నా భర్త వయసులో చిన్నోడే.. అందులో మాత్రం అస్సలు తగ్గడు: పెదవి విప్పిన స్టార్ హీరోయిన్

ఇండియా వ్యాప్తంగా ఎంతో మంది హీరోయిన్లు స్టార్లుగా చెలామణీ అవుతున్నారు. కానీ, అందులో కొందరు మాత్రం వరల్డ్ వైడ్‌గా హాట్ టాపిక్ అవుతున్నారు. అలాంటి వారిలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఒకరు. అందంతో టీనేజ్‌లోనే మాయ చేసిన ఈ అమ్మడు.. సినిమా నటిగా సుదీర్ఘ కాలం పాటు ప్రభావాన్ని చూపించింది. అయితే, ఈ మధ్య ఆశించిన స్థాయిలో సినిమాలు చేయట్లేదు. కానీ, వైవాహిక జీవితాన్ని మాత్రం చక్కగా గడుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రియాంక చోప్రా తన భర్త ఏజ్ గురించి తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ సంగతులు మీకోసమే!

ప్రపంచాన్ని గెలిచిన బ్యూటీ
ప్రియాంక చోప్రా 2000 సంవత్సరంలో జరిగిన అందాల పోటీల్లో మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకుంది. అప్పటి నుంచి చాలా కాలం పాటు బాలీవుడ్‌లో నటిస్తూ తన హవాను చూపించింది. ఇలా సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న ఆమె.. కొద్ది రోజుల క్రితం హాలీవుడ్‌లోకీ ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే కొన్ని వెబ్ సిరీస్‌లలో నటించి సత్తా చాటుకుంది.

Priyanka Chopra Unexpected Comments On Nick Jonas Age

హాలీవుడ్‌కు వెళ్లి పెళ్లాడింది
హాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన కొద్ది రోజులకే ప్రియాంక చోప్రా.. అమెరికాకు చెందిన పాప్ సింగర్ నిక్ జోనస్‌తో లవ్‌లో పడింది. తనకంటే చిన్న వాడే అయినా అతడితో చాలా కాలం పాటు సీక్రెట్‌గా డేటింగ్ చేసింది. ఈ విషయం బయటకు వచ్చిన కొద్ది రోజులకే ప్రియాంక.. నిక్‌ను వివాహం చేసుకుంది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుక అప్పట్లో వరల్డ్ వైడ్‌గా హైలైట్ అయింది.

అక్కడే స్థిరపడింది.. స్లోగానే
వివాహం చేసుకున్న తర్వాత ప్రియాంక చోప్రా ఇండియాకే తిరిగి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఈ చిన్నది విదేశాల్లోనే స్థిరపడిపోయింది. అక్కడ కొన్ని వ్యాపారాలను సైతం ప్రారంభించింది. అలాగే, సరోగసి ద్వారా కొన్నేళ్ల క్రితమే తల్లి కూడా అయింది. దీంతో చాలా రోజుల నుంచి ప్రియాంక చాలా స్లోగానే సినిమాలు చేస్తూ వస్తోంది.

Priyanka Chopra Unexpected Comments On Nick Jonas Age

ఈ మధ్య అలాంటి వాటిలో
ప్రియాంక చోప్రా పెళ్లి తర్వాత తన వైవాహిక జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తోంది. అలాగే, మధ్య మధ్యలో యాడ్స్, వెబ్ సిరీస్‌లు కూడా చేస్తోంది. ఈ క్రమంలోనే గత ఏడాది Citadel అనే వెబ్ సిరీస్‌లో నటించింది. దీనికి భారీ రెస్పాన్స్ లభించింది. దీనితో పాటు 'లవ్ అగైన్' మూవీతో వచ్చింది. ఇప్పుడు పీసీ 'హెడ్స్ ఆఫ్ స్టేట్', 'టైగర్' అనే సినిమాలు చేస్తోంది.

భర్త ఏజ్ గ్యాప్‌పై కామెంట్
తన కంటే వయసులో పదేళ్ల చిన్నవాడైన నిక్‌ జోనస్‌ను ప్రియాంక చోప్రా వివాహం చేసుకుందని తెలిసిందే. ఆ సమయంలో వీళ్లిద్దరి ఏజ్ గ్యాప్ గురించి ఎన్నో విమర్శలు వచ్చాయి. తాజాగా జరిగిన ఓ అంతర్జాతీయ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై ఆమె స్పందించింది. ఆ సమయంలో ప్రియాంక 'భర్తతో కాపురం చేయడానికి వయసుతో పనేముంది' అని కామెంట్ చేసింది.

Priyanka Chopra Unexpected Comments On Nick Jonas Age

అందులో మాత్రం పెద్దోడు
ప్రియాంక కంటిన్యూ చేస్తూ 'వయసులో తేడా ఉన్నా కూడా మేము అందరిలాగే మంచిగానే ఉంటున్నాం. ఒకవేళ మాకు ఏదైనా గొడవ జరిగినా సామరస్యంగా పరిష్కరించుకుంటాం. నిజానికి నిక్ ఏజ్‌లో చిన్నోడైనా ఆలోచించడంలో మాత్రం నాకంటే పెద్దోడే. కొన్ని సందర్భాల్లో మనసుతో ఆలోచిస్తాడు. అందుకే అతడితో నాకు కంఫర్ట్‌గా ఉంటుంది' అంటూ చెప్పొకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X