మీరేం అనుకుంటే నాకేంటి అంటూ.. ట్రాన్స్‌పరెంట్ డ్రెస్ లో షాక్ ఇచ్చిన పునర్నవి.. స్టన్నింగ్!
పునర్నవి భూపాలం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. ఈ తెలుగమ్మాయి చిన్న సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ మాత్రమే కాకుండా లీడ్ రోల్స్ కూడా చేసింది. పక్కింటి అమ్మాయి తరహాలో అందరికి కనెక్ట్ అయ్యేలా నటించడంలో ఈ అమ్మాయి స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక పునర్నవి ఇటీవల పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలతో ఊహించని విధంగా దర్శనమిచ్చింది.

ఆ సినిమాతోనే..
పునర్నవి భూపాలం మొదట్లో కొన్ని చిన్న సినిమాల్లో నటించింది. అనంతరం టెలివిజన్ ప్రపంచంలో కూడా మెరిసే ప్రయత్నం చేసింది. అమ్మడికి ఉయ్యాల జంపాల సినిమాతోనే కొంత గుర్తింపు అయితే లభించింది. ఇక ఆ తరువాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ... వాటితో అంతగా గుర్తింపు అయితే రాలేదు.

బిగ్‌బాస్ షో ద్వారా
ఇక బిగ్‌బాస్ మూడో సీజన్ లో పాల్గొన్న పునర్నవి... తనదైన ఆట తీరుతో అందరిని ఆకట్టుకుందనే చెప్పాలి. ఏ విషయంలోనైనా ఓపెన్‌గా మాట్లాడుతూ.. బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చకుంది ఈ భామ. బిగ్ బాస్ హౌస్ లో రెబల్‌గా తన అంద చందాలతో ఆకట్టుకున్న ఈ భామ... రాహుల్ సిప్లిగంజ్ తో కొనసాగిన ట్రాక్ ఆ సీజన్‌కే హైలైట్ అయ్యిందనే చెప్పాలి.

మధ్యలో రూమర్స్
ఆ తరువాత కొన్నాళ్ల పాటు వీళ్ల ట్రాక్ నడిచింది కానీ.. ఎవరి దారి వాళ్లు చూసుకుని ఒకరంటే ఒకరికి తెలియనట్టుగానే ఉన్నారు. ఇక మధ్యలో వారిద్దరూ గొడవ పడ్డారు అని కూడా కథనాలు వెలువడ్డాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని వారు కేవలం బిగ్ బాస్ షో కోసం మాత్రమే ఆ విధంగా ఒక ట్రాక్ నడిపినట్లు క్లారిటీ వచ్చేసింది.

సోషల్ మీడియాలో..
ఇక బిగ్‌బాస్ షో తర్వాత చాలా సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ.. నో చెప్పి పై చదువుల కోసం లండన్ వెళ్లింది. ప్రస్తుతం సోషల్ మీడియా తరచూ తన పోస్ట్‌లు పెడుతూ ఫ్యాన్స్‌కి టచ్‌లో ఉంటుంది ఈ భామ. అంతేకాదు వీలు చిక్కినప్పుడల్లా లైవ్ చాట్‌లో ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ చేస్తూ.. అలరిస్తుంది.

ట్రాన్స్‌పరెంట్ డ్రెస్.. షాకింగ్ లుక్
ఇక తాజాగా ఈమె ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ట్రాన్స్‌పరెంట్ డ్రెస్ కు సంబంధించిన ఫొటోస్ షేర్ చేసింది. ఇక అందులో స్టూల్ పై కూర్చొని పునర్నవి భూపాలం ఉంది. ఇక దానికి ఓ క్యాప్షన్ ఇచ్చింది. ఇది నేను, నా ఇరవైల చివరలో... నా చర్మం, నా శరీరం, నేను ఏమి ధరిస్తాను, ధరించవద్దు, నేను ఎవరు? నేనుగా ఉండాలి అనే మీ అభిప్రాయం నా బాధ్యత కాదు... అంటూ రాసుకొచ్చింది. అయితే ఆమె ట్వంటీస్‌లో దిగిన ఫోటో అని అర్థం అవుతుంది.

అందుకే ఈ పోస్ట్..
ఇక పునర్నవి ఈ రేంజ్ లో అయితే ఎప్పుడు కనిపించింది లేదు. నిత్యం గ్లామరస్ లుక్స్ లో ఆకట్టుకునే ఆమె నెగిటివ్ కామెంట్స్ కు కౌంటర్ గా ఈ క్యాప్షన్ ఇచ్చినట్టు అర్ధమవుతోంది. సినిమాల విషయానికి వస్తే.. పునర్నవి ఉయ్యాలా జంపాలా సినిమాతో తెలుగు తెరకుపరిచయం అయ్యింది. ఎందుకు ఏమో, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, సైకిల్, చిన్న విరామం వంటి చిత్రాల్లో నటించింది. అయితే పునర్నవికి సోలో హీరోయిన్‌గా బ్రేక్ ఇచ్చిన సినిమా అయితే ఇప్పటివరకూ పడలేదు. మరి ముందు ముందు పున్నూపాప సినిమాలు చేసి హిట్ ట్రాక్ ఎక్కుతుందేమో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











