RRR పై ప్రియాంక చోప్రా ఊహించని కామెంట్.. తప్పుడు ప్రచారం చేయడంతో ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం!
బాలీవుడ్ నుండి హాలీవుడ్ కు వెళ్లిపోయి అక్కడే సెటిలైపోయిన బ్యూటీ ప్రియాంక చోప్రా వ్యాఖ్యలు పెను దుమారాన్ని సృష్టిస్తున్నాయి. బాలీవుడ్ రాజకీయాలతో తాను విసిగిపోయాయని అందుకే తాను హాలీవుడ్ కు వెళ్లిపోయినట్లు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఆర్ఆర్ఆర్ పై చేసిన వ్యాఖ్యలతో తెలుగు నెటిజన్లు ప్రియాంక చోప్రాను ఫుల్ గా ట్రోల్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

ఎలాంటి సినిమా చేసినా
బ్యూటీఫుల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా చాలా హార్డ్ వర్క్ చేసి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు అందుకుంది. మొదట ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న సినిమాలు చేసుకుంటూ ఏడాదిలోనే స్టార్ హీరోలతో నటించే అవకాశం అందుకుంది. ఎలాంటి సినిమా చేసినా కూడా తన పాత్ర భిన్నంగా ఉండేలా చూసుకుంది. ఆ విధంగా ఆలోచించి బాలీవుడ్ లో చాలా కాలం పాటు కొనసాగింది.

క్రేజ్ పెంచుకునే ప్రయత్నం
ఇక ప్రియాంక చోప్రా బాలీవుడ్ అనంతరం హాలీవుడ్ కు మకాం మార్చేసింది. అక్కడ కూడా విభిన్నమైన సినిమాల్లో నటిస్తూ తన క్రేజ్ పెంచుకునే ప్రయత్నం చేసింది. ఇక అమ్మడు 2019లో తనకంటే చిన్న వాడైన సింగర్ నిక్ ను పెళ్లాడి ఒక పండండి బిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఇప్పుడు కూడా ఆమె సినిమా ఇండస్ట్రీలో బిజీ అయ్యే ప్రయత్నం చేస్తోంది.

ఇబ్బందుల గురించి
అయితే నిత్యం ప్రియాంక ఎదో ఒక వార్తతో వైరల్ అవుతోంది. హిందీ చిత్రసీమలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది. బాలీవుడ్ లో తనను ఓ మూలకు తోసేశారని, ఎవరూ అవకాశాలు ఇచ్చేవారు కాదని చెప్పింది.
బాలీవుడ్ రాజకీయాలతో తాను పూర్తిగా విసిగిపోయానని, ఇక బాలీవుడ్ నుండి బ్రేక్ తీసుకోవాలని పించిందని అలా అమెరికా వచ్చేసినట్లు ప్రియాంక చెప్పింది. ప్రియాంక చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త వైరల్ గా మారి బాలీవుడ్ నెపోటిజంపై విమర్శలు వస్తున్నాయి.

మానసికంగా వేధించాడని
ప్రియాంకా చోప్రా వ్యాఖ్యలపై స్పందించిన కంగనా రనౌత్.. ప్రియాంకను కరణ్ జోహారే మానసికంగా వేధించాడని ఆరోపణలు చేసింది. బాలీవుడ్ లో కొందరు గ్యాంగ్ గా మారి ప్రియాంకను అవమానించారని, స్వయం కృషితో ఎదిగిన మహిళను భారత్ వదిలి వెళ్లిపోయేలా చేశారని కంగనా ఆరోపించింది. షారూఖ్ ఖాన్ తో ప్రియాంక ఫ్రెండ్‌షిప్ చేయడం కరణ్ కు నచ్చలేదని, అందుకే ఆమెను బ్యాన్ చేశారని చెప్పుకొచ్చింది కంగనా.

RRR సినిమాపై..
అయితే ఇటీవల అమెరికా పాడ్ క్యాస్ట్ షో 'ఆర్మ్‌చైర్ ఎక్స్‌పర్ట్'లో ప్రియాంక చోప్రా పాల్గొంది. ఇందులో తన జీవితానికి, సినిమాలకు సంబంధించి చాలా విషయాలు షేరు చేసుకుంది. వివిధ అంశాలపై మాట్లాడుతూ పాడ్ క్యాస్ట్ హోస్టులు ఇటీవల ఆస్కార్ అందుకున్న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని బాలీవుడ్ సినిమా అని తప్పుగా చెప్పుకొచ్చారు.

తమిళ సినిమా అనడంతో..
దీనిపై వెంటనే స్పందించిన ప్రియాంక చోప్రా ఆర్ఆర్ఆర్ బాలీవుడ్ సినిమా కాదని చెబుతూ అది తమిళ సినిమా అని చెప్పింది. ఇండియా నుండి ఆస్కార్ అందుకున్న చిత్రం కూడా ఏ భాషా చిత్రమో తెలియదా అంటూ తెలుగు నెటిజన్లు ప్రియాంక చోప్రాను ట్రోల్ చేస్తున్నారు. అందుకే రాజమౌళి ఆర్ఆర్ఆర్ ను తెలుగు సినిమా అంటూ అమెరికాలో ప్రమోట్ చేశారని కొందరు కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











