హాట్ సెల్ఫీ వదిలిన పునర్నవి: చాలా రోజుల తర్వాత అలా.. అదొక్కటే అడ్డు పెట్టి కవర్ చేసేసిందిగా!

గతంలో పోలిస్తే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఈ మధ్య కాలంలోనే ఎక్కువ మంది లోకల్ అమ్మాయిలు పరిచయం అయ్యారు. వీళ్లలో చాలా మంది వరుస ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటుతున్నారు. అయితే, మరికొందరు మాత్రం సరైన గుర్తింపు దక్కక ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అలాంటి వారిలో బోల్డ్ బ్యూటీ పునర్నవి భూపాలం ఒకరు. అప్పుడెప్పుడో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. బిగ్ బాస్ షోతో మరింత పాపులర్ అయింది. అయితే, ఈ మధ్య పెద్దగా స్క్రీన్‌పై కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం.. ఆ పిక్‌పై మీరూ ఓ లుక్కేయండి మరి!

అలా మొదలైన పునర్నవి కెరీర్

అలా మొదలైన పునర్నవి కెరీర్

'ఉయ్యాల జంపాల' అనే సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి ఎంటర్ అయింది పునర్నవి భూపాలం. అందులో హీరోయిన్ పాత్రలో కనిపించి మెప్పించిన ఆమె.. ఆ తర్వాత 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', 'పిట్టగోడ', 'మనసుకు నచ్చింది', 'ఈ సినిమా సూపర్ హిట్', 'ఎందుకో ఏమో' సహా ఎన్నో చిత్రాల్లో నటించింది. అయినప్పటికీ ఆమెకు గుర్తింపు మాత్రం సొంతం కాలేదు.

బిగ్ బాస్ ఎంట్రీతో ఫుల్ ఫేమస్

బిగ్ బాస్ ఎంట్రీతో ఫుల్ ఫేమస్

కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా మరికొన్నింట్లో సపోర్టింగ్ రోల్స్‌లో నటించినప్పటికీ.. పునర్నవికి రావాల్సిన క్రేజ్ రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ మూడో సీజన్‌లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుందామె. హౌస్‌లోకి వెళ్లిన తర్వాత తన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలిచేది. ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ఊహించని స్థాయిలో ఫేమస్ అయిపోయింది.

రాహుల్‌తో లవ్ ట్రాకుతో రచ్చ

రాహుల్‌తో లవ్ ట్రాకుతో రచ్చ


బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు పునర్నవి భూపాలం.. రాహుల్ సిప్లీగంజ్‌తో కలిసి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. వీళ్లిద్దరూ ప్రేమికుల్లా వ్యవహరిస్తూ ప్రేక్షకుల్లో ఎన్నో డౌట్లను క్రియేట్ చేశారు. అదే సమయంలో రొమాన్స్‌తో రచ్చ చేశారు. దీంతో వీళ్లిద్దరి మధ్య ట్రాక్ నడుస్తుందని అంతా అనుకున్నారు. ఆ తర్వాత ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతుందని కూడా వార్తలు వచ్చాయి.

ఎంగేజ్‌మెంట్ అంటూ సందడి

ఎంగేజ్‌మెంట్ అంటూ సందడి

బిగ్ బాస్‌తో క్రేజ్ వచ్చినా పునర్నవి పెద్దగా అవకాశాలను అందుకోలేదు. అయితే, కొద్ది రోజుల క్రితం సినీ నటుడు రఘునందన్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నానని చెబుతూ ఆమె సోషల్ మీడియాలో ఓ ఫొటోను వదిలింది. ఆ తర్వాత ఈ పిక్ ఆహా రూపొందించిన 'కమిట్ మెంటల్' అనే వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసమని వెల్లడించి అందరినీ ఫూల్స్‌ను చేసేసిందీ బ్యూటీ.

అందులో మాత్రం ఫుల్ బిజీగా

అందులో మాత్రం ఫుల్ బిజీగా


బిగ్ బాస్ షో తర్వాత పునర్నవి భూపాలానికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ భారీ స్థాయిలో పెరిగిపోయింది. దీంతో అప్పటి నుంచి అందులో ఆమె ఎంతో యాక్టివ్ అయిపోయింది. ఈ క్రమంలోనే తన ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తోంది. అంతేకాదు, తన వ్యక్తిగత కెరీర్ సంబంధిత విషయాలను పంచుకుంటోంది. దీంతో పున్నూను ఫాలో అయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.

ఎక్కువగా అలాంటి షేర్ చేస్తూ

ఎక్కువగా అలాంటి షేర్ చేస్తూ

కొంత కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న పునర్నవి భూపాలం.. ఆ మధ్య ఎక్కువగా అందాల విందు చేస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుండేది. అలాగే, హాట్ భంగిమలతో వర్కౌట్లు చేస్తోన్న వీడియోలను సైతం షేర్ చేసేది. దీంతో ఈ అమ్మడు చాలా కాలం పాటు నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చింది. అయితే, కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయింది.

Recommended Video

Punarnavi On Her Role In Commitmental | Commitmental Team Interview Part 3
హాట్ సెల్ఫీని వదిలిన బ్యూటీ

హాట్ సెల్ఫీని వదిలిన బ్యూటీ


పునర్నవి భూపాలం ప్రస్తుతం అమెరికాలో ఓ కోర్స్ చేస్తోంది. దానికి సంబంధించిన అప్‌డేట్లను సోషల్ మీడియా ద్వారానే వెల్లడిస్తోంది. ఈ క్రమంలోనే చాలా రోజుల తర్వాత ఆమె ఓ హాట్ సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో ఆమె క్లీవేజ్ షో చేస్తోంది. అయితే, ఎద అందాలు పూర్తిగా కనిపించకుండా టెక్ట్స్ రాసి కవర్ చేసింది. అయినప్పటికీ ఇది తెగ వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X