చున్నీని పక్కకు జరిపి ప్రియాంక జవాల్కర్ టీజింగ్.. చూపులతోనే మత్తెక్కించేస్తోందిగా!

తెలుగు అమ్మాయిలు ఇప్పుడు కాస్త ఎక్కువగానే సినిమాల మీద దృష్టి పెడుతున్నారు. ఎంత మంది వస్తున్నా నటీమణులుగా నిలదొక్కుకునే వారి సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. అయితే అనంతపురంలో పుట్టి పెరిగిన ప్రియాంక జవాల్కర్ అనే అచ్చ తెలుగు అమ్మాయి హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాలతోనే తెలుగు వారికి దగ్గరయింది. చేస్తున్న ప్రతీ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోందనే చెప్పాలి. అందం, అభినయం కలబోతగా ఆమె మంచి సినిమా అవకాశాలు దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ముందు నుంచి కాస్త అందాలు ఆరబోత విషయంలో స్ట్రిక్ట్ గా ఉండే ఆమె ఇప్పుడు మాత్రం అందాలు ఆరబోసేందుకు సిద్దమవుతోంది. ఈ క్రమంలోనే ఎద అందాలు ఆరబోస్తూ చేసిన ప్రియాంక జవాల్కర్ తాజా ఫోటో షూట్ వైరల్ అవుతుంది. దాని మెడ ఒక లుక్కు వేస్తే..

హైదరాబాద్ లో అడుగుపెట్టి

హైదరాబాద్ లో అడుగుపెట్టి


అనంతపురం జిల్లాలో పుట్టి పెరిగిన ప్రియాంకకు చిన్ననాటి నుంచే సినిమాల మీద ఆసక్తి ఏర్పడింది. చినప్పుడు జీన్స్ చిత్రంలో ఐశ్వర్యరాయ్‌ను తెరపైన చూసి హీరోయిన్ కావాలని ఆమె కలలు కనడమే కాదు ఆ కలలు నిజం చేసుకోవడం కోసం చదువు పూర్తయిన వెంటనే హైదరాబాద్ లో అడుగుపెట్టింది. అయితే ఆమె వచ్చిన వెంటనే అవకాశాలు దక్కలేదు.

విజయ్ దేవరకొండతో

విజయ్ దేవరకొండతో


దీంతో తానే అవకశాలను వెతుక్కుంటూ వెళ్లి తొలుత షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఆమె మంచి పేరు సంపాదించింది. తర్వాత ఆమె విజయ్ దేవరకొండ టాక్సీవాలా చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. విజయ్ దేవరకొండతో కలిసి నటించడంతో సినిమా ద్వారా మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ సినిమాలో ఆమె నటనకు అటు క్రిటిక్స్ నుంచే కాక ప్రేక్షకుల నుంచి కూడా మంచి మార్కులు పడ్డాయి.

విజయాన్ని సాధించి

విజయాన్ని సాధించి


ఆ తర్వాత వెంటనే ఆమెకు అవకాశాలు వెల్లువత్తాయి. కానీ ఆమె ఏది పడితే అది ఎంచుకోకుండా టాక్సీవాలా తర్వాత తిమ్మరుసు సినిమా చేసింది. ఈ సినిమా కూడా సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్న ప్రియాంక జువాల్కర్‌ ఆ తరువాత SR కళ్యాణ మండపం అనే సినిమాలో నటించింది. కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది.

ప్రకటన ఏదీ లేదు

ప్రకటన ఏదీ లేదు


ఇక ఆ తర్వాత ఆమె శ్రియ ప్రధాన పాత్రలో నటించిన గమనం అనే సినిమాలో ఒక ముస్లిం అమ్మాయి పాత్రలో నటించింది. ఆ సినిమా కమర్షియల్ హిట్ కాకపోయినా ప్రియాంక పాత్రకు మంచి ప్రశంసలు అయితే దక్కాయి. ఇక ఆ సినిమా తర్వాత ప్రియాంక చేస్తున్న సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఏదీ లేదు.

Recommended Video

Sammathame,Chor Bazaar Movie Review | Kiran Abbavaram | Akash Puri *Reviews |FilmiBeat Telugu
అందాలు ఆరబోస్తూ

అందాలు ఆరబోస్తూ


అయితే మునుపెన్నడూ అందాల ఆరబోత విషయంలో పెద్దగా ముందడుగు వేయని ఈ భామ అందాల ఆరబోతకు తెర తీసింది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో షూట్ అయితే ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. బ్లాక్ డ్రెస్ లో ప్రియాంక క్లీవేజ్ షో చేస్తూ కనీ కనిపించకుండా తన అందాలతో ఊరిస్తూ టీజ్ చేసింది. దీంతో ఆమె ఫోటో షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X