For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అశ్లీల సైట్‌లో పునర్నవి ఫొటోలు: పేర్లు చెబుతూ సంచలన విషయాలు బయట పెట్టిన బిగ్ బాస్ బ్యూటీ

  |

  పునర్నవి భూపాలం.. తెలుగు వాళ్లకు పరిచయం చేయనవసరం లేని పేరిది. దీనికి కారణం కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ అమ్మడి పేరు మారుమ్రోగిపోతుండడమే. నటిగా కెరీర్‌ను ఆరంభించిన ఈ భామ.. పలు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో ప్రేమాయణం సాగిస్తున్నట్లు వచ్చిన వార్తలతో విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది. దీంతో పలు అఫర్లను కూడా అందుకుంటూ దూసుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అశ్లీల యాప్‌లో తన ఫొటోలు హల్‌చల్ చేయడంపై క్లారిటీ ఇచ్చింది పునర్నవి. వివరాల్లోకి వెళితే...

  హీరోయిన్ ఫ్రెండ్‌గా పరిచయం.. కెరీర్ అలా

  హీరోయిన్ ఫ్రెండ్‌గా పరిచయం.. కెరీర్ అలా


  హీరోయిన్ అవ్వాలన్న లక్ష్యంతో సినీ రంగంలోకి ప్రవేశించింది పునర్నవి భూపాలం. ఈ క్రమంలోనే రాజ్ తరుణ్ హీరోగా నటించిన ‘ఉయ్యాల జంపాల'లో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రను పోషించి టాలీవుడ్‌లోకి ఎంటర్ అయింది. ఆ తర్వాత శర్వానంద్ ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', ‘పిట్టగోడ', ‘మనసుకు నచ్చింది', ‘ఈ సినిమా సూపర్ హిట్', ‘ఎందుకో ఏమో' సహా ఎన్నో చిత్రాల్లో నటించింది.

  బిగ్ బాస్ ఎంట్రీతో మారింది.. ఫుల్ పాపులర్

  బిగ్ బాస్ ఎంట్రీతో మారింది.. ఫుల్ పాపులర్

  చిన్న చిన్న పాత్రలతో పాటు కొన్ని చిత్రాల్లో లీడ్ రోల్స్ కూడా చేస్తూ వచ్చింది పునర్నవి. కానీ, ఆమెకు అంతగా గుర్తింపు మాత్రం దక్కలేదు. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ మూడో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. హౌస్‌లో తన మార్క్ ఆటతీరుతో పాటు ముక్కసూటితనంతో ప్రేక్షకులను తన వైపునకు తిప్పుకుంది. అయినా ఈ షోలో మధ్యలోనే ఎలిమినేట్ అయింది పునర్నవి.

  హౌస్‌లో అతడితో లవ్ ట్రాక్.. బయట కూడా

  హౌస్‌లో అతడితో లవ్ ట్రాక్.. బయట కూడా

  బిగ్ బాస్ షోలోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే ఎంట్రీ ఇచ్చిన పునర్నవి.. సింగర్ రాహుల్ సిప్లీగంజ్‌తో లవ్ ట్రాక్ నడపడం ద్వారా ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకుంది. దీంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. షో ముగిసిన తర్వాత కూడా చాలా రోజుల పాటు వీళ్లిద్దరూ జంటగా రచ్చ చేశారు. దీంతో రాహుల్.. పునర్నవి పెళ్లి చేసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం కూడా సాగింది.

  ఎంగేజ్‌మెంట్ ఫోటోతో షాకిచ్చింది.. చివరికలా

  ఎంగేజ్‌మెంట్ ఫోటోతో షాకిచ్చింది.. చివరికలా

  బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పునర్నవి కెరీర్‌ ఏమంత ఆశాజనకంగా సాగడం లేదు. ఇలాంటి సమయంలో కొద్ది రోజుల క్రితం ఓ సినీ నటుడు రఘునందన్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నానని చెబుతూ ఆమె సోషల్ మీడియాలో ఓ ఫొటోను వదిలింది. ఆ తర్వాత ఈ పిక్ ఆహా రూపొందించిన ‘కమిట్ మెంటల్' అనే వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసమని వెల్లడించి షాకిచ్చింది.

  అశ్లీల సైట్‌లో పునర్నవి భూపాలం ఫొటోలు

  అశ్లీల సైట్‌లో పునర్నవి భూపాలం ఫొటోలు

  ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పునర్నవి బిగ్ బాస్ షో వల్ల తనకు లాభం జరగలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె ‘ఒక చిన్న విరామం', ‘సైకిల్' అనే సినిమాలు చేసింది. అలాగే, ‘కమిట్ మెంటల్' వెబ్ సిరీస్‌కు సీక్వెల్ చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తన ఫొటోలు డేటింగ్ యాప్‌లో కనిపించడంపై పునర్నవి తాజాగా క్లారిటీ ఇచ్చింది.

  Yash Fans Writes Pm Modi To Declare National Holiday On KGF 2 Release
  పేర్లు చెబుతూ సంచలన విషయాలు రివీల్

  పేర్లు చెబుతూ సంచలన విషయాలు రివీల్

  ఓ యూట్యూబ్ ఛానెల్‌తో చిట్ చాట్ చేసిన పునర్నవి.. ‘డేటింగ్ యాప్‌లో ‘తార', ‘హాసిని' అనే పేర్లతో ఎవరో నా ప్రొఫైల్స్ క్రియేట్ చేశారు. కొందరు ఈ విషయం నా దృష్టికి తీసుకొచ్చారు. అది చూసి షాకైపోయాను. నిజానికి ఆ యాప్స్ నేనెప్పుడూ వాడలేదు. ఎవరితోనూ డేటింగ్ చేయలేదు. ఇక, ఆ ఫొటోల గురించి అప్పుడే మర్చిపోయాను' అంటూ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుందామె.

  English summary
  Punarnavi Bhupalam is Indian actress in Telugu cinema and contestant in a reality TV show Bigg Boss Telugu 3. She was born on 28 May 1996 in Tenali, Guntur District, Andhra Pradesh to Bhagya Lakshmi and Nagesh Kumar Bhupalam. Her great-grandfather Bhupalam Subbarayudu Setty was a freedom fighter from Jammalamadugu, Cuddapah district, Andhra Pradesh.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X