Priyanka Jawalkar హాట్ ఫోటోషూట్‌తో రచ్చ.. తిమ్మరుసు సక్సెస్‌తో డబుల్ జోష్

టాలీవుడ్‌లో సహజ సిద్దమైన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొంటున్న అందమైన భామల్లో ప్రియాంక జవాల్కర్ ఒకరు. అనంతపురంలో పుట్టి పెరిగిన ఈ అచ్చ తెలుగు హీరోయిన్‌ ప్రతీ మూవీతో తనదైన ఫెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నారు. అందం, అభినయం కలబోసి తన పాత్రలకు ప్రియాంక జవాల్కర్ అలంకారంగా మారుతున్నారు. తాజాగా తిమ్మరుసు చిత్రంతో ప్రేక్షకులకు చేరువైన ప్రియాంక జవాల్కర్ తాజా ఫోటోషూట్ వైరల్ అవుతున్నది. ఆమె వ్యక్తిగత, ప్రొఫెషనల్ వివరాల్లోకి వెళితే..

ఐశ్వర్యరాయ్‌ను చూసి హీరోయిన్‌గా

ఐశ్వర్యరాయ్‌ను చూసి హీరోయిన్‌గా

బాల్యంలో జీన్స్ చిత్రంలో ఐశ్వర్యరాయ్‌ను తెరపైన చూసి హీరోయిన్ కావాలని కలలు కన్న ప్రియాంక జవాల్కర్‌కు టాక్సీవాలా చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఈ భామకు క్రిటిక్స్ నుంచి, ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత తన టాలెంట్ తగిన పాత్రల కోసం వేచి చూసింది.

టాక్సీవాలా తర్వాత తిమ్మరుసుతో

టాక్సీవాలా తర్వాత తిమ్మరుసుతో

టాక్సీవాలా తర్వాత ఆమె నటించిన తిమ్మరుసు చిత్రం లాక్‌డౌన్ కాలంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు పరిస్థితులు బాగుండటంతో తిమ్మరుసు చిత్రం జూలై 30 తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ చిత్రం సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకొంటున్నది. ముఖ్యంగా ప్రియాంక జువాల్కర్‌ నటనకు మంచి రెస్పాన్స్ వస్తున్నది అని చిత్ర యూనిట్ వెల్లడించింది. టాక్సీవాలా తర్వాత ఆమె విజయాల ఖాతాలో మరో సక్సెస్ చేరిందంటున్నారు.

గోల్డెన్ లెగ్‌గా ప్రియాంక జవాల్కర్

గోల్డెన్ లెగ్‌గా ప్రియాంక జవాల్కర్

టాక్సీవాలా, తిమ్మరుసు చిత్రాల విజయాలతో గోల్డెన్ లెగ్‌ అనే పేరు ప్రియాంక జవాల్కర్ సొంతం చేసుకొన్నారు. తిమ్మరుసు చిత్రంలో అను అనే లాయర్ పాత్రలో తన పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించింది. అందంగా కనిపిస్తూనే, కంప్లీట్ పెర్మార్మెన్స్‌తో ఆకట్టుకొన్నదనే అభిప్రాయం ప్రేక్షకుల్లో వ్యక్తమవుతున్నది. వరుస విజయాలతో ప్రియాంక జువాల్కర్ మంచి జోష్‌ను కొనసాగిస్తున్నది.

SR కల్యాణ మండపం మూవీతో

SR కల్యాణ మండపం మూవీతో

సెకండ్ లాక్ డౌన్ తర్వాత ప్రియాంక జవాల్కర్ త్వరలోనే మరో చిత్రంలో ప్రియాంక జవాల్కర్ నటిస్తున్నది. విభిన్నమైన కథతో SR కల్యాణ మండపం అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 9వ తేదీన రిలీజ్ కానున్నది. ఈ చిత్రం ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. అయితే ప్రియాంకకు మరో విజయం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

యువ హీరోలతో జతకట్టేందుకు

యువ హీరోలతో జతకట్టేందుకు

ఇదిలా ఉంటే ప్రియాంక జవాల్కర్ నటించిన మరో సినిమా గమనం కూడా రిలీజ్‌కు ముస్తాబవుతున్నది. అంతేకాకుండా మరో స్టార్ హీరో‌తో కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నారు. నాని, శర్వానంద్ లాంటి యువ హీరోలతో జతకట్టేందుకు ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఫీల్ గుడ్ చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకోవడం ఖాయమని ఆమె టాలెంట్‌ను గ్రహించిన సినీ వర్గాలు పేర్కొంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X