అనవసరపు ఖర్చులతో నిర్మాతలకు చిరాకెత్తించిన పూజా హెగ్డే.. బిల్లులు కట్టాల్సిందేనని బడా సంస్థ షాక్?

ఇటీవల కాలంలో స్టార్ హీరోయిన్స్ కు రెమ్యునరేషన్ అత్యధిక స్థాయిలోనే అందుతున్నాయి. ఒక సినిమా సక్సెస్ అయితే వెంటనే అగ్రహీరోయిన్స్ కు కోటికి పైగానే పారితోషికం పెంచేస్తున్నారు. ఇక ఆ తరహాలో ఇటీవల కాలంలో అత్యధిక పారితోషికాన్ని అందుకున్న వారిలో పూజా హెగ్డే ఒకరు. అయితే ఆమె కేవలం పారితోషికం మాత్రమే కాకుండా అంతకంటే ఎక్కువ స్థాయిలో వివిధ రూపాల్లో నిర్మాతలకు భారంగా మారుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక రీసెంట్ గా ఒక సినిమాకు పూజా హెగ్డే చేసిన ఖర్చులు భారాన్ని భరించలేక నిర్మాతలు ఆమెకు బిల్లులు పంపి తిరిగి కట్టాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

తిండి కోసమే లక్షల్లో ఖర్చు?

తిండి కోసమే లక్షల్లో ఖర్చు?

చిత్ర పరిశ్రమలో కొంత మంది నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం అనవసరపు ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ విషయంలో కొంతమంది అనుభవంతో ముందుగానే ఆర్టిస్టులను వారి కంట్రోల్లో ఉంచుకుంటున్నారు. కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం మంచినీళ్ల కోసం తిండి కోసమే లక్షల్లో ఖర్చు చేస్తున్నట్లు గా ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే గట్టిగానే వినిపిస్తోంది.

పూజా హెగ్డే కూడా

పూజా హెగ్డే కూడా

ఇక ప్రస్తుతం పూజా హెగ్డే కు సంబంధించిన ఒక విషయం కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇది ఎంతవరకు నిజం అనేది తెలియదు కానీ సోషల్ మీడియాలో కూడా అందుకు సంబంధించిన కథనాలు వైరల్ గా మారుతున్నాయి. ఆమె ఖర్చులు భరించలేక ఒక అగ్ర నిర్మాణ సంస్థ ఫైనల్ గా బిల్లులను కూడా పంపినట్లు తెలుస్తోంది.

ఆడుతూ పాడుతూ బీస్ట్ షూటింగ్

ఆడుతూ పాడుతూ బీస్ట్ షూటింగ్

విజయ్ నటించిన బీస్ట్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇక ఆమె ఆ సినిమా కోసం ఇచ్చిన డేట్స్ తక్కువైనా కూడా పారితోషకం మాత్రం తన డిమాండ్ కు తగ్గట్టుగా తీసుకున్నట్లు అయితే టాక్ వచ్చింది. ఆ సినిమాకు అవుట్ డోర్ వెళ్లాల్సిన అవసరం కూడా రాలేదు. దాదాపు ఓకే సెట్స్ లో అలాగే పాటలకు తప్పితే పెద్దగా కష్టపడింది లేదు. ఆడుతూ పాడుతూ బీస్ట్ సినిమాను ఆమె పూర్తి చేసింది. ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

హీరోయిన్ కోసం భారీగా ఖర్చులు

హీరోయిన్ కోసం భారీగా ఖర్చులు

బీస్ట్ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ కూడా నిర్మాతలు పెద్దగా నష్టం ఏమి రాలేదు. బయ్యర్లు ఎక్కువగా నష్టపోయారు. అయితే ఒక విషయంలో మాత్రం ఆ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఆశ్చర్యానికి గురయ్యిందట. మొదటిసారి ఈ సంస్థలో పూజా హెగ్డే సినిమా చేయడంతో వారి సినీ జీవితంలో ఏ హీరోయిన్ కు ఖర్చు పెట్టలేనంత పూజా హెగ్డే కు ఖర్చు చేయాల్సి వచ్చిందట.

వారందరి ఖర్చులు

వారందరి ఖర్చులు

సాధారణంగా పూజా హెగ్డే అయితే ఎలాంటి సినిమా చేసినా కూడా వారి సొంత టీమ్ తోనే వెళుతుంది. మేకప్ కోసం ఒకరు డ్రెస్సింగ్ స్టైల్ కోసం ఒకరు అలాగే హెయిర్ స్టైల్ కోసం మరొకరు కార్ డ్రైవర్ పర్సనల్ అసిస్టెంట్ ఇలా అందరూ కూడా ఆమె దగ్గర పర్మినెంట్ జాబ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే వారందరీ ఖర్చులు కూడా పూజ హెగ్డే నిర్మాతలు అకౌంట్లోనే వేసినట్లుగా తెలుస్తోంది.

బిల్లులు పంపిన నిర్మాతలు

బిల్లులు పంపిన నిర్మాతలు

ఇక బీస్ట్ సినిమా షూటింగ్ సమయంలో పూజ హెగ్డే అలాగే తన అసిస్టెంట్లు కూడా చేసిన ఖర్చులు లక్షల్లోనే ఉన్నాయట. ఇక ఆ లెక్కలన్నీ చూసిన నిర్మాతలు ఒక్కసారిగా షాక్ అయినట్లు తెలుస్తోంది. ఇదివరకే ఆమెకు మేనేజర్ ను అడిగినట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఆమెకు ఏకంగా బిల్లులను పంపి ఆ డబ్బును తిరిగి కట్టవలసిందిగా డిమాండ్ చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. మరి ఎంతవరకు నిజమో తెలియాలంటే క్లారిటీ ఆమె క్లారిటీ ఇవ్వాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X