నడుము వంపులు చూపిస్తున్న పుష్ప బ్యూటీ.. బన్నీతో మాస్ సెప్పులేస్తే థియేటర్లు దద్దరిల్లాల్సిందే..
Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు 2017లో చిత్రాంగద అనే సినిమాలో బాలనటిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్ర డైరక్షన్ లో వచ్చిన పెళ్లి సందడి అనే ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టింది. తన మొదటి సినిమాలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించింది. ఈ పాపులారిటీతో మాస్ మహారాజు 'ధమాకా' అనే మూవీ నటించే అవకాశం దక్కించుకుంది. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు ఈ బ్యూటీకి మంచి గుర్తింపు వచ్చింది.
అనంతరం .. బాలకృష్ణ నటించిన ' భగవాన్ కేసరి' సినిమా మెయిన్ రోల్ నటించి, మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. నటనపరంగా వందకి వంద మార్కులు కొట్టేసింది ఈ బ్యూటీ. ఆ తరువాత గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు సరసన నటించే అవకాశం కొట్టేసింది ఈ అమ్మడు. ఇలా వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న ఈ బ్యూటీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీలో నటించే అవకాశం కొట్టేసింది.

ఈ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ 'పుష్ప-2'లో ఓ స్పెషల్ సాంగ్‌లో యంగ్ బ్యూటీ శ్రీలీల చిందులు చేసింది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ డ్యాన్సర్ లో శ్రీలీల ఒకరు. అల్లు అర్జున్ మాస్ స్టెప్పులకు శ్రీ లీల గ్లామర్ తోడైతే ఐటమ్ సాంగ్ మరింత హాట్ గా మారబోతుందని, అల్లు అర్జున్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. వీరిద్దరూ మాస్ స్టెప్పులు వేస్తే థియేటర్లు దద్దరిల్లి పోవాల్సిందేనని అంటున్నారు. ఈ స్పెషల్ సాంగ్ లో శ్రీ లీల డాన్స్ చేసేందుకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నదనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇండస్ట్రీ ఇన్ పుట్స్ ప్రకారం శ్రీ లీల సాంగ్ కోసం సుమారు రూ. 2 కోట్ల పారిదోషకం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ ను ఐదు రోజులలో పూర్తి చేసిందట. సుకుమార్ - దేవి శ్రీ ప్రసాద్ కాంబోలో ఇప్పటికే వచ్చిన ఐటెం సాంగ్స్ కు ప్రత్యేక క్రేజ్ ఉంది. ఇప్పుడు పుష్ప 2 లోను అదిరిపోయేలా 'కిస్సెక్ 'అనే ఐటమ్ సాంగ్ ను మూవీ మేకర్స్ సిద్ధం చేశారని తెలుస్తోంది. గతంలో పుష్పవన్ మూవీలో అంటావా మామ అని సాంగ్ పై ఊర మాస్ స్టెప్పు లేసిన సమంత రూ. 5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందని టాక్. ఈ లెక్కన చూస్తే శ్రీలీలనే చాలా తక్కువ మొత్తంలో పారిదోషకం తీసుకున్నట్లు ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోయిన్ శ్రీ లీల.. తాజాగా తన హాట్ లుక్ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఫ్యాన్స్ ను పలుకరిస్తుంది. అలా తాజాగా శ్రీలీల తన ఇన్ గ్రామ్ లో తన క్యూట్ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలో శ్రీ లీల వైట్ శారీలో స్టన్నింగ్ లూక్స్ తో మెస్మరైజ్ చేస్తుంది. తన క్యూట్ లుక్స్ తో మత్తెక్కిస్తూ కుర్రాళ్లకు చెమటలు పుట్టిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లూక్కేయండి.


Click it and Unblock the Notifications











