A సర్టిఫికెట్ వీడియో వదిలిన హీరోయిన్: ఏంటా బిహేవియర్ అంటూ మరో నటి షాకింగ్‌గా!
ఒకప్పుడు హీరోయిన్లు సినిమాల్లో నటించినప్పుడో.. ఏదైనా కార్యక్రమాలకు హాజరైనప్పుడో మాత్రమే కనిపించేవారు. కానీ, ఇప్పుడు సోషల్ మీడియా వాడకం పెరగడం వల్ల చాలా మంది భామలు ఇందులో హల్చల్ చేస్తూ ఫ్యాన్స్‌కు మజా పంచుతున్నారు. అలాంటి వారిలో దిశా పటానీ ఒకరు.
పాన్ ఇండియా రేంజ్ స్టార్ హీరోయిన్ అయినా సరే ఈ అమ్మడు సోషల్ మీడియాలో తెగించి మరీ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. దీంతో తరచూ ట్రెండింగ్‌లో ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా దిశా పటానీ మరో హాట్ వీడియోను షేర్ చేసింది. దానిపై మీరు కూడా లుక్కేయండి మరి!

లోఫర్‌తో మొదలై.. ధోనీతో: మోడల్‌గా సత్తా చాటుతూ దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకున్న దిశా పటానీ.. ఫిల్మ్ మేకర్ల దృష్టిలో సైతం పడిపోయింది. దీంతో ఆమెకు చాలా భాషల్లో ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'లోఫర్' మూవీతో హీరోయిన్‌గా మారింది. కానీ, ఇది ఆమెకు నిరాశనే మిగిల్చింది. దీంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి 'MS Dhoni' చిత్రంతో హిట్ కొట్టేసింది.

వరుస సినిమాలతో స్టార్‌గా: 'MS Dhoni' చిత్రంతో బాలీవుడ్‌లో మెరిసిన దిశా పటానీ.. ఆ తర్వాత ఎన్నో అవకాశాలను సైతం సొంతం చేసుకుంది. ఇలా చాలా తక్కువ సమయంలోనే 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి మూవీల్లో నటించి మెప్పించింది. తద్వారా స్టార్ హీరోయిన్ అనే హోదాను సైతం సొంతం చేసుకుంది.

ఇప్పుడు భారీ సినిమాల్లో: సుదీర్ఘ కాలంగా పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్న దిశా పటానీ.. వేరే భాషల్లో సైతం మంచి ఫాలోయింగ్‌ను అందుకుని ఆఫర్లను దక్కించుకుంటోంది. ఇలా ఇప్పుడు ప్రభాస్ 'ప్రాజెక్టు K'లో కీలక పాత్రను పోషిస్తోంది. అలాగే, తమిళంలో సూర్యతో 'కంగువా', 'యోధా' అనే మూవీ చేస్తోంది. వీటితో పాటు స్పెషల్ ఈవెంట్లలో సైతం భాగం అవుతోంది.

పర్సనల్ లైఫ్‌లో హైలైట్: దేశ వ్యాప్తంగా స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటుతూ వరుస సినిమాలతో దూసుకుపోతోన్న దిశా పటానీ.. పర్సనల్ లైఫ్‌లోనూ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది. గతంలో బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్‌తో లవ్ ట్రాక్‌ను సాగించిన దిశా.. కొద్ది రోజుల క్రితమే అతడికి బ్రేకప్ చెప్పేసింది. అంతేకాదు, ఆ వెంటనే ఆమె తన ఫిట్‌నెస్ ట్రైనర్ అలెగ్జాండర్‌తో డేటింగ్ చేస్తూ యమ ఎంజయ్ చేస్తూనే ఉంది.

అందులో అరాచకంగానే: వరుస షూట్లతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ దిశా పటానీ.. సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగా తరచూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. అందులో తన కెరీర్‌తో పాటు పర్సనల్ విశేషాలను సైతం ఫ్యాన్స్‌తో షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా గ్లామర్ షో ఇస్తూ తీసుకున్న ఫొటోలు, వీడియోలను తరచూ వదులుతోంది. ఇలా తన ఫ్యాన్స్‌ను తెగ రెచ్చగొడుతోంది.

అలాంటి వీడియోతో రచ్చ: పాన్ ఇండియా హీరోయిన్ దిశా పటానీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె డ్రెస్ మొత్తం విప్పేసి లోదుస్తులతో విపరీతంగా షో చేస్తోంది. దీంతో ఇందులో ఆమె అందాలు మొత్తం కుర్రకారును తెగ టెంప్ట్ చేస్తున్నాయి. ఫలితంగా దిశా పటానీ షేర్ చేసిన ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చి.. వైరల్‌గా మారింది.
ఏంటా బిహేవియర్ అని: దిశా పటానీ తాజాగా షేర్ చేసిన వీడియోకు నెటిజన్ల నుంచి చిత్ర విచిత్రమైన కామెంట్లు వస్తున్నాయి. ముఖ్యంగా సెలెబ్రిటీలు సైతం దీనికి తమదైన శైలిలో రెస్పాన్స్ ఇస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రముఖ నటి మౌనీ రాయ్ 'ఏంటా బిహేవియర్' అంటూ కామెంట్ చేసింది. మామూలు నెటిజన్లు మాత్రం దిశాను బూతులతో దారుణమైన మాటలు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











