Globe Trotter Event: ఆ విషయమేంటో తెలుసుకుందాం.. అక్కడి రమ్మంటున్న ప్రియాంక చోప్రా

GlobeTrotter Event: సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ SSMB29. ఈ మూవీపై ఎక్కడలేని అంచనాలు పెరిగాయి. ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మొదటి పెద్ద అప్‌డేట్ 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ నేడు రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ స్థాయిలో జరగనుంది. టైటిల్ రివీల్, మహేశ్ బాబు మొదటి లుక్, మూవీ కాన్సెప్ట్ వీడియో ఇవన్నీ ఈ సాయంత్రం విడుదల కానుండటంతో అభిమానుల్లో ఎక్కడ లేని జోష్ నెలకొంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ ప్రియాంక చోప్రా ఓ స్పెషల్ వీడియో విడుదల చేసింది. ఇంతకీ ఏమన్నారంటే..?

గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌ను ప్రపంచ స్థాయిలో ప్రజెంట్ చేయడానికి రాజమౌళి తనదైన శైలిలో అద్భుతమైన ప్లానింగ్ చేశారు. ముఖ్యంగా పాస్‌పోర్ట్ ఆకారంలో రూపొందించిన ఎంట్రీ పాసులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అంతర్జాతీయ కాన్సెప్ట్‌తో ఈవెంట్‌కు ప్రత్యేకమైన థీమ్ సెట్ చేస్తూ జక్కన్న మరోసారి తన క్రియేటివిటీని నిరూపించాడు. ఈవెంట్‌కు సంబంధించిన అన్ని వివరాలను స్వయంగా రాజమౌళి ఒక వీడియో రూపంలో షేర్ చేశారు.

Priyanka Chopra s Mandakini Video Goes Viral Invites Fans to GlobeTrotter Event of SSMB29

ఈ వీడియోలో ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది? ఎంట్రీ రూట్ ఎలా ఉంటుంది? పాల్గొనేవారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను క్లియర్‌గా వివరించారు. దీనితో పాటు సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఓ వీడియోను షేర్ చేస్తూ ఈవెంట్‌పై ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు.

ఇక తాజా హీరోయిన్ ప్రియాంక చోప్రా ఓ స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ప్రియాంక చోప్రా మాట్లాడుతూ..'టుడే బిగ్ డే. నేను ఈవెంట్ కోసం రామోజీ ఫిల్మీం సిటీకి వెళ్తున్నాను. ఈ రోజు నేను చాలా ఎక్సైటింగ్ గా ఉన్.. మీరు కూడా మీ పాస్ పోర్ట్స్ తో ఈవెంట్ కు రండి. అక్కడ కలుసుకుందాం. జాగ్రత్త.. అలాగే అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం.. నేను బ్యాక్ గ్రౌండ్ జరిగే సీక్రెట్ ఏంటో మీకు చెప్తా..' అంటూ ఇంట్రెస్టింగ్ వీడియోను సోషల్ మీడియా పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. హాలీవుడ్-బాలీవుడ్ స్టార్ అయిన ప్రియాంక ఈ ఈవెంట్ కోసం ప్రత్యేకంగా ఇండియాకు రావడం కూడా ఫ్యాన్స్‌లో అదనపు హైప్‌కు కారణమైంది.

SSMB29లో ప్రియాంక పాత్ర 'మందాకిని' అని ఇప్పటికే యూనిట్ ప్రకటించగా, ఆమె ఫస్ట్ లుక్‌పై కూడా భారీ చర్చ నడుస్తోంది. ఈరోజు జరిగే ఈవెంట్‌లో ఆమె పాత్రకు సంబంధించిన విజువల్స్ కూడా ఉండొచ్చని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి గ్లోబల్ ఫేమ్ కలిగిన నటీనటులు, రాజమౌళి మార్క్ ప్రెజెంటేషన్, భారీ స్థాయి ఈవెంట్ అని కలిపి SSMB29 ప్రమోషన్స్‌ని గ్లోబల్ లెవెల్‌కు తీసుకెళ్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X