8 ఏళ్ల కెరీర్.. 15 సూపర్ హిట్.. 10 కోట్ల రెమ్యూనరేషన్.. సౌత్ ఇండస్ట్రీని శాసిస్తున్న బ్యూటీ..
సినీ ఇండస్ట్రీలో రోజుకో కొత్త హీరోయిన్ అడుగుపెడుతున్నది. ఈ క్లిష్ట నేపథ్యంలో సరైన ఆఫర్ల అందుకుంటూ..స్టార్ హీరోయిన్గా కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది ఓ హీరోయిన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి కేవలం 8 ఏళ్లు మాత్రమే అవుతోంది. తన కెరీర్ లో ఏకంగా 15 సూపర్ హిట్ మూవీస్ లను తన ఖాతాలో వేసుకుంది. అందులో రెండు సినిమాలు పాన్ ఇండియా మూవీలు కూడా ఉన్నాయి.తాజాగా ఇప్పుడు ఒక్కొక్క సినిమాకు 10 కోట్ల పారిదోషకం తీసుకుంటుంది. ఇంతకీ ఆ క్రేజీ బ్యూటీ ఎవరు. ఓ లూక్కేయండి.
ఆ బ్యూటీ ఎవరో కాదు.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ప్రస్తుతం ఈ బ్యూటీకి నేషనల్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. 16 ఏండ్ల కుర్రాడి దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలోడి వరకు ఈ బ్యూటీ చూస్తే పడిపోవాల్సిందే. పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ కన్నడ బ్యూటీ కిర్రాక్ పార్టీ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

తొలి సినిమాతోనే మంచి పాపులర్టీని సంపాదించుకుంది. అదే సమయంలో ఈ సినిమా హీరో రక్షిత్ శెట్టితో ప్రేమాయణం నడిపిందనీ టాక్. కానీ ఏమైందో తెలియదు. ఆ రిలేషన్ బ్రేకప్ .. ఈ మూవీ తరువాత కన్నడలో పునీత్ రాజ్‌కుమార్ సరసన అంజని పుత్ర, గణేశ్ సరసన ఛమక్ అనే సినిమాల్లో నటించి మంచి ఫేమ్ తెచ్చుకుంది. దీంతో టాలీవుడ్ లో కూడా నటించే అవకాశం అందుకుంది. అలా.. తెలుగులో హీరో నాగ శౌర్య నటించిన 'ఛలో' అనే సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలో అడుగుపెట్టింది. తొలి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
ఆ తరువాత విజయ్ దేవరకొండ హీరోగా 'గీతా గోవిందం' సినిమాలో నటించే అవకాశం కొట్టేసింది రష్మిక. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో రష్మిక కు మంచి గుర్తింపు రావడమే కాకుండా.. తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది. ఈ సమయంలో మరోసారి విజయ్ దేవరకొండతో కలిసి 'డియర్ కామ్రెడ్'సినిమాలో నటిచింది. ఈ మూవీ తమన్నా కెరీర్ లో సూపర్ హిట్ అయింది. తర్వాత 2020లో ప్రిన్స్ మహేష్ బాబు సరసన 'సరిలేరు నీకెవ్వరు' అనే సినిమాలో నటించే అవకాశం కొట్టేసింది ఈ అమ్మడు.
ఆ తరవాత హీరో నితీన్ 'భీష్మ'లో నటించి మెప్పించి.. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. ఆ తర్వాత 2021లో రష్మిక మందన్న నటించిన 'పొగరు', తమిళ 'సుల్తాన్' తెలుగులో 'పుష్ప: ది రైజ్' సూపర్‌హిట్‌గా నిలిచాయి. అలాగే.. 2022లో 'సీతా రామన్' అనే సినిమాలో నెగిటివ్ లో నటించి మెప్పించింది. ఈ మూవీ కూడా సూపర్ హిట్ గా నిలిచింది.
ఈ అమ్మడు కెరీర్ లో అల్లు అర్జున్ పుష్ప 1 మైల్ స్టోన్ గా నిలిచిందని చెప్పవచ్చు. ఈ మూవీతో రష్మిక నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకుంటుంది. ఆ తరువాత హిందీలో యానిమల్ అనే ప్యాన్ ఇండియా చిత్రంలో నటించి.. బాలీవుడ్ ప్రేక్షకులను కూడా అలరించింది. అలాగే.. ఛవా అనే హిస్టారికల్ పాన్-ఇండియా సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో విక్కీ కౌశల్ సరసన రష్మిక కథానాయికగా నటిస్తుంది.ఇలా వరుస సినిమాతో అటు హిందీలోను, ఇటు తెలుగులోను అదరగొడుతోంది రష్మిక మందన్న.

తాజాగా తాజాగా మరో పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకులకు ముందుకి రాబోతుంది. అదే పుష్ప 2 .. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ మూవీ డిసెంబర్ 5న వరల్డ్ వైస్ గా విడుదల కాబోతుంది.ఈ మూవీ విడుదలకు ముందే ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఈ మూవీలో నటించిన కోసం రష్మిక మందాన ఏకంగా 10 కోట్ల రెమినేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ మూవీ రష్మిక మందాన శ్రీవల్లి అనే పాత్రలో నటించి మెప్పించింది. అల్లు అర్జున్ శ్రీవల్లి కెమిస్ట్రీ చాలా బాగా వర్క్ అవుట్ అయింది. రష్మిక దాదాపు 5 సంవత్సరాలు కష్టపడింది.
రష్మిక సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. కేవలం ఎనిమిది సంవత్సరాలు మాత్రమే అవుతుంది. తన కెరీర్ లో ఏకంగా 15 సూపర్ హిట్స్ అందుకుంది. అందులో రెండు సినిమాలు మాత్రం ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచి బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ప్రస్తుతం అత్యధిక పారిదోషికం అందుకుంటున్న హీరోయిన్ గా నిలిచింది.


Click it and Unblock the Notifications











