రెడ్ బికిని జాకెట్‌లో ప్రియాంక క్లీవేజ్ షో.. కనిపించని అందాలతో ఊరిస్తూ..!
టాలీవుడ్‌లో సాధరణంగా తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ ఉంటారు. కానీ వచ్చిన కొందరిలో కూడా నిలదొక్కుకునే వారి సంఖ్య ఇంకా తక్కువగా ఉంటుంది. అయితే అనంతపురంలో పుట్టి పెరిగిన ప్రియాంక జవాల్కర్, అచ్చ తెలుగు హీరోయిన్ గా తెలుగు వారికి దగ్గరయింది. చేస్తున్న ప్రతీ మూవీతో తనదైన ఫెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అందం, అభినయం కలబోసి తన పాత్రలకు ప్రియాంక జవాల్కర్ న్యాయం చేస్తూ మన దర్శక నిర్మాతలకు మంచి ఆప్షన్ అవుతున్నారు. అందాలు ఆరబోస్తూ చేసిన ప్రియాంక జవాల్కర్ తాజా ఫోటోషూట్ వైరల్ అవుతున్నది. ఇక ఆ వివరాల్లోకి వెళితే.

చిన్ననాటి నుంచే
అనంతపురం జిల్లాలో పుట్టి పెరిగిన ప్రియాంక బాల్యంలో జీన్స్ చిత్రంలో ఐశ్వర్యరాయ్‌ను తెరపైన చూసి హీరోయిన్ కావాలని కలలు కన్నది. ఆమె కలలు నిజం చేసుకోవడం కోసం హైదరాబాద్ లో అడుగుపెట్టింది. అయితే వచ్చి వచ్చిన వెంటనే ఆమెకు అవకాశాలు దక్కలేదు తొలుత షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఆమె మంచి పేరు సంపాదించింది. తర్వాత ఆమె టాక్సీవాలా చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

మొదటి సినిమాతోనే
విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఈ భామకు ఆ సినిమా ద్వారా మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ సినిమాలో ఆమె నటనకు అటు క్రిటిక్స్ నుంచి, ఇటు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత వెంటనే ఆమెకు అవకాశాలు వెల్లువత్తాయి. కానీ ఆమె టెంప్ట్ కాకుండా తన టాలెంట్ కు తగిన పాత్రల కోసం వేచి చూసింది. టాక్సీవాలా తర్వాత ఆమె నటించిన తిమ్మరుసు సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ప్రశంసలు అందుకుని
ఈ సినిమా కూడా సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా ప్రియాంక జువాల్కర్ నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తరువాత ఆమె SR కల్యాణ మండపం అనే సినిమాలో నటించింది. కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఆ తర్వాత ఆమె శ్రేయ ప్రధాన పాత్రలో నటించిన గమనం అనే సినిమాలో ఒక ముస్లిం అమ్మాయి పాత్రలో నటించింది. ఆ సినిమా కమర్షియల్ హిట్ కాక పోయినా ప్రియాంక పాత్రకు మంచి ప్రశంసలు అందుకుంది.

చర్చనీయాంశం
ఇక ఆ సినిమా తరువాత ఆమె తదుపరి ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఏదీ లేదు. అయితే మునుపెన్నడూ అందాల ఆరబోత విషయంలో పెద్దగా ఆసక్తి చూపని ఆమె అవకాశాల కోసమో మరేమిటో తెలియదు కానీ అందాల ఆరబోతకు తెర తీసింది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో షూట్ అయితే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

రెడ్ బికిని జాకెట్‌లో
రెడ్ బికిని జాకెట్‌లో ప్రియాంక క్లీవేజ్ షో చేస్తూ కనీ కనిపించకుండా తన అందాలతో ఊరిస్తూ టీజ్ చేసింది. ఇక ఆమె ఫోటో షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. ఆమెను చూసిన అభిమానులు ఇంత హాట్ నెస్ తట్టుకోవడం కష్టమే సుమీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











