హాస్పిటల్ లో దీపికా పదుకొనె.. అభిమానుల్లో టెన్షన్.. అసలు విషయం చెప్పిన నిర్మాతలు

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె ఇటీవల హాస్పటల్ లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్లో ఉంటున్నా దీపికా పదుకొనె ప్రభాస్ ప్రాజెక్ట్ K షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టు మధ్యలో ఆమె అస్వస్థతకు గురవ్వడంతో అపోలో హాస్పిటల్ లో జాయిన్ అయినట్లు సమాచారం. దీపికా పదుకొనె హాస్పిటల్లో కనిపించడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా అందుకు సంబంధించిన అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు ఎం జరిగింది అని ఫ్యాన్స్ కూడా కొంత కన్ఫ్యూజన్ కు గురి అవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రాజెక్ట్ K కోసం..

ప్రాజెక్ట్ K కోసం..

బాలీవుడ్లో గ్లామరస్ బ్యూటీ గా తనకంటూ ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న దీపికాపదుకొనె మొదటిసారి ప్రభాస్ తో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో బిగ్గెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ గా రాబోతున్న ప్రాజెక్టు కే సినిమాలో దీపిక పదుకొనే మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. మొదటి షెడ్యూల్ లో పాల్గొన్న తర్వాత మళ్లీ ఆమె చాలా రోజుల తర్వాత తదుపరి షెడ్యూల్ కోసం హైదరాబాద్ రావాల్సి వచ్చింది.

అస్వస్థతకు గురవ్వడంతో..

అస్వస్థతకు గురవ్వడంతో..

అయితే రీసెంట్ గా ప్రాజెక్ట్ K సినిమా షూటింగ్ లో పాల్గొన్న దీపికా పదుకొనే అనుకోకుండా కొంత అస్వస్థతకు గురైనట్లు సమాచారం. గుండెకు సంబంధించిన నొప్పితో ఆమె ఇబ్బంది పడుతున్నట్లు తెలుసుకుని వెంటనే హాస్పటల్లో జాయిన్ కావలసి వచ్చిందని వార్తలు వచ్చాయి. నిర్మాతల సహకారంతో వెంటనే అపోలో హాస్పిటల్ సిబ్బందికి విషయం తెలియజేయడంతో వారే వచ్చి ప్రత్యేకంగా దీపికా పదుకొనే హాస్పిటల్కు తీసుకు వెళ్లారని కూడా కథనాలు వెలువడ్డాయి.

వైద్యుల పర్యవేక్షణలో..

వైద్యుల పర్యవేక్షణలో..

ఇక దీపిక పదుకొనె రెండు మూడు రోజుల వరకు వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెకు గుండె దగ్గర కాస్త నొప్పి గా అనిపించినట్లు వైద్యులకు చెప్పినట్లు సమాచారం. ఈ విషయంలో ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సాధారణంగా రోజు బిజీగా ఉండటం వలన కొంత అస్వస్థతగా గురవ్వడంతో ట్రీట్మెంట్ ఇచ్చారట. దీపికా తొందరగానే పూర్తిగా కోలుకున్నట్లుగా తెలుస్తోంది.

విశ్రాంతి అవసరం అని..

విశ్రాంతి అవసరం అని..

ఇక మూడు రోజుల అనంతరం దీపికా పదుకొనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి మళ్ళి హోటల్ లో ప్రత్యేకంగా రెస్ట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక రెండు రోజుల పాటు వైద్యులు ఆమెకు విశ్రాంతి అవసరమని కూడా తెలియజేశారట మళ్లీ ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే మళ్ళీ హాస్పిటల్కి వచ్చే విధంగా కూడా జాగ్రత్తలు చెప్పినట్లు తెలుస్తోంది. ఇక దీపిక పడుకొని పరిస్థితి మాత్రం ప్రస్తుతం పూర్తిగా సురక్షితంగానే ఉన్నట్లు నిర్మాతలు కూడా తెలియజేశారు. జనరల్ చెకప్ కోసమే ఆమె హాస్పిటల్ కు వెళ్లినట్లు కూడా వారు తెలియజేశారు.

మళ్ళీ ఎప్పటిలానే షూటింగ్ లో..

మళ్ళీ ఎప్పటిలానే షూటింగ్ లో..

ఇక రీసెంట్ గా దీపికా పదుకొనె పూర్తిగా పర్ఫెక్ట్ కనిపించిన తర్వాత ఆమె మళ్లీ వెంటనే ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్లో పాల్గొనడానికి సిద్ధమైందట. మంగళవారం రోజు ప్రత్యేకమైన షెడ్యూల్ లో ఆమె పాల్గొంటుందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం ఇప్పటికే ఒక భారీ సెట్ నిర్మించడం జరిగింది. అందులో దీపికా పదుకొనె ప్రభాస్ అమితాబచ్చన్ ముగ్గురు కూడా కొన్ని సన్నివేశాల్లో నటించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ ప్రాజెక్టును 2024 లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X