Priyanka Chopra హాట్ ఫోటోషూట్‌తో టాప్ ట్రెండింగ్‌.. రెండు చిత్రాలతో ఆస్కార్ రేసులో ప్రియాంక చోప్రా

గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా మీడియా హెడ్‌లైన్స్‌ను ఆకర్షించడం కొత్తేమీ కాదు. ఎదో ఒక విషయంపై సోషల్ మీడియాలోని ఏదో ఒక ఫ్లాట్‌ఫార్మ్స్‌లో ప్రియాంక ట్రెండింగ్ అవుతూ కనిపిస్తుంటారు. తన అభిమానులకు గ్లామర్ ట్రీట్ ఇస్తూనో లేదా ఏదో విషయం మీద మాట్లాడుతుంటూ హాట్ టాపిక్ అవుతుంటారు. తాజాగా ప్రియాంక చోప్రా మరోసారి అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యారు. ప్రియాంక చోప్రాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ముంబై, న్యూయార్క్ మధ్య

ముంబై, న్యూయార్క్ మధ్య

బాలీవుడ్‌లో టాప్ ప్లేస్‌లో ఉండగానే.. స్టార్ హీరోయిన్‌ స్టేటస్‌తో అమెరికాలోని మ్యూజిక్ సెలబ్రిటి నిక్ జోనస్‌ను ప్రియాంక చోప్రా వివాహం చేసుకొన్నారు. అప్పటి నుంచి ముంబైకి, న్యూయార్క్‌కు షటిల్ కొడుతూ ఉన్నారు. అయితే బాలీవుడ్‌ ప్రేక్షకులకు చేరువగానే ఉంటూ హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు.

బాలీవుడ్, హాలీవుడ్‌ను బ్యాలెన్స్ చేస్తూ..

బాలీవుడ్, హాలీవుడ్‌ను బ్యాలెన్స్ చేస్తూ..

ప్రియాంక చోప్రా బాలీవుడ్‌ను హాలీవుడ్‌ను మెయింటెన్ చూస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల ప్రియాంక చోప్రా వీ ఆర్ వన్ ఫ్యామిలీ అనే షార్ట్ ఫిలింలోను, అలాగే వీ కెన్ బీ హీరోస్ అనే డాక్యుమెంటరీలో నటించారు. అంతేకాకుండా ది వైట్ టైగర్ వెబ్ మూవీలో నటించారు. ఇక తాజాగా ది మ్యాట్రిక్స్ రిస్సరెక్షన్ చిత్రంలో నటించి మెప్పించారు. అయితే ఈ చిత్రం ఆస్కార్ బరిలో నిలవడంతో మరోసారి ప్రియాంక చోప్రా ట్రెండింగ్‌లోకి వచ్చారు.

 ప్రియాంక నటించిన చిత్రాలు ఆస్కార్ బరిలో

ప్రియాంక నటించిన చిత్రాలు ఆస్కార్ బరిలో

అయితే ప్రియాంక చోప్రా నటించిన రెండు చిత్రాలు ఆస్కార్ బరిలో నిలవడం ఇప్పుడు విశేషంగా మారింది. మ్యాట్రిక్స్ 4 చిత్రంలో ఆమె కీను రీవ్స్, జెస్సీకా హెన్‌విక్, క్యారీ అన్నే మాస్‌తో కలిసి నటించి విమర్శకుల ప్రశంసలు అందుకొన్నది. డిసెంబర్‌ చివర్లో రిలీజైన ఈ చిత్రం ప్రస్తుతం హెచ్‌బీవో మ్యాచ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది.

టాప్ మూవీస్‌తో ప్రియాంక సినిమా పోటీ

టాప్ మూవీస్‌తో ప్రియాంక సినిమా పోటీ

ఆస్కార్ అవార్డుల్లో భాగంగా ఉత్తమ చిత్రం రేసులో ప్రియాంక చోప్రా నటించిన మ్యాట్రిక్స్ రిస్సరెక్షన్ చిత్రంతోపాటు స్పైడర్ మ్యాన్: నో వే హోమ్, షాంగ్ చీ, ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్, ది హార్డర్ దే ఫాల్, హౌస్ ఆఫ్ గుస్పి లాంటి చిత్రాలు ప్రతిష్టాత్మక అవార్డు కోసం పోటీ పడుతున్నాయి. ఇదిలా ఉంటే.. భారత్ నుంచి సూర్య నటించిన జై భీమ్ చిత్రం కూడా ఈ సారి పోటీ పడటం విశేషంగా మారింది.

అన్‌ఫినిష్‌డ్ మరో వెర్షన్‌తో

అన్‌ఫినిష్‌డ్ మరో వెర్షన్‌తో

ఆస్కార్ అవార్డుల విషయాన్ని పక్కన పెడితే.. తన జీవితంలోని కీలక సంఘటనలను, తన అనుభూతులను అన్‌ఫినిషిడ్ అనే పుస్తక రూపంలో బయోగ్రఫిని ప్రియాంక చోప్రా అందుబాటులోకి తెచ్చింది. ఈ పుస్తకంలో పలు సంచలన విషయాలను వెల్లడించారు. ఈ పుస్తకానికి సంబంధించిన పేపర్ బ్యాక్ ఎడిషన్‌ను తిరిగి ప్రచురించారు. ఈ పుస్తకం మార్కెట్‌లో అందుబాటులో ఉంది.. కావాలనుకొనే వాళ్లు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు అని ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు.

 వ్యానిటీ ఫెయిర్ కోసం హాట్ ఫోటోషూట్

వ్యానిటీ ఫెయిర్ కోసం హాట్ ఫోటోషూట్


ఇదిలా ఉండగా, ప్రియాంక చోప్రా వ్యానిటి ఫెయిర్ ఫిబ్రవరి ఎడిషన్ కోసం ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోషూట్‌లో ప్రియాంక చోప్రా హాట్ హాట్‌గా కనిపించింది. ఎద అందాలను బయటపెడుతూ గతంలో ఎన్నడూ కనిపించని విధంగా మరింత హాట్‌గా ఫోటోషూట్‌తో షేక్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X