For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బ్రాలెస్ ఫొటోతో షాకిచ్చిన ప్రియాంక చోప్రా: లేటు వయసులో ఘాటుగా.. వాళ్ల కోసమే అలా చూపించింది!

  |

  ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు రెండు దశాబ్దాలుగా భారతీయ చలన చిత్ర రంగంలో తన హవాను చూపించి.. స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా. చూపు తిప్పుకోకుండా చేసే అందం.. కట్టిపడేసే యాక్టింగ్‌తో ఎంతో కాలంగా ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ బ్యూటీ.. భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే హాలీవుడ్‌లోనూ అడుగెట్టింది. అదే సమయంలో పాప్ సింగర్‌ను పెళ్లాడింది. అప్పటి నుంచి పంథాను మార్చుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ హాట్ ఫొటోషూట్‌తో సెగలు రేపుతోంది. ఆ వివరాలు మీకోసం!

  టీనేజ్‌లోనే ప్రపంచాన్ని గెలిచిన ప్రియాంక

  టీనేజ్‌లోనే ప్రపంచాన్ని గెలిచిన ప్రియాంక

  చాలా చిన్న వయసులోనే మోడలింగ్ రంగం వైపు అడుగు వేసింది ప్రియాంక చోప్రా. ఆ సమయంలోనే ఎన్నో అందాల పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. అలా ప్రపంచ స్థాయి పోటీల్లోనూ పాల్గొనే అవకాశాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే 2000లో మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకుంది. తద్వారా ఆమె ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అవడంతో పాటు భారతదేశ ఖ్యాతిని కూడా చాటి చెప్పింది.

  బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ హవా

  బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ హవా

  మిస్ వరల్డ్‌గా గెలిచిన తర్వాత ప్రియాంక చోప్రాకు సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 2002లో 'తమీజాన్' అనే తమిళ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ వెంటనే బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. అలా దాదాపు ఇరవై ఏళ్లుగా ఉత్తరాది నుంచి దక్షిణాది వరకూ ఉన్న పలు భాషల్లో హీరోయిన్‌గా నటించింది. తద్వారా టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.

  హాలీవుడ్‌లోకి ఎంట్రీ.. ప్రేమలో పడిందిగా

  హాలీవుడ్‌లోకి ఎంట్రీ.. ప్రేమలో పడిందిగా

  దాదాపు ఇరవై ఏళ్ల పాటు తన మార్క్ చూపిస్తూ దూసుకుపోయిన ప్రియాంక.. కొన్నేళ్ల క్రితం హాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇంగ్లీష్‌లో కొన్ని వెబ్ సిరీస్‌లలో నటించిన ఈ బ్యూటీ.. అప్పుడే అమెరికాకు చెందిన నికో జోనస్ అనే పాప్ సింగర్‌తో ప్రేమలో పడింది. తనకంటే వయసులో చిన్నోడు అయిన అతడితో డేటింగ్ చేసి ఆ తర్వాత గ్రాండ్‌గా వివాహం చేసుకుంది.

  అక్కడికి వెళ్లింది.. స్టైల్‌ను మార్చుకుంది

  అక్కడికి వెళ్లింది.. స్టైల్‌ను మార్చుకుంది

  ఎప్పుడైతే అమెరికాలో అడుగు పెట్టిందో అప్పటి నుంచే ప్రియాంక వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. ఇక, నిక్ జోనస్‌ను వివాహం చేసుకున్న తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పులు వచ్చాయి. పాశ్చాత్యులు వేసుకునే బట్టలను ధరించడంతో పాటు పబ్ కల్చర్‌ను అలవాటు చేసుకుంది. అలాగే, సిగరెట్ స్మోకింగ్ కూడా చేస్తోంది. దీంతో ఈ అమ్మడిపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు.

  ఎప్పుడూ అందులోనే.. అన్నీ చెబుతోంది

  ఎప్పుడూ అందులోనే.. అన్నీ చెబుతోంది


  కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో కెరీర్ సంబంధిత విశేషాలను సైతం ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. ఈ కారణంగానే ఆమెకు భారీ స్థాయిలో క్రేజ్ ఏర్పడి.. ఫాలోవర్లు ఎక్కువగా ఉన్నారు.

   ఎక్కువగా అలాంటివే... రచ్చ చేస్తుందిగా

  ఎక్కువగా అలాంటివే... రచ్చ చేస్తుందిగా


  ప్రియాంక చోప్రా సోషల్ మీడియా ద్వారా కూడా ఎంతగానో సంపాదిస్తోంది. ఆమె చేసే ఒక్కో పోస్టుకు లక్షల్లో ఆదాయం లభిస్తోంది. దీంతో తరచూ ఈ బ్యూటీ ఏదో ఒక పోస్టుతో హల్‌చల్ చేస్తోంది. మరీ ముఖ్యంగా అందాల విందు చేస్తూ రచ్చ చేస్తోంది ప్రియాంక. గ్లామర్ ట్రీట్ చేసేలా బికినీ ఫొటోలనో, క్లీవేజ్ షో చేస్తూ దిగిన ఫొటోలనో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సెగలు రేపుతోందామె.

  Recommended Video

  Salaar : Prabhas తో Priyanka Chopra స్పెషల్ సాంగ్.. భారీగానే ఆఫర్ చేశారు..!!
  బ్రాలెస్ ఫొటోతో షాకిచ్చిన ప్రియాంక చోప్రా

  బ్రాలెస్ ఫొటోతో షాకిచ్చిన ప్రియాంక చోప్రా

  ప్రియాంక చోప్రా తాజాగా వోగ్ ఆస్ట్రేలియా మేగజైన్ కవర్ ఫొటో కోసం ఓ ఫొటోషూట్ చేసింది. దాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేసిందామె. అందులో ఈ బ్యూటీ బ్రాలెస్ తెలుపు రంగు డ్రెస్ వేసుకుని ఉంది. దీంతో ఆమె ఎద అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తద్వారా ప్రియాంక హైలైట్ అవుతోంది.

  English summary
  Bollywood Star Actress Priyanka Chopra Recently Done Hot Photoshoot for Australian Vogue Magazine. In This Photo She done Cleavage Show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X