యంగ్ బ్యూటీతో రొమాన్స్ చేయబోతున్న అఖిల్!
అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలతో అఖిల్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. తొలి చిత్రం నుంచి అఖిల్ కు నిరాశే ఎదురవుతోంది. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు మూడూ వరుసగా నిరాశపరిచాయి. దీనితో అఖిల్ తొలి విజయం మరోమారు వాయిదా పడ్డట్లు అయింది. అఖిల్ నాల్గవ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
బొమ్మరిల్లు దర్శకుడు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు ఇదివరకే వార్తలు వచ్చాయి. ఈ కాంబినేషన్ గురించి మరో క్రేజీ న్యూస్ ప్రచారం జరుగుతోంది. టాక్సీవాలా చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్న ప్రియాంక జవాల్కర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒంగోలు గిత్త చిత్రం పరాజయం తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ మరో చిత్రాన్ని తెరకెక్కించలేదు. కానీ తాజాగా అఖిల్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడనున్నాయి.


Click it and Unblock the Notifications











