హాట్ ఫోజులతో సెగలు రేపుతోన్న పునర్నవి: ఏకంగా అలా కనిపించడంతో షాకవుతోన్న నెటిజన్లు!

కొంత మంది సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపును దక్కించుకోలేరు. ఇలా చాలా మంది కొన్ని సినిమాలు మాత్రమే చేసి కనుమరుగైపోతున్నారు. అయితే, ఈ మధ్య కాలంలో ఇలా ఫేడౌట్ అయిన వాళ్లకు అవకాశాలు కల్పించేందుకు ఎన్నో షోలు పుట్టుకొచ్చాయి. అలాంటి వాటి వల్ల గతంలో పొందని గుర్తింపును దక్కించుకుంటున్నారు. ఇలా.. బిగ్ బాస్ షో వల్ల ఎనలేని క్రేజ్‌ను అందుకుని ఫుల్ స్వింగ్‌తో దూసుకుపోతోంది పునర్నవి భూపాలం. ఈ మధ్య కాలంలో యమ పాపులర్ అయిందామె. ఈ నేపథ్యంలో తాజాగా హాట్ ఫొజులతో సెగలు రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే....

బెడ్ మీద హాట్ ఫోజుతో బబ్లీ తెలుగు హీరోయిన్ (ఫోటోలు)

అలా మొదలైన కెరీర్.. గుర్తింపు దక్కలేదు

అలా మొదలైన కెరీర్.. గుర్తింపు దక్కలేదు

రాజ్ తరుణ్ నటించిన 'ఉయ్యాల జంపాల' అనే సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి ఎంటర్ అయింది పునర్నవి భూపాలం. అందులో హీరోయిన్ పాత్రలో కనిపించి మెప్పించిన ఆమె.. ఆ తర్వాత 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', 'పిట్టగోడ', 'మనసుకు నచ్చింది', 'ఈ సినిమా సూపర్ హిట్', 'ఎందుకో ఏమో' సహా ఎన్నో చిత్రాల్లో నటించింది. అయినప్పటికీ ఆమెకు అంతగా గుర్తింపు మాత్రం దక్కలేదు.

అందులో అవకాశం.. కెరీర్‌కు ప్లస్ అయింది

అందులో అవకాశం.. కెరీర్‌కు ప్లస్ అయింది

సపోర్టింగ్ రోల్స్‌తో పాటు కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించినప్పటికీ.. పునర్నవి రావాల్సిన క్రేజ్ రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ మూడో సీజన్‌లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుందామె. హౌస్‌లోకి వెళ్లిన తర్వాత తన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలిచేది. ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ఊహించని స్థాయిలో ఫాలోయింగ్‌ను పెంచుకుంది.

అతడితో ప్రేమాయణం.. పెళ్లి వరకూ వెళ్లింది

అతడితో ప్రేమాయణం.. పెళ్లి వరకూ వెళ్లింది

బిగ్ బాస్ షోలో పునర్నవి భూపాలం.. రాహుల్ సిప్లీగంజ్‌తో కలిసి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. వీళ్లిద్దరూ ప్రేమికుల్లా వ్యవహరిస్తూ ప్రేక్షకుల్లో ఎన్నో డౌట్లను క్రియేట్ చేశారు. అదే సమయంలో రొమాన్స్‌తో రచ్చ చేశారు. దీంతో వీళ్లిద్దరి మధ్య ట్రాక్ నడుస్తుందని అంతా అనుకున్నారు. ఆ తర్వాత ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతుందని కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం జరిగింది.

ఎంగేజ్‌మెంట్ ఫొటోతో షాకిచ్చిన పునర్నవి

ఎంగేజ్‌మెంట్ ఫొటోతో షాకిచ్చిన పునర్నవి

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పునర్నవి పెద్ద సినిమా అవకాశాలు అందుకోలేదు. ఇలాంటి సమయంలో కొద్ది రోజుల క్రితం ఓ సినీ నటుడు రఘునందన్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నానని చెబుతూ ఆమె సోషల్ మీడియాలో ఓ ఫొటోను వదిలింది. ఆ తర్వాత ఈ పిక్ ఆహా రూపొందించిన 'కమిట్ మెంటల్' అనే వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసమని వెల్లడించి షాకిచ్చింది.

ఎప్పుడూ అక్కడే.. ఇప్పుడే ఎక్కువ క్రేజ్‌తో

ఎప్పుడూ అక్కడే.. ఇప్పుడే ఎక్కువ క్రేజ్‌తో

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పునర్నవి భూపాలం ఎక్కువగా సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. గతంతో పోలిస్తే ఈ మధ్య ఆమె ఎంతో యాక్టివ్ అయిపోయింది. ఈ క్రమంలోనే తన ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తోంది. అంతేకాదు, తన వ్యక్తిగత కెరీర్ సంబంధిత విషయాలను పంచుకుంటోంది. దీంతో పున్నూ ఫాలోవర్లు కూడా భారీగా పెరుగుతున్నారు.

యోగా భంగిమలతో పునర్నవి

యోగా భంగిమలతో పునర్నవి

గతంలో పునర్నవి హాట్ హాట్ ఫొటోలను, వీడియోలను వదిలిన విషయం తెలిసిందే. వాటికి ఊహించని రీతిలో స్పందన వచ్చింది. అదే సమయంలో లో దుస్తులతో యోగా చేస్తూ దిగిన పిక్స్‌ను కూడా ఆ మధ్య షేర్ చేసింది. ఇవైతే ఇంటర్నెట్‌ను షేక్ చేసేశాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు.. అందాలను ఒలకబోస్తూ చేసిన వర్కౌట్ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వదిలింది.

ఫిట్‌నెస్‌ కోసం పునర్నవి

ఫిట్‌నెస్‌ కోసం పునర్నవి

కొద్ది రోజులుగా పునర్నవి భూపాలం తన ఫిట్‌నెస్‌పై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే నిత్యం కొత్త కొత్త భంగిమలతో వర్కౌట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా తల కిందకు పెళ్లి కాళ్లు పైకి లేపిన ఫొటోలను వదిలింది. అలాగే, మరిన్ని ఫోజులిస్తూ చెమటోడ్చింది. వీటిలో పునర్నవి చాలా సన్నగా కనిపింస్తుంది. దీంతో ఆమె వదిలిన ఈ ఫొటోలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X