గల్ల చొక్కాలో పుష్పగాడి కూతురు .. కత్తుల్లాంటి చూపుతో కోసేస్తోన్న పావని కరణం
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ ఎంతటి సంచలనం సృష్టిస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా .. ఒక్కొక్క మూవీ రికార్డును బద్ధలు కొడుతూ కేవలం 32 రోజుల్లో భారత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో రెండో స్థానంలో నిలిచిన బాహుబలి 2ని అధిగమించి ప్రస్తుతం రూ.2000 కోట్ల వైపు వేగంగా పరుగులు తీస్తోంది.
కేవలం వసూళ్లు మాత్రమే కాదు.. పుష్ప ఫ్రాంచైజీలో నటించిన అందరికీ ఎంతో మంచి పేరు దక్కింది. అల్లు అర్జున్ నేషనల్ వైడ్ పాపులర్ అవ్వగా.. రష్మిక మందన్న ఏకంగా నేషనల్ క్రష్‌గా మారింది. వారిద్దరే కాదు నటీనటులు, సాంకేతిక నిపుణులకు గుర్తింపు తీసుకురావడమే కాదు ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్స్‌ను దక్కించుకున్నారు. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది పావని కరణం గురించి. హీరోకి అన్న కూతురిగా కనిపించే ఈ ముద్దుగుమ్మ.. చిన్నాయన అంటూ అల్లు అర్జున్‌ను పిలుస్తుంది. అంతేకాదు పుష్ప 2లో కథ కీలక మలుపు తిరగడానికి, క్లైమాక్స్‌కి కారణం ఈమె.

సమోసా తింటావా శిరీష అనే ఒకే ఒక్క డైలాగ్‌తో పావని కరణం ఫుల్ పాపులర్ . ఇప్పుడు రీసెంట్‌గా పుష్ప 2తో ఆమె పేరు బాగా నోటెడ్ అయ్యింది. ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడానికి తెగ ప్రయత్నిస్తోంది పావని. నటనపై ఆసక్తితో తొలుత షార్ట్ షిల్మ్స్‌లో నటించిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ దర్శక నిర్మాతల కళ్లలో పడింది. తర్వాత నెమ్మదిగా సినిమాల్లోకి అడుగుపెట్టి లివింగ్ టు గెదర్ పొట్టి సినిమాతో చిత్ర సీమలోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం గాడ్స్ ఆఫ్ ది ధర్మపురి , సిన్, పరేషాన్, మోడ్రన్ లవ్ హైదరాబాద్, హిట్ 2లలో నటించింది.
పుష్ప 2 లాంటి మెమొరబుల్ హిట్‌తో పాటు తనకు ఇంతటి క్రేజీ ప్రాజెక్ట్‌లో కావేరిగా కథను మలుపు తిప్పే పాత్ర ఇచ్చినందుకు పావని కరణం గాల్లో తేలుతోంది. అయితే ఈ సినిమా తర్వాత పావనిపై ఓ రేంజ్‌లో ట్రోలింగ్ జరిగింది. దీనికి కారణం లేకపోలేదు. తనకు అవకాశం కల్పించినందుకు గాను సుకుమార్, అల్లు అర్జున్‌లకు ఆమె పదే పదే ట్వీట్లు చేయడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక ఆపేయండి మేడమ్ అంటూ కామెంట్స్ పెట్టారు.
ఇకపోతే.. పుష్ప 2 తర్వాత పావని కారణం చేయబోయే ప్రాజెక్ట్‌లపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం పలువురు దర్శక నిర్మాతలు ఈమెతో సంప్రదింపులు జరుపుతున్నారని ఫిలింనగర్ టాక్. పుష్ప క్రేజ్ దృష్ట్యా ఓ భారీ చిత్రంలో ఆమెకు అవకాశం దక్కుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలాఉండగా.. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే పావని కరణం ఎప్పటికప్పుడు తన కొత్త సినిమాలు, ఇతర వ్యక్తిగత వివరాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా జీన్స్ ప్యాంట్ , గల్ల షర్ట్ వేసి చేసిన ఫోటో షూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. మరి ఇంకేందుకు ఆలస్యం మీరూ పావని కరణం అందాలు చూసేయండి.


Click it and Unblock the Notifications











