తూ దిగినవే ఉంటాయి. మరీ ముఖ్యంగా బికినీ ధరించిన ఫొటోలను కూడా ప్రియాంక షేర్ చేస్తూ ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది.

టాప్ యాంగిల్ సెల్ఫీతో రచ్చ
సోషల్ మీడియాలో తెగ సందడి చేసే ప్రియాంక చోప్రా తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో ఒక పిక్ మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది. దీనికి కారణం ఇందులో ఆ అమ్మడు షర్ట్ బటన్స్ తీసేసి టాప్ యాంగిల్ నుంచి సెల్ఫీ తీసుకోవడమే. దీంతో ప్రియాంక చోప్రా ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఇది వైరల్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











