Rashmika Mandanna Deepfake మరోసారి డీప్ ఫేక్ బారిన రష్మిక... ఈసారి మరీ దారుణంగా!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఛలో సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ భామ.. మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ అందుకొని అందరిచేత ఔరా అనిపించింది. ఇక ఆ తరువాత రష్మిక ఏది పట్టినా బంగారమే అయ్యింది. ఏ స్టార్ హీరో సరసన చేసినా హిట్ టాక్ తెచ్చుకోవడంతో టాలీవుడ్ గోల్డెన్ లేడీ అనే పేరును తెచ్చుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ, కన్నడ లో కూడా తన సత్తా చాటుతోంది.
ఇక స్టార్ హీరోయిన్స్ అన్నాకా రూమర్స్ కామనే.. సోషల్ మీడియాలో ట్రోల్స్ కామనే. కానీ, ఈ మధ్య డీప్ ఫేక్ అని ఒక కొత్త వివాదంలో రష్మిక ఇరుక్కుంది. ఒకసారి కాదు రెండు సార్లు కాదు. ప్రతి సారి ఆమె బలి అవుతుంది. అసలు డీప్ ఫేక్ అంటే ఏంటి అంటే.. కొన్ని అసభ్యకరమైన ఫోటోలకు.. హీరోయిన్స్ ఫేస్ ను ఎడిట్ చేసి.. అసలు ఒరిజినల్ ఇమేజ్ లా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మొట్టమొదటిసారి రష్మిక ఈ డీప్ ఫేక్ వీడియో బారిన పడింది. ఎవరో ఒక అమ్మాయి జిమ్ చేసి.. లిఫ్ట్ లో నుంచి వస్తున్న వీడియోను ఎడిట్ చేసి ఆమె ఫేస్ బదులు రష్మిక ఫేస్ ను ఎడిట్ చేశారు.

ఇక నిజంగా చాలామంది ఆమె రష్మికనే అనుకోని విమర్శించడం మొదలుపెట్టారు. డీప్ క్లివేజ్ షో తో రష్మిక కనిపించడంతో.. ఛీఛీ రష్మిక ఏంటి ఇలా చేసింది అంటూ ట్రోల్ చేశారు. ఇక ఈ వీడియోపై బిగ్ బి అమితాబ్ మొట్టమొదటిసారి స్పందించడంతో సోషల్ మీడియా మొత్తం ఒక్కటిగా మారి రష్మికకు సపోర్ట్ గా నిలిచారు. రష్మిక సైతం, .. ఈ డీప్ ఫేక్ వలన తాను ఎంతో ఒత్తిడికి గురయ్యానని, తన కుటుంబం చాలా అవమానాలను ఎదుర్కొన్నట్లు తెలిపింది.
ఇక అక్కడితో ఈ వివాదం ముగిసింది అనుకుంటే.. వారంకోసారి రష్మిక డీప్ ఫేక్ వీడియో బయటపడుతుంది. అయితే ఈసారి మరీ దారుణంగా ఎడిట్ చేసి వదిలారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారాయి. ప్రముఖ కొలంబియా మోడల్ డానియెల్లా విల్లారియల్ బికినీ వీడియోను ఎడిట్ చేసి.. ఆమె ఫేస్ లో రష్మిక ఫేస్ ను ఎడిట్ చేశారు. పింక్ కలర్ బికినీలో రష్మిక అందాల విందు అంటూ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
సడెన్ గా రష్మికను చూస్తే.. నిజంగానే ఆమె బికినిలో కనిపించిందేమో అనేంతలా ఆ ఎడిట్ ఉంది. ఇకపొతే రష్మిక ఫ్యాన్స్ మాత్రం.. మా నేషనల్ క్రష్ బాడీ ఎలా ఉంటుందో మాకు తెలియదా.. ? ఇదంతా డీప్ ఫేక్.. ఇలా చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు సైబర్ క్రైమ్ వారికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ డీప్ ఫేక్ వీడియోపై రష్మిక స్పందించలేదు.

ఇకపోతే నేషనల్ క్రష్ సినిమాల విషయానికొస్తే వరుస సినిమాలతో బిజీగా మారింది. తెలుగులో పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్ సినిమాలు చేస్తుంది. ఇవి కాకుండా తమిళ్, హిందీలోనూ కొన్ని ప్రాజెక్ట్స్ కు సైన్ చేసింది. మరి ఈ సినిమాలతో అమ్మడు ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











