జపాన్‌లో జబర్ధస్త్‌గా రష్మిక.. ఈ ఫొటోల్లో ఎలా ఉందో చూశారా?
రష్మిక మందన్నా.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ సుందరాంగి సుదీర్ఘ కాలంగా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. అదే సమయంలో నేషనల్ క్రష్‌గానూ మారి కోట్ల మంది అభిమానాన్ని సొంతం చేసుకుంటోంది. ఫలితంగా మరిన్ని అవకాశాలను అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్పుడైతే వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అయినప్పటికీ రష్మిక మందన్నా సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు కొన్ని బోల్డు ఫొటోలు వదిలింది. అవి మీరే చూడండి!
ఆరంభంలోనే సెన్సేషన్:రష్మిక మందన్నా టీనేజ్‌లోనే 'కిర్రాక్ పార్టీ' అనే కన్నడ చిత్రం ద్వారా హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత అదే భాషలో పలు సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. ఆ తర్వాత 'ఛలో' అనే మూవీతో తెలుగులోకి వచ్చింది. దీని తర్వాత ఈ అమ్మడు నిశ్చితార్థం రద్దు చేసుకుని దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయింది.

వరుస హిట్లతో స్టార్‌గానే:టాలీవుడ్‌లో మంచి ఆరంభాన్ని అందుకున్న రష్మిక మందన్నా.. ఆ తర్వాత తెలుగులో వరుసగా ఎన్నో చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలోనే 'ఛలో'తో పాటు 'గీత గోవిందం', 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ', 'పుష్ప' వంటి భారీ హిట్లను ఖాతాలో వేసుకుంది. తద్వారా రష్మిక స్టార్‌డమ్‌ను అందుకుంది. మధ్యలో కొన్ని ఫ్లాప్స్ పడ్డా ఆమె కెరీర్‌కు ఎలాంటి ఢోకా లేదు.
యానిమల్‌తో ఫుల్ క్రేజ్:'పుష్ప' వంటి పాన్ ఇండియా సక్సెస్ తర్వాత రష్మిక మందన్నా.. 'ఆడవాళ్లు మీకు జోహర్లు'లో నటించింది. ఇది ఆమెను దెబ్బ కొట్టింది. అయితే, ఆ తర్వాత వచ్చిన 'సీతా రామం' సూపర్ హిట్ అవడంతో ఆమె మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కింది. అలాగే, అమితాబ్ బచ్చన్‌తో 'గుడ్‌బై' మూవీ చేసింది. ఇక, 'యానిమల్' మూవీతో రష్మిక రేంజ్ మరింతగా పెరిగిపోయింది.

ఇప్పుడా మూవీలు చేస్తూ:రష్మిక మందన్నా 'యానిమల్' సక్సెస్‌తో మరింత ఎత్తుకు ఎదిగిపోయింది. ఈ ఉత్సాహంతోనే ఆమె ఫుల్ స్వింగ్‌లో వెళ్తోంది. ప్రస్తుతం ఈ భామ 'పుష్ప 2' మూవీ చేస్తోంది. అలాగే, 'రెయిన్‌బో', 'ది గర్ల్‌ఫ్రెండ్' వంటి చిత్రాల్లో నటిస్తోంది. అలాగే, బాలీవుడ్ 'చావా' అనే ఫిల్మ్ కూడా చేస్తోంది. వీటితో పాటు ధనూష్ - శేఖర్ కమ్ముల మూవీకి పచ్చజెండా ఊపింది.
అక్కడ మాత్రం బిజీగా:దక్షిణాది నుంచి ఉత్తరాది వరకూ అన్ని భాషల్లో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న రష్మిక మందన్నా.. సోషల్ మీడియాలో కూడా ఎంతో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, సినిమా అప్‌డేట్లను కూడా ఇస్తోంది. దీంతో నేషనల్ క్రష్ అనిపించుకుంటోంది.

అప్పుడప్పుడూ హాట్ షో:చాలా కాలంగా రష్మిక మందన్నా సోషల్ మీడియాలో చేసే సందడి గురించి అందరికీ తెలిసిందే. ఇందులో ఎక్కువగా తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటిలో అప్పుడప్పుడూ హాట్ ట్రీట్ ఇస్తూ తీసుకున్నవి కూడా ఉంటున్నాయి. ముఖ్యంగా గ్లామర్ షో చేస్తూ దిగిన పిక్‌లను కూడా రష్మిక ఎక్కువగా షేర్ చేస్తోంది. ఫలితంగా ఈ అమ్మడు ఇంటర్నెట్‌ను ఊపి పడేస్తోంది.
రష్మిక ఫొటోలు వైరల్:పాన్ ఇండియా బ్యూటీ రష్మిక మందన్నా తాజాగా సోషల్ మీడియాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు స్ట్రాప్ అండ్ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. దీంతో వీటిలో ఆమె అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా రష్మిక మందన్నా షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చి.. వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











