For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దేవిశ్రీ ప్రసాద్‌తో పెళ్లి కాలేదు.. పిల్లలు పుట్టలేదు... పూజిత పొన్నాడ క్లారిటీ

  |

  తెలుగు అమ్మాయి పూజిత పొన్నాడ నటించిన తాజా చిత్రం 7. హారర్, థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో ఏడుగురు హీరోయిన్లలో ఒకరిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫీ దర్శకత్వం వహిస్తున్నారు. యువ హవీష్‌ హీరోగా, రెజీనా, నందితాశ్వేత, పూజిత పొన్నాడ, అనీషా ఆంబ్రోస్, త్రిధాచౌదరి, అదితీ ఆర్య, కథా నాయికలుగా నటించారు. రమేష్‌ వర్మ నిర్మించిన ఈ సినిమాని అభిషేక్‌ పిక్చర్స్‌ ఈ నెల 5న విడుదల చేస్తున్నది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో పూజిత పొన్నాడ మాట్లాడుతూ..

   నాకు బోల్డ్ పాత్రలు చేయడం

  నాకు బోల్డ్ పాత్రలు చేయడం

  బోల్డు పాత్రలను ధరించడం నాకు ఇష్టం ఉండదు. కాకపోతే డీసెంట్‌గా ఉంటే నాకు అభ్యంతరం లేదు. అవసరం లేకున్నా అతిగా శృంగారాన్ని ప్రదర్శించడం నాకు నచ్చదు. వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ సినిమాలో బోల్డుగా కనిపించిన తర్వాత అలాంటి పాత్రలు వస్తున్నాయి. కానీ నేను ఒప్పుకోవడం లేదు. 7 చిత్రంలో లిప్‌లాక్‌లు ఉన్నప్పటికీ.. నా పాత్రకు అలాంటి సీన్లు లేకపోవడం కొంత ఊరటగా ఉంది.

   వేర్ ఈ ద వెంకటలక్ష్మీలో హాట్ హాట్‌గా

  వేర్ ఈ ద వెంకటలక్ష్మీలో హాట్ హాట్‌గా

  వేర్ ఈ ద వెంకటలక్ష్మీ సినిమాలో ఓ పాటలో అతిగా శృంగారం ఒలకబోయడం నాకే నచ్చలేదు. అయితే ఆ సినిమా విషయంలో నాకు చాలా అన్యాయం జరిగింది. సినిమా పాత్ర చెప్పేటప్పుడు కొంత రొమాంటిక్‌గా ఉంటుందని చెప్పారు. కానీ ఆ తర్వాత వారు చెప్పింది ఒకటి.. చేసింది ఒకటి. నాతో ఏదేదో చేయించారు. ఆ సమయంలో నేను తీవ్ర అసంతృప్తికి గురయ్యాను. ఇప్పడవన్నీ మాట్లాడితే వివాదం అవుతుంది. నా లవ్ స్టోరిని అనవసరంగా కత్తిరించారు అని పూజిత పేర్కొన్నది.

  దర్శకులు నేరుగా అడిగే రోజులొచ్చాయి.. రొమాన్స్ ఉంది.. అది చూసే అందరూ: యంగ్ హీరోయిన్

  ఆ సినిమా నాకు మంచి అనుభవం

  ఆ సినిమా నాకు మంచి అనుభవం

  వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మీ సినిమా నాకు మంచి అనుభవం. ఎలాంటి వారితో పనిచేయాలో.. పనిచేయకూడదో అనే విషయాన్ని నేర్చుకొన్నాను. హీరో, బ్యానర్, నిర్మాత లాంటి విషయాలపై పట్టింపుగా ఉండాలనే విషయం తెలిసింది. 7 సినిమాకు ముందు స్క్రిప్టు ఒక్కటే పరిగణనలోకి తీసుకొన్నాను. కొన్ని చేదు అనుభవాలతో సినిమా యూనిట్ గురించి కూడా తెలుసుకొంటున్నాను అని పూజిత తెలిపింది.

   అలా జాగ్రత్తలు తీసుకొంటున్నా

  అలా జాగ్రత్తలు తీసుకొంటున్నా

  ఎలాంటి టీమ్‌తో వర్క్‌ చేయకూడదో ‘వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మీ' సినిమా ప్రయాణం నేర్పించింది. ఈ సినిమా చేసినందుకు రిగ్రేట్‌ ఫీల్‌ అవుతున్నాను. స్క్రిప్ట్‌ నుంచి ప్రమోషన్, రిలీజ్‌ దాకా వారు చెప్పింది ఒకటి.. చేసింది మరొకటి. ఏదీ నేను అనుకున్నట్లు జరగలేదు. ఈ సినిమాకు ముందు స్క్రిప్ట్‌ని బట్టి మాత్రమే సినిమా చేసేదాన్ని. ఇప్పుడు మూవీ టీమ్‌ని కూడా పరిశీలించుకుంటున్నాను.

  దేవీ శ్రీ ప్రసాద్‌తో పెళ్లి గురించి

  దేవీ శ్రీ ప్రసాద్‌తో పెళ్లి గురించి

  నాకు పెళ్లి అయినట్టు వస్తున్న రూమర్లలో వాస్తవం లేదు. నాకు ఏడేళ్ల కొడుకు ఉన్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవం. నాకు మ్యూజిక్ దేవీ శ్రీ ప్రసాద్‌తో పెళ్లి అయినట్టు ఎందుకు ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదు. నాకు ఇంకా పెళ్లి కాలేదు. వివాహానికి ఇంకా సమయం ఉంది అని పూజిత అన్నారు. ప్రస్తుతం 7 చిత్రం తర్వాత కల్కి సినిమాలో ఓ మంచి పాత్రను చేస్తున్నాను. నా పాత్రకు అత్యంత ప్రాధాన్యం ఉంది. అలాగే కీర్తీ సురేష్ సినిమాలో నటిస్తున్నాను. మరో తమిళ సినిమాకు ఓకే చెప్పాను.

  English summary
  Pujita Ponnada's latest movie 7. Seven heroines like Regina, Anisha ambrose, Nandita Shweta, Tridha Chowdary, Aditi Arya are the heroines. Havish is the hero. As part of the promotion, Pujitha gave clarity on her marriage with Devi Sri Prasad.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X