అల్లు అర్జున్ మీద క్రష్, దర్శకుడి పర్ఫెక్షన్‌కు బలయ్యా..... పబ్లిగ్గా హీరోయిన్ సంచలనం!
టాక్సీవాలా సినిమాతో హీరోయిన్‌గా పరిచయం కాబోతున్న ప్రియాంక జవాల్కర్.... ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సంచలన వ్యాఖ్యలు చేసింది. స్టేజీ మీదకు రావడంతోనే మైక్ అందుకుని అల్లు అర్జున్ అంటే తనకు ఎంత పిచ్చో వెల్లడించే ప్రయత్నం చేసింది.
సార్ మీ మీద నాకు చాలా క్రష్ ఉంది. ఈ విషయాన్ని చెప్పడానికి నేను సిగ్గుపడటం లేదు. రెండు సంవత్సరాల క్రితం గీతా ఆర్ట్స్ ఆఫీసుకు లుక్ టెస్ట్ కోసం వచ్చాను. ఆ సమయంలో మీరు ఆఫీసుకు వచ్చారు...మిమ్మల్ని చూడగానే పడిపోయాను. అప్పటి నుంచి మీ మీద క్రష్ మొదలైందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రియాంక జవాల్కర్
అల్లు అర్జున్ గారి గురించి చాలా మంచి విషయాలు విన్నాను. కొత్త వారికి మీరు ఇచ్చే తోడ్పాటు స్వయంగా చూశాను. అప్పటి నుంచి ఆయన మీద ఇష్టం మరింత పెరిగిపోయిందని ప్రయాంక జవాల్కర్ తెలిపారు.

అందుకే వెయిట్ చేశాను
స్టేజీ మీద బాగా మాట్లాడాలని ఒక రోజు ముందే పేపర్ తీసుకుని స్పీచ్ రాయడం మొదలు పెట్టాను. కానీ ఏం రాయాలో అర్థం కాలేదు. సాధారణంగా వేరే హీరోయిన్లకు ఒక సినిమాకు రెండు మూడు నెలలు జర్నీ ఉంటుందేమో? నేను ఇక్కడ నిల్చుని మాట్లాడటానికి 2 సంవత్సరాలు వెయిట్ చేశాను. గీతా ఆర్ట్స్, యూవి క్రియేషన్స్ లాంటి బేనర్లు ఒక అమ్మాయిని ఎలా ప్రజంట్ చేస్తాయో అని నాకు నేనుగా కొన్ని బెంచ్ మార్క్స్ సెటప్ చేసుకున్నాను. నా సెల్ఫిష్‌నెస్ వల్లే నేను వెయిట్ చేశాను.... అని ప్రియాంక తెలిపారు.

వారి సపోర్ట్ వల్లే...
అల్లు అరవింద్ గారు చాలా కూల్. మా నిర్మాత ఎస్.కె.ఎన్ ఏ రాత్రి షూటింగ్ ఉన్నా రోజూ సెట్‌కి వచ్చేవారు. సెట్లో కూర్చుని ‘అంతా మీకు ఒకేనా.. ఏమైనా సమస్య ఉంటే చెప్పు' అని ఒకే ఒక ప్రశ్న మాత్రమే వేసేవారు.. వీరి సపోర్ట్ వల్లే సినిమా ఇంత బాగా వచ్చిందని ఆమె తెలిపారు.

రాహుల్ పర్ఫెక్షన్‌కు బలైంది నేనే
డైరెక్టర్ రాహుల్ పర్ఫెక్షన్ కోసం తపిస్తాడు. ఆయన పర్ఫెక్షన్‌కు బలైంది నేనే. నా యాక్టింగ్ స్కిల్స్ కాస్త వీక్‌గా ఉండటంతో చాలా కష్టపడాల్సి వచ్చిందని ప్రియాంక తెలిపారు.

ఎవరీ ప్రియాంక జవాల్కర్?
ప్రియాంక జవాల్కర్ మరాఠీ అమ్మాయి. చిన్నతనం నుంచి అనంతపూర్లో పెరిగింది. యాక్టర్ అవుదామని అన్ని వదిలేసి హైదరాబాద్ వచ్చింది. ఇక్కడ హాస్టల్‌లో ఉంటూ షార్ట్ ఫిల్మ్స్ చేసి ఫైనల్‌గా గీతా ఆర్ట్స్ నిర్వహించిన ఆడిషన్స్‌కు వచ్చి టాక్సీవాలా సినిమాకు సెలెక్ట్ అయింది.


Click it and Unblock the Notifications











