డబ్బులిచ్చి దుష్ప్రచారం.. నాపై కుట్ర వెనుక వాళ్లే.. ప్రియాంక మోహన్ షాకింగ్ కామెంట్స్

సోషల్ మీడియా రాకతో చిత్ర పరిశ్రమలో నెగిటివ్ ట్రోలింగ్ అనేది చీడపురుగులా తయారైంది. తమ ప్రత్యర్ధుల సినిమాలను దెబ్బకొట్టడంతో పాటు నటీనటులను వ్యక్తిగతంగా ట్రోల్ చేయడానికి చాలా మంది సోషల్ మీడియాను ఆయుధంగా వాడుతున్నారు. కొన్ని రకాల ఏజెన్సీలు ఇలాంటి సేవలు అందించేందుకు ప్రత్యేకంగా పుట్టుకొస్తున్నాయి కూడా. ఎంతోమంది నటీనటులు తమపై జరుగుతున్న ట్రోలింగ్ గురించి ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. తాజాగా ఓజీ ఫేమ్, హీరోయిన్ ప్రియాంక మోహన్ ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై జరిగిన నెగిటివ్ క్యాంపెయిన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
Trisha - Vijay: త్రిషతో విజయ్ రిలేషన్‌‌పై రూమర్స్.. దళపతి బాడీగార్డ్ సెన్షేషనల్ పోస్ట్
Trisha - Vijay: త్రిషతో విజయ్ రిలేషన్‌‌పై రూమర్స్.. దళపతి బాడీగార్డ్ సెన్షేషనల్ పోస్ట్

కర్ణాటకు చెందిన ప్రియాంక మోహన్ .. తన మాతృభాష కన్నడంలోనే ఒంద కథ హెల్లాతో ప్రారంభమైంది. ఆ తర్వాత తమిళం, తెలుగు భాషల్లో సత్తా చాటింది ప్రియాంక. నేచురల్ స్టార్ నానితో గ్యాంగ్ లీడర్, సరిపోదా శనివారం సినిమాలతో పాటు శర్వానంద్ సరసన శ్రీకారం సినిమాలలో నటించింది. ఈ దశలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓజీలో కన్మణిగా, పవన్‌కు భార్యగా అద్భుతంగా నటించి తెలుగునాట స్టార్ హీరోయిన్ రేసులో దూసుకొచ్చింది ప్రియాంక.

Priyanka Mohan Opens Up About Negative Trolling and Online Hate Campaign in Film Industry

ప్రస్తుతం తమిళంలో మేడ్ ఇన్ కొరియా, కావిన్ #9తో పాటు కన్నడంలో 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్‌‌లలో నటిస్తోంది. దాదాపు ఆరేళ్ల తర్వాత కన్నడ ఇండస్ట్రీలో ప్రియాంక రీ ఎంట్రీ ఇచ్చారు. 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్‌లో కరునాడ చక్రవర్తి శివరాజ్ కుమార్ సరసన ప్రియాంక నటించనున్నారు. హేమంత్ ఎం రావు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. ధనుంజయ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Recommended For You
ఆమె జ్ఞాపకాలు జీవితాంతం నాతోనే... దీప్తి సునైనాతో బ్రేకప్‌పై షణ్ముఖ్ ఎమోషనల్
ఆమె జ్ఞాపకాలు జీవితాంతం నాతోనే... దీప్తి సునైనాతో బ్రేకప్‌పై షణ్ముఖ్ ఎమోషనల్

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ప్రియాంక మోహన్.. తన సినిమాలు, షూటింగ్, ఇతర వ్యక్తిగత విషయాలతో అభిమానులతో టచ్‌లో ఉంటారు. హాట్ హాట్ ఫోటోషూట్‌తో కుర్రకారును రెచ్చగొడుతుంటారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక మోహన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. గత కొన్ని నెలలుగా నేను ఆన్‌లైన్‌లో ద్వేషం, దుష్ప్రచారాన్ని ఎదుర్కొంటున్నా. దీని వెనుక ఎవరున్నారో నాకు తెలుసు. దుష్ప్రచారం అనే పదం పరిస్ధితిని వివరించడానికి చాలా పెద్దది. గతం గురించి పట్టించుకునే పరిస్ధితుల్లో నేను ఇప్పుడు లేను. ఇది అనిశ్చిత పరిశ్రమ.. ఇక్కడ ఎవరికైనా ఇలాంటి పరిస్ధితి ఎదురుకావొచ్చు. కానీ అది నాకు ఎదగడానికి సహాయపడింది అని ప్రియాంక మోహన్ పేర్కొన్నారు.

You May Also Like
ఆ పెయిన్ తట్టుకోలేం.. అర్ధం చేసుకునే మగాళ్లు కొందరే.. యాంకర్ సుమ ఎమోషనల్
ఆ పెయిన్ తట్టుకోలేం.. అర్ధం చేసుకునే మగాళ్లు కొందరే.. యాంకర్ సుమ ఎమోషనల్

ఈ నెగిటివ్ ట్రోలింగ్ వెనుక ఎవరున్నారో ప్రియాంక చెప్పనప్పటికీ చెన్నైకి చెందిన ఓ సెలబ్రిటీ మేనేజ్‌మెంట్ కమిటీ ఉన్నట్లుగా ఆమె హింట్ ఇచ్చారు. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది తారల మీడియా వ్యవహారాలు చూసే ఈ కంపెనీ నుంచి బయటకొచ్చిన తర్వాతే ప్రియాంకపై ట్రోలింగ్ మొదలైనట్లుగా ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. ప్రియాంకపై నెగిటివ్ పోస్టులు, దారుణమైన కామెంట్స్ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టడంతో ఆమెను కొందరు టార్గెట్ చేసినట్లుగా అభిమానులు అనుమానించారు. తాజాగా నెగిటివ్ ట్రోలింగ్‌పై ప్రియాంక మోహన్ వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి. ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో కళ్లకు కట్టినట్లుగా చెబుతోంది.

More from Filmibeat

Read more about: priyanka mohan movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X