Rashmika Mandanna: రోజుకు ఒక్కడితో రష్మిక మందన్న.. అలా పట్టుబడిన నేషనల్ క్రష్!
సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ఎదగాలంటే రకరకాల కష్టాలను అధిగమించి.. పలు రకాల సమస్యలను పంటి కింద అణిచివేసి.. టాలెంట్, అదృష్టాన్ని నమ్ముకొంటే తప్పా గ్లామర్ ప్రపంచంలో రాణించడం కష్టమే. ఒకప్పటి స్టార్ హీరోయిన్ల నుంచి నేటి యువ తారల వరకు కిందిస్థాయి నుంచి పైకి రావడం తెలిసిందే. అలాగే రష్మిక మందన్న లైఫ్ కూడా మినహాయింపు కాదు. ఆమె కష్టపడి సొంతంగా నేషనల్ క్రష్‌గా ఎదురైంది. ఈ క్రమంలో రష్మిక ఎదురైన ఓ వింత సమస్య ఏమిటంటే?
రష్మిక మందన్న బెంగళూరులో చదువుకొనే రోజుల్లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులో ప్రయాణించడం తెలిసిందే. ఆమె మోడలింగ్ చేసినప్పుడు కానీ.. అలాగే సినిమా ఇండస్ట్రీలో తిరే సమయంలో కూడా స్కూటీ, ఆటో, ఆర్టీసీ బస్సులో తిరిగినట్టు ఆమె స్నేహితులు వెల్లడించడం తెలిసిందే. అలాంట పరిస్థితి నుంచి ప్రస్తుతం కోట్లు విలువ చేసే విలాసవంతమైన వాహనాల్లో ప్రయాణించే స్థాయికి ఎదిగారు.

అయితే ఇటీవల రష్మిక రూమ్ మేట్ ప్రేరణ కూడా ఆ విషయాన్ని బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్‌లో కూడా వెల్లడించింది. తాము అర్ధరాత్రి స్కూటీలపై నగరంలో తిరిగే వాళ్లం. నైట్ లైఫ్‌ను బాగా ఎంజాయ్ చేసే వాళ్లం. ఆ రోజుల్లో మేమంత లైఫ్‌ను బాగా ఆస్వాదించాం. మేము ఇద్దరం కలిసి ఓకే రూమ్‌లో చాలా రోజులుగా ఉండేవాళ్లం అని ప్రేరణ తనతో ఉన్న అనుబంధాన్ని తెలిపింది.
అయితే రష్మిక సినిమా అవకాశాల కోసం ప్రయత్నించే సమయంలో ఆమె ప్రతీ రోజు ఉబర్, ఓలా, రాపిడో లాంటి సర్వీసులను వాడుకొనేదట. ప్రతీ రోజు టూ వీలర్‌పై ప్రయాణించే వారట. అయితే రష్మిక అలా ప్రతీ రోజు ఒక్కో వ్యక్తితో ప్రయాణించడం ఆమె తండ్రి స్నేహితుడు గమనించారట. నేషనల్ క్రష్ మీద అనేక అనుమానాలు రావడంతో ఆయన నేరుగా తండ్రికి ఫిర్యాదు చేశారట.
రష్మిక తండ్రిని స్నేహితుడు కలిసి మీ అమ్మాయి పద్దతి బాగాలేదు. ఆమె ప్రతీ రోజు ఒక్కో వ్యక్తితో బైక్ మీద తిరుగుతున్నది. మీరు నీ కూతురును కంట్రోల్ చేయండి. లేకపోతే పరిస్థితి చేయి దాటి పోవడం గ్యారెంటీ అని సలహా ఇచ్చాడు. దాంతో ఫ్రెండ్ ఇచ్చిన సలహాతో రష్మికను పిలిచి ఆమె ఫాదర్ నిలదీశాడట. ఇలా అబ్బాయిలతో తిరగడం మంచిది కాదు అంటూ వార్నింగ్ ఇచ్చారట. దాంతో ఆమె షాక్ గురై అసలు విషయం చెప్పేసిందంట.

నగరంలో తాను బైక్ సర్వీసుల ద్వారా ట్రావెల్ చేస్తుంటాను. నీ ఫ్రెండ్ తప్పుగా భావించి నీకు కంప్లయింట్ ఇచ్చి ఉంటారు. అంతకు మించి ఏమీ లేదు అని రష్మిక చెప్పడంతో తండ్రి రిలాక్స్ అయ్యాడంట. అలా రష్మికకు ఓ చేదు అనుభవం లాంటి సంఘటన ఫ్యామిలీ నుంచి వచ్చిందని రష్మిక ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
రష్మిక సినిమాల విషయానికి వస్తే.. ఆమె నటించిన ఫుష్ప 2 సినిమా రిలీజ్‌కు సిద్దంగా ఉంది. పుష్ప 1 చిత్రం ద్వారా ఆమె దేశవ్యాప్తంగా నేషనల్ క్రష్ అనే పాపులారిటీని సంపాదించుకొన్నది. ఆ తర్వాత యానిమల్ సినిమా ద్వారా బాలీవుడ్‌లో కూడా టాప్ హీరోయిన్‌గా చెలామణీ అవుతున్నది. రష్మిక కిందిస్థాయి నుంచి దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకొనే హీరోయిన్లలో ఒకరిగా మారిపోయిందనేది అందరికి తెలిసింది.


Click it and Unblock the Notifications











