ప్రియాంక చోప్రా ప్రైవేట్ ఫోటోలు ట్రెండింగ్.. ఏకంగా భర్తనే లీక్ చేసి ఫ్యాన్స్‌కు ట్రీట్!
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మళ్లీ భారతీయ సినిమాలతో బిజీగా మారిపోయారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న వారణాసి చిత్రంలో కీలక పాత్రను పోషించడమే కాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబుతో జతకట్టారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగులో బిజీగా ఉంటూనే అమెరికాలో తన కుటుంబంతో వెకేషన్స్ ప్లాన్ చేసుకొని పర్సనల్, ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల భర్త నిక్ జోనస్, కూతురు మల్టాతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఆ వెకేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను తమ సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు ఇన్స్‌టాగ్రామ్, ఇతర ఫ్లాట్‌ఫామ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. వాటికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ప్రియాంక చోప్రా (42), నిక్ జోనస్ (31) మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉన్నప్పటికీ.. వారిద్దరి మధ్య దాంపత్య జీవితం మంచి అవగాహనతో ముందుకు వెళ్తున్నారు. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు.. వారిద్దరూ విడిపోతున్నారంటూ ఇటీవల రూమర్లు క్రియేట్ అయ్యాయి. కానీ అవన్నీ కేవలం గాసిప్స్ మాత్రమే. మా ఇద్దరిని ఎవరూ కూడా విడదీయలేరు అంటూ సంకేతం ఇచ్చేలా నిక్ జోనస్ తమ ప్రైవేట్ ఫోటోలను తమ అభిమానులతో పంచుకొన్నారు. ఈ ఫోటోల్లో కూతురు మాల్టా స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది.

మీడియాకు దూరంగా ఉంటూ తమ కూతురుతో కలిసి ప్రియాంక, నిక్ జోనస్ తమ వెకేషన్‌ను ప్లాన్ చేసుకొన్నారు. ఈ సీక్రెట్ ప్లేస్‌లో ఇద్దరు, సముద్ర తీరంలో సేద తీరారు. పీసీ, నిక్ ఇద్దరూ ఏకాంత వాతావరణంలో తమ రొమాంటిక్ మూమెంట్స్‌ను షేర్ చేసుకొన్నారు. సముద్రం తీరాన కూతురుతో నిక్ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. వారిద్దరి మధ్య లవ్ అండ్ ఎఫెక్షన్ చూసి ఫ్యాన్స్ ముచ్చటపడిపోతున్నారు.
ఇక ప్రియాంక చోప్రా విషయానికి వస్తే.. చాలా సహజసిద్దంగా తన అందాలను నిక్ కోసం ఆర బోసింది. బికినీలో ఇంతకుముందు కంటే ఎక్కువగా గ్లామర్ పంటను పండించింది. ప్రియాంకను సరదాగా మాల్టా, నిక్ ఆట పట్టిస్తూ ముచ్చట తీర్చుకొన్నట్టు ఫోటోలు స్పష్టం చేశాయి. ఈ ఫోటోలను అభిమానులు లైక్ కొట్టి సంబరపడిపోతున్నారు. ఈ ఫోటోలకు రికార్డు స్థాయిలో లైక్స్, వ్యూస్ వస్తుండటం చూస్తే వారికి ఎంత క్రేజ్ ఉందనే విషయం పూర్తిగా స్పష్టమైంది.
తాజా వెకేషన్‌కు సంబంధించిన ప్రైవేట్ ఫోటోలను నిక్ జోనస్ షేర్ చేయగా.. ఇన్స్‌టాగ్రామ్‌లో భారీ స్పందన లభించింది. ప్రియాంక ఫ్యామిలీ ఫోటోలకు సుమారుగా 5 మిలియన్ల లైక్స్, వ్యూస్ లభించాయి. దాంతో ఈ ఫోటోలు వైరల్ అవ్వడమే కాకుండా ఫ్యాన్స్‌కు మంచి కిక్‌ను అందించాయి. ప్రియాంక చోప్రా, తడి, పొడి అందాలను అభిమానులు ఆస్వాదిస్తున్నారనేది ఈ ట్రెండింగ్ క్లారిటీ ఇచ్చేసింది.
ప్రియాంక చోప్రా కెరీర్ విషయానికి వస్తే.. గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ సినిమా రంగానికి దూరంగా ఉన్నారు. తాజాగా రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ద్వారా మరోసారి ఇండియన్ ఆడియెన్స్‌కు చేరువ కానున్నారు. అలాగే ఈ సినిమా 2027 ప్రథమార్థంలో అంటే ఏప్రిల్‌లో రిలీజ్ చేస్తున్నట్టు అధికానరికంగా ప్రకటన ఇచ్చారు. ఇంకా పలు హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలతో ప్రియాంక ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











