For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వాళ్ల పేర్లు చెప్పి బెదిరించిన ర‌ష్మీ గౌత‌మ్.. కట్టేసి కొడతానంటూ నిర్మాత స్ట్రాంగ్ వార్నింగ్

  |

  తెలుగు వారిలో యాంకర్ రష్మీ అంటే తెలియని వారు ఉండరు. జబర్దస్త్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులలో అంత పాపులారిటీ సంపాదించిన రష్మీ ప్రస్తుతం ఒకపక్క షోలు చేస్తునే, స్పెషల్ ఈవెంట్స్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే అడపాదడపా సినిమాల్లో కూడా కనిపిస్తూ ఉండే ఈ భామను గేటుకు కట్టేసి కొడతానని వార్నింగ్ ఇచ్చారు ఒక నిర్మాత. ఆమె కొందరి పేర్లు తీసుకొచ్చి బెదిరించడమే దానికి కారణం అని అంటున్నారు ఆయన. అసలు ఏమైంది? ఎందుకు ఆమెను కట్టేసి కొడతానని అన్నారు. ఆ వివరాల్లోకి వెళితే

  గ్లామర్ షో

  గ్లామర్ షో


  ముందు నుంచి కూడా రష్మీ వెండితెర మీద నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు కంటే గ్లామర్ షో, అందాల ఆరబోతకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ అలాంటి పాత్రలే చేస్తూ వచ్చింది. అలాంటి పాత్రలు చేస్తే మరింత క్రేజ్ లభిస్తుందని భావించిందేమో తెలియదు కానీ ఆమె ఎంత అందాలు ఆరబోసినా సరే ప్రేక్షకులు బుల్లితెర మీద ఆదరించినంతలా పెద్ద తెరమీద ఆదరించలేదు.

  బుల్లితెరలో

  బుల్లితెరలో

  అలా ఆమె సినిమాల్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా సరైన ఫలితం ఎప్పుడూ దక్కలేదు. అయితే బుల్లితెర మీద కనిపిస్తే మాత్రం ప్రేక్షకులు ఆమెను ఆదరించారు. ఆమె చేస్తున్న అన్ని షోలకు మంచి టిఆర్పి, యూట్యూబ్ లో పెట్టే వీడియోలకు మంచి వ్యూస్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఆమెకు సోషల్ మీడియాలో అయితే విపరీతమైన క్రేజ్ ఉంది.

  సినిమా ప్లాన్ చేసి

  సినిమా ప్లాన్ చేసి

  రష్మీ గురించి ఒక నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయం ఏమిటంటే రష్మీతో రాణి గారి బంగ్లా అనే సినిమా చేసిన నిర్మాత నాగ లింగం.. రష్మీ తనను బెదిరించిందని, ఆ కాల్ రికార్డ్ ఇంకా తన దగ్గర ఉంది అని ఆయన చెప్పుకొచ్చారు. మాతో రాణిగారి బంగ్లా అనే సినిమా చేయ‌డానికి ఆమె ఒప్పుకుంది. దివాక‌ర్ బాబు అనే ఆయన నా సొంత త‌మ్ముడులా భావిస్తా, ఆయన స్టీల్ ప్లాంట్‌లో ఎంప్లాయ్‌ అయినా సినిమాల మీద ఆసక్తి ఉండడంతో ఇద్దరం కలిసి శ్రీ ల‌క్ష్మి పిక్చ‌ర్స్ అనే సంస్థ‌ను వైజాగ్‌లో ప్రారంభించాం అని అన్నారు.

  అన్నీ ముందే చెప్పాం

  అన్నీ ముందే చెప్పాం

  ఆయన డిస్ట్రిబ్యూట‌ర్‌గా సినిమాల‌ను పంపిణీ చేశాడు ఎప్ప‌టి నుంచో సినిమా చేయాల‌ని అనుకుంటూ ప్ర‌సాద్ అనే స్నేహితుడితో క‌లిసి వ‌చ్చాడు. నాతో మాట్లాడడంతో నా స‌మ‌ర్ప‌ణ‌లోనే సినిమా స్టార్ట్ చేశాం. అందులో మెయిన్‌గా ర‌ష్మీ గౌత‌మ్‌ను అనుకున్నాం. ఆమెను క‌లిసి మాట్లాడితే ఆమె త‌న రెమ్యున‌రేష‌న్ చెప్పింది. మేం ఇంత ఇస్తాం అని చెప్పాం. ఆమె న‌టించ‌డానికి ఓకే చెప్పింది. సినిమాను లిమిటెడ్ బ‌డ్జెట్‌లో చేయాల‌నుకున్నామ‌ని, రెమ్యున‌రేష‌న్ తక్కువ ఇస్తామ‌ని, మేకింగ్‌కు కూడా తక్కువ ఖ‌ర్చులో చేస్తామని చెప్పినట్టు వెల్లడించారు.

  అలా అనడంతోనే

  అలా అనడంతోనే

  సినిమా అంతా పూర్త‌యి ఓ సాంగ్, డ‌బ్బింగ్ మాత్ర‌మే మిగిలి ఉండగా అప్పుడు ర‌ష్మీ పేచీ పెట్టిందని, చివ‌ర్లో ఇబ్బంది పెట్టాల‌ని భావించి హీరోని మార్చేయ‌మ‌ని అందని పేర్కొన్నారు. నాకు నాగబాబు తెలుసు, మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలుసు అంటూ బెదిరించిందని దీంతో నేను కూడా ఇండస్ట్రీలో ఇనాళ్ళుగా ఉంటున్నాను.. నీకే కాదు నాక్కూడా అందరూ తెలుసు.. షూటింగ్ మధ్యలో ఆపేస్తే నీపై లీగల్ గా కేసు పెడతా.. ఫిల్మ్ నగర్ గేటుకు కట్టేసి కొడతానని ఫైర్ అవడంతో రష్మీ దిగివచ్చి మిగతా షూటింగ్ ని కంప్లీట్ చేసిందని అన్నారు. అయిదు ఆమె మంచి నటి ఒక్క సీన్ కి కూడా మరో టేక్ తీసుకోలేదని చెప్పుకొచ్చాడు.

  English summary
  Producer Balaji Nagalingam sensational comments on Anchor Rashmi Gautam
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X