షూటింగ్ మధ్యలోనే వెళ్లిపోయిన శ్రియా సరన్.. ఆ హీరో కారణంగా సగం డబ్బులు మాత్రమే వెనక్కి ఇచ్చేసి..
కొన్నిసార్లు హీరోయిన్స్ నటీనటులు అలాగే టెక్నీషియన్స్ కూడా సినిమా సగం పూర్తయిన తరువాత కూడా డ్రాప్ అవ్వడం కామన్. అయితే సమస్య ఎలాంటిదైనా కూడా నిర్మతల గురించి ఆలోచించే వారు చాలా తక్కువమంది ఉంటారు. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత DS రావ్ కొంతమంది నటీనటులు స్వభావం గురించి బయటపెట్టారు. ముఖ్యంగా ఒకసారి శ్రియా కూడా షూటింగ్ మధ్యలో నుంచి వెళ్లిపోయినప్పటికి నిర్మాత గురించి ఆలోచించి వెళ్లిపోయినట్లు చెప్పారు.

20 ఏళ్ళ కెరీర్..
2001లో 'ఇష్టం' అనే తెలుగు సినిమాతోనే నటిగా తన కెరీర్ ను స్టార్ట్ చేసిన శ్రియా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి దాదాపు 20 ఏళ్లవుతోంది. టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా అగ్ర హీరోలందరితో వర్క్ చేసింది. గ్లామర్ అయినా , ట్రెడిషనల్ రోల్స్ అయినా తనదైన శైలిలో పాత్రలో ఒదిగిపోవడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య.

చిన్న హీరోలతో కూడా..
ఇక శ్రియ కెరీర్ మొదటి నుంచి ఈ ఏడాది వరకు కూడా ఎప్పుడూ గ్యాప్ ఇచ్చింది లేదు. మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోతో చేస్తూనే మరోవైపు తరుణ్ లాంటి హీరోతో కూడా వర్క్ చేస్తూ వచ్చింది. వీలైనంత వరకు కథలో ప్రాధాన్యత ఉన్న పాత్రలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది.

రెమ్యునరేషన్ విషయంలో కూడా
చిన్న హీరోలు పెద్ద హీరోలు అని తేడా లేకుండా కథ నచ్చితే వెబ్టనే ఒప్పేసుకునేది. ఇక శ్రియా కెరీర్ లో ఎప్పుడు కూడా కాంట్రవర్సీకి తావివ్వలేదు. నిర్మాతలను ఆమె ఎక్కువగా ఇబ్బంది పెట్టదు అనే మంచి ట్యాగ్ తోనే ఎక్కువ అవకాశాలు అందుకుందట. రెమ్యునరేషన్ విషయంలో కూడా ఎక్కువగా ఇబ్బంది పెట్టింది లేదట.

ఫస్ట్ శ్రియాను ఫిక్స్ చేసి..
ఇక రీసెంట్ గా నిర్మాత DS రావ్ కూడా శ్రియా మనస్తత్వం గురించి చెబుతూ.. ఆమె ఒక సినిమా షూటింగ్ మధ్యలో నుంచి వెళ్లిపోవడంపై వివరణ ఇచ్చారు. పిల్ల జమిందార్ వంటి సినిమాను నిర్మించిన అనంతరం DS రావ్ మంచు మనోజ్ తో మిస్టర్ నూకయ్యా అనే సినిమా చేశాడు. అయితే ఆ సినిమాలో మొదట హీరోయిన్ పాత్ర కోసం శ్రియాను అనుకున్నారట. అయితే షూటింగ్ మొదలైన 10రోజుల తరువాత కాంబినేషన్ సెట్టవ్వడం లేదని హీరో మంచు మనోజ్ అభ్యంతరం చెప్పినట్లు DS చెప్పారు.
Recommended Video

10లక్షలు ఇస్తే..
ఇక శ్రియా ఎక్కువగా ఆలోచించకుండా షూటింగ్ మధ్యలో నుంచే వెళ్లిపోయిందని, అయితే అడ్వాన్స్ గా ఇచ్చిన 10లక్షల రెమ్యునరేషన్ లో నుంచి 5లక్షలు వెనక్కి ఇచ్చేసిందని చెప్పారు. వర్క్ చేసినందుకు గాను ఆ 5లక్షలు ఇవ్వడం లేదని న్యాయంగానే నడుచుకున్నట్లు వివరణ ఇచ్చారు. ఎందుకో ఆ సినిమాకు అన్ని సమస్యలే వచ్చాయని చెప్పిన DS రావ్.. శ్రియా మాత్రం చాలా మంచి హీరోయిన్ అని ఫ్యూచర్ లో అవసరం అయితే ఏదైనా స్పెషల్ సాంగ్స్, గెస్ట్ రోల్ చేయడానికి కూడా రెడీగా ఉంటానని చెప్పిందని అన్నారు.


Click it and Unblock the Notifications











