కరోనా బారిన పడ్డ మరో తెలుగు హీరోయిన్..ఈసారి మహమ్మారి కోరల్లో చిక్కింది ఎవరంటే?
కరోనా కేసులు కల్లోలం సృష్టిస్తున్నాయి. ఏకంగా గడిచిన 24 గంటల్లో అయితే కొత్తగా 2.82 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అలాగే మామూలు కరోనా కేసులతో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. అలాగే ఈ కరోనా కేసులు సినీ, రాజకీయ ప్రముఖులను కూడా వదలడం లేదు. తాజాగా ఒక తెలుగు హీరోయిన్ కూడా కరోనా బారిన పడింది. ఆమె ఎవరు? ఇప్పుడు ఎలా ఉన్నారు? అనే వివరాల్లోకి వెళితే

మాస్క్ వేసుకోండి
ప్రపంచవ్యాప్తంగా కరోనా మూడో వేవ్ స్టార్ట్ అయ్యి షాక్ ఇస్తోంది. ఒక పక్క ఎప్పుడు నుంచో ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ సినిమాలు ఆగిపోవడంతో వారంతా నిరాశలో మునిగిపోతూ ఉండగా చాలా మంది సినీ ప్రముఖులు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మరింత టెన్షన్ లో మునిగిపోతున్నారు. ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొంత మంది హీరోలకు, హీరోయిన్స్ కు కరోనా సోకగా కొంత మంది కోలుకుంటున్నారు. కొంత మంది కరోనాతో ఐసోలేషన్ లో ఉన్నారు.

మాస్క్ వేసుకోండి
తాజాగా తెలుగు హీరోయిన్ ప్రియాంక జావల్కర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. అందరికీ హాయ్, అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, నాకు కోవిడ్ లక్షణాలతో పాజిటివ్ అని తేలింది. నేను ప్రస్తుతం నా వైద్యుని సూచనలను అనుసరించి ఐసోలేషన్‌లో ఉన్నాను, అవసరమైన మందులు కూడా తీసుకోవడం ప్రారంభించాను. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన ప్రతి ఒక్కరినీ వారికి వారు టెస్ట్ చేయించుకోవాలని నేను కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ మాస్క్ వేసుకోవాలని మరియు ఖచ్చితంగా అవసరమైతే తప్ప బయటకు వెళ్ళవద్దని అభ్యర్థిస్తున్నాను. మాస్క్ వేసుకోండి, సురక్షితంగా ఉండండి!

సూపర్ హిట్ అయినా
ఇక విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా' సినిమాతో హీరోయిన్‌గా ప్రియాంక జవాల్కర్ తెలుగు తెరకు పరిచయమయింది. అనంతపురంలో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి మోడల్‌గా ఎదిగి ఇప్పుడు నటిగా మారింది. ప్రియాంక అనంతపురంలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది అలా ఆమె నటించిన కలవరమాయే అనే ఒక షార్ట్ ఫిలిం మంచి పేరు తెచ్చుకుంది. ఇక విజయ్ దేవరకొండ టాక్సీ వాలా సినిమా సూపర్ హిట్ అయినా సరే ఈ భామకు అంతగా అవకాశాలు వచ్చి పడలేదు.
Recommended Video

హాట్ ఫోటోలు షేర్ చేస్తూ
అయితే కాస్త లేట్ అయినా సరే ఈ భామకు వరుస అవకాశాలు వచ్చిపడ్డాయి. కిరణ్ అబ్బవరం హీరోగా ఎస్ ఆర్ కళ్యాణమండపం, గమనం, తిమ్మరుసు సినిమాలలో కూడా హీరోయిన్ గా నటించింది. చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయినా ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటుంది. స్వతహాగా ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్ అయిన ఈ భామ ఎప్పటికప్పుడు తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ తన హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది..


Click it and Unblock the Notifications











