ప్రియుడితో బ్రేకప్.. సొంత ఇండస్ట్రీ బ్యాన్.. అయినా పాన్ ఇండియా స్టార్ అయిన హీరోయిన్ ఎవరో తెలుసా?
ఇండస్ట్రీ నుంచి బ్యాన్ అవ్వడమే కాకుండా ప్రేమించిన హీరోతో ఎంగేజ్మెంట్ ను క్యాన్సిల్ చేసేసుకుంది. ఎన్నో అవమానాలు దాటుకుని పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదిగింది. ఆ హీరోయిన్ ఎవరు అనే విషయంపై ఓ లుక్కేద్దాం.
మూవీ న్యూస్ లో బాగా ఫాలో అయ్యే వారైతే ఇదంతా చదివాక మనం మాట్లాడుకునేది రష్మిక మందన్న గురించే అనే విషయాన్ని టక్కున పట్టేస్తారు. అవును అదే నిజం. 2016లో కన్నడ మూవీ కిరిక్ పార్టీతో కన్నడ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీతో సహా అనేక భాషల్లో నటించి తనదైన ముద్ర వేసింది.

ఒక సాధారణ హీరోయిన్ నుంచి పాన్ ఇండియా హీరోయిన్ గా ఆమె ప్రయాణం అంత సులభంగా సాగలేదు. 2022లో రష్మిక తన హోమ్ ఇండస్ట్రీ అయిన కన్నడ లోనే బ్యాన్ ఎదుర్కొందనే వార్తలు వచ్చాయి. ఆ తరువాత పలుమార్లు కూడా కన్నడిగుల ఆగ్రహానికి గురైంది.
రష్మిక మందన్న కర్ణాటకలోని కొడుగు జిల్లాలో జన్మించింది. ఆమె తండ్రి వ్యాపారవేత్త. ముందుగా మోడలింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది ఈ కన్నడ సోయగం. ఆ సమయంలోనే కన్నడ హీరో రక్షిత్ శెట్టితో కలిసి కిరిక్ పార్టీ సినిమాలో నటించింది. రక్షిత్ ఈ మూవీకి నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఈ మూవీకి కాంతారా హీరో రిషబ్ శెట్టి అప్పట్లో దర్శకత్వం వహించారు.
ఆ తర్వాత మరో రెండు కన్నడ సినిమాలలో నటించిన రష్మిక పునీత్ రాజ్ కుమార్ తో కలిసి అంజనీపుత్ర, చమక్ అనే సినిమాల్లో మెరిసింది. ఈ రెండు సినిమాలు కూడా హిట్ కావడంతో 2018లో ఛలో మూవీ కోసం టాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. ఇక ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది.

అదే ఏడాది గీతాగోవిందం మూవీ రిలీజ్ కావడం, బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో రష్మిక కెరీర్ కీలకమైన మలుపు తిరిగింది. ఛలో నుంచి నిన్నటి యానిమల్ మూవీ దాకా విభిన్నమైన పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది రష్మిక. అయితే ఆమె కెరీర్ లో వివాదాలు ఏమీ తక్కువ కాదు.
2018లో ఈ బ్యూటీ రక్షిత్ శెట్టితో అప్పటికే జరిగిన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుని అభిమానులను షాక్ కు గురి చేసింది. 2022లో ఆమె చేసిన గుడ్ బై అనే హిందీ మూవీ ప్రమోషన్లలో కిరిక్ పార్టీ గురించి మాట్లాడి వివాదానికి కారణమైంది. ఆ మూవీ ప్రొడక్షన్ హౌస్ గురించి ఆమె ప్రస్తావించకపోవడంతో రక్షిత్ శెట్టి ఫ్యాన్స్ మండిపడ్డారు. ఎందుకంటే ఆయనే నిర్మాత కాబట్టి.
ఆ తర్వాత కిరిక్ పార్టీ మూవీకి దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టి కూడా ఓ ఇంటర్వ్యూలో రష్మికపై పరోక్షంగా ఫైర్ అయ్యారు. ఎందుకంటే ఆయన బ్లాక్ బస్టర్ మూవీ కాంతారాను తాను చూడలేదంటూ రష్మిక కామెంట్స్ చేయడం మరో రచ్చకు కారణమైంది. అయితే అప్పటికే ఆ మూవీ రిలీజ్ అయ్యి జస్ట్ 3 లేదా 4 రోజులు కావడంతో తనకు టైమ్ దొరకక చూడలేదని క్లారిటీ ఇచ్చింది.
ఈ వివాదాల నేపథ్యంలోనే రష్మికను కన్నడ చిత్ర పరిశ్రమ బ్యాన్ చేస్తుందని ఊహాగానాలు వినిపించాయి. అప్పట్లో రష్మికపై కోపంగా ఉన్న కన్నడిగులు ఆమెను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. కాగా ప్రస్తుతం సినిమాలతో పాటు విజయ్ దేవరకొండతో రిలేషన్షిప్ గురించి తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది రష్మిక.


Click it and Unblock the Notifications











