ప్రియాంక చోప్రా జాకెట్‌పై అలాంటి బొమ్మ..డిజైనర్ డ్రెస్ ట్రెండింగ్.. ప్రియుడితో కలిసి అలా..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా అంతర్జాతీయ సినీ వేదికలపై దుమ్ము రేపుతున్నారు. ఇటీవల ఆస్కార్ అవార్డుల వేదికపై అలాగే మరికొన్ని ఫ్యాషన్ షోలతో తనదైన శైలిలో వస్త్రాలను ధరిస్తూ ఇంటర్నేషనల్ మీడియాను విశేషంగా ఆకర్షిస్తున్నారు. తాజాగా మరోసారి ప్రియాంక చోప్రా డ్రస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ డ్రెస్ వివరాల్లోకి వెళితే...
స్విమ్మింగ్ ఫూల్‌లో గ్లామర్ షో.. బికినీలో రాయ్ లక్ష్మీ మరింత శృంగారంగా (ఫోటోలు)

అందమైన లోకేషన్‌లో ఒంటరిగా
అందాల భామ ప్రియాంక చోప్రా తన భర్త చేతిలో చేయి వేసి ఓ బ్యూటీఫుల్ లోకేషన్‌లో నడుస్తుండగా వెనుక నుంచి ఫోటో తీశారు. వారిద్దరి కెమిస్ట్రీ ఆ ఫోటోలో బ్రహ్మండంగా పడింది. అయితే వారిద్దరి కెమిస్ట్రీతోపాటు ప్రియాంక జాకెట్ మీద ఉన్న కాళికా మాత ఫోటో మరింత ఆకర్షణగా మారింది.
ముఖానికి మాస్క్ వేసుకొని.. పొట్టి బట్టలతో యువ హీరోయిన్ గ్లామర్ షో...

నిక్ జోనస్ షేర్ చేసిన ఫోటో
అయితే ప్రియాంకతో పెళ్లి జరిగిన కొద్ది రోజులకు వారిద్దరి స్పెషల్ టైమ్‌ను ఎంజాయ్ చేస్తుండగా తీసిన ఫోటోను నిక్ జోనస్ షేర్ చేశారు. అయితే ఆ ఫోటోను తాజాగా ప్రియాంక చోప్రా ఫ్యాన్ క్లబ్స్ షేర్ చేయగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. నెటిజన్లు, అభిమానులు రకరకాలుగా తమ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
లాక్‌డౌన్‌లో ముంబై వీధుల్లో సోనాల్ చౌహాన్ హంగామా (ఫోటోలు)

నెటిజన్ల కామెంట్లు జోరుగా
ప్రియాంక చోప్రా వీపు భాగంలో కాళికా మాత ఫోటోను డిజైన్ చేసుకోవడంపై కొందరు అతిగా స్పందిస్తున్నారు. అయితే మరికొందరు డిజైన్ బాగుంది.. డిజైనర్ ఎవరు ? అంటూ కామెంట్లు పెడుతున్నారు. దేవతల బొమ్మను వస్త్రాలపై ధరించవద్దు అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. పవర్ ఉన్న బొమ్మలతో వస్త్రాలను ధరించే సత్తా ప్రియాంకకే ఉందంటూ కామెంట్ చేస్తున్నారు.

కోవిడ్ రిలీఫ్ ఫండ్ కోసం ప్రియాంక చోప్రా
ఇదిలా ఉండగా, భారత్‌లో కరోనావైరస్‌తో బాధపడుతున్న వారికి సహాయం అందించేందుకు ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్‌తో కలిసి కోవిడ్ 19 రిలీఫ్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి హాలీవుడ్‌లో విశేషంగా ఆదరణ లభిస్తున్నది.
Recommended Video

ప్రియాంక చోప్రాకు హాలీవుడ్ మద్దతు
ప్రియాంక చేపట్టిన కోవిడ్ 19 రిలీఫ్ ఫండ్‌పై హాలీవుడ్ నటుడు డ్రివ్ బ్యారీమోర్ స్పందించారు. కష్టాల్లో ఉన్న భారత్‌కు నా ప్రేమను, సహాయాన్ని హృదయపూర్వకంగా ప్రకటించదలిచాను. కోవిడ్ కేసులో భారత్‌లో రికార్డుస్థాయిలో ఉన్నాయి. కబట్టి మనమంతా కలిసి ప్రియాంక చోప్రాకు సహాయం అందిద్దాం అని బ్యారీ మోర్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











