టాక్సీవాలా హీరోయిన్ చేజారిన క్రేజీ ఆఫర్!

టాక్సీవాలా చిత్రంతో తెలుగు బ్యూటీ ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే ప్రియాంక యువతకు బాగా కనెక్ట్ అయింది. ఆమె లుక్స్ బాగా ఆకట్టుకున్నాయి. టాక్సీవాలా చిత్రం కూడా మంచి విజయం సాధించడంతో ప్రియాంక జవాల్కర్ కు మరిన్ని అవకాశాలు ఖాయం అని అంతా భావించారు. ఇదిలా ఉండగా ప్రియాంక అక్కినేని యువ హీరో అఖిల్ సరసన ఓ చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

అఖిల్ త్వరలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ముందుగా ప్రియాంకని హీరోయిన్ గా అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రియాంక జవాల్కర్ దాదాపుగా ఖాయం అనుకుంటున్న సమయంలో ఈ అఫర్ ఆమె చేజారినట్లు తెలుస్తోంది. కొన్ని అనుకోని కారణాల వలన దర్శకుడు అఖిల్ కి జోడిగా మరో హీరోయిన్ ని వెతికే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

 Priyanka Jawalkar missed Akhil 4 movie offer

ఈ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అఖిల్ కు తొలి మూడు చిత్రాలు నిరాశనే మిగిల్చాయి. దీనితో తన నాల్గవ చిత్రం కోసం కథే కీలకమని అఖిల్ భావించాడు. అందుకే పరాజయాల్లో ఉన్నా సరే బొమ్మరిల్లు భాస్కర్ చెప్పిన కథ నచ్చడం తో అతడికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X