షాలిని పాండే చీటింగ్.. మోసం చేసిందని అర్జున్ రెడ్డి హీరోయిన్‌పై ఫిర్యాదు
ఒక్క సినిమాతో వచ్చిన క్రేజ్‌ను హీరోయిన్లు ఎక్కువ కాలం నిలుపుకోలేకపోతారు. హడావిడిగా సినిమాలను ఓకే చేసేసి.. చేతులు కాల్చుకునే టైపు కొందరైతే.. ఆచితూచి ఆలోచిస్తూ సినిమాలు లైన్లో పెడతారు మరికొందరు. టాలీవుడ్‌లో అర్జున్ రెడ్డి చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

ప్రీతిగా నటించి...
ఈ మూవీలో విజయ్ దేవరకొండకు ఎంత పేరు వచ్చిందో.. ప్రీతిగా నటించిన షాలినీ పాండేకు అంతే పేరు వచ్చింది. అయితే ఇప్పటి వరకు విజయ్.. గీతగోవిందం, టాక్సీవాలా, నోటా, డియర్ కామ్రేడ్ అంటూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. కానీ షాలినీ పాండే మాత్రం నత్తనడక సాగుతూ వస్తోంది.

ఆచితూచి సినిమాలు..
అర్జున్ రెడ్డి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన షాలినీ పాండే.. అంత త్వరగా ప్రాజెక్ట్‌లకు ఓకే చెప్పకుండా ఆలస్యం చేస్తూ వస్తోంది.. ఆచితూచి సినిమాలను ఎంచుకుంటూ చాలా సెలెక్ట్‌డ్‌గా మూవీలను చేస్తూ వస్తోంది. మహానటి చిత్రంలో
సావిత్రి స్నేహితురాలి పాత్రను పోషించింది. మళ్లీ చాలా కాలానికి కళ్యాణ్ రామ్ 118లో కనిపించింది.

తమిళంలో ప్రయత్నాలు..
షాలినీ పాండేకు తెలుగు పట్ల అంతగా ఆసక్తి లేనట్టు కనిపిస్తూ ఉంటుంది. తమిళంలో చకాచకా ప్రాజెక్ట్‌లను ఓకే చేస్తూ అక్కడ అదృష్టం పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. గొరిల్లా, 100 పర్సెంట్ కాదల్ సినిమాలను చేసింది. అయినా అవి అంతగా సక్సెస్ కాలేదు.

తాజాగా కొత్త ప్రాజెక్ట్‌లకు ఓకే..
రీసెంట్‌గా తమిళం, తెలుగులో కొన్ని ప్రాజెక్ట్‌లకు షాలినీ ఓకే చెప్పింది. వాటన్నంటికి డేట్లను కూడా అడజ్ట్ చేసిందని, అంతా ఓకే అయ్యాక తమకు హ్యాండ్ ఇచ్చిందని సదరు నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు. ఈమేరకు తమకు సహాయం చేయాలని ప్రొడ్యూసర్ కౌన్సిల్‌ను ఆశ్రయించినట్లు సమాచారం.

బాలీవుడ్ ఆఫర్ రావడంతో..
బాలీవుడ్‌లో ఓ క్రేజీ ఆఫర్ రావడంతో వీరికి హ్యాండ్ ఇచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. రణ్‌వీర్ సింగ్ సినిమాలో రొమాన్స్ చేసే చాన్స్ రావడంతో.. తమిళ, తెలుగు సినిమాలకు ఇచ్చిన డేట్లను అక్కడికి తరలించినట్లు సదరు నిర్మాతలు ఫిర్యాదు చేశారు. మరి తరిగి వచ్చి బుద్దిగా వారికిచ్చిన డేట్లను వారికే ఉపయోగిస్తుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











