Raai Laxmi engagement: డేటింగ్ మేటర్ రివీల్ చేసిన రత్తాలు.. పర్సనల్ అంటూనే సీక్రెట్ లీక్
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తుంటారు. కానీ, వారిలో కొందరికి మాత్రమే మంచి గుర్తింపు దక్కుతోంది. మరికొందరైతే ఇలా వచ్చి.. అలా వెళ్లిపోతుంటారు. ఈ జాబితాలోకే వచ్చి చేరుతుంది హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మీ. టాలీవుడ్‌లో అంతగా సక్సెస్ కాలేకపోయిన ఈ ముద్దుగుమ్మ.. ఇతర భాషల్లో మాత్రం మంచి గుర్తింపును దక్కించుకుంది. తద్వారా దేశ వ్యాప్తంగా ఫేమస్ అయింది. సోషల్ మీడియా పుణ్యమా అని ఎప్పుడూ వార్తల్లోనే నిలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా రాయ్ లక్ష్మీ తన ఎంగేజ్‌మెంట్‌ను ప్రకటించింది. ఆ వివరాలు మీకోసం!

‘కాంచనమాల’గా ఎంట్రీ ఇచ్చిన రాయ్ లక్ష్మీ
శ్రీకాంత్ హీరోగా నటించిన 'కాంచనమాల కేబుల్ టీవీ' అనే సినిమాతో హీరోయిన్‌గా అడుగులు వేసింది కన్నడ బ్యూటీ రాయ్ లక్ష్మీ. దీని తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో 'నీకు నాకు' అనే చిన్న సినిమా మాత్రమే చేసి.. టాలీవుడ్‌కు బైబై చెప్పేసింది. అయితే, దక్షిణాదిలోని మిగిలిన భాషల్లో వరుస పెట్టి చిత్రాలు చేసింది. తద్వారా బిజీ హీరోయిన్‌గా చాలా కాలం పాటు వెలిగింది.

అక్కడ మాత్రం సక్సెస్.. దేశ వ్యాప్తంగా క్రేజ్
తెలుగు సినిమా పరిశ్రమలో సక్సెస్ కాలేకపోయిన రాయ్ లక్ష్మీ.. తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో మాత్రం పలు హిట్లను తన ఖాతాలో వేసుకుని స్టార్‌గా ఎదిగిపోయింది. ఆ సమయంలోనే 'అకీరా' అనే సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'జూలీ 2' అనే సినిమా చేసి అందాలను ఆరబోసింది. ఈ సినిమాల కారణంగా దేశ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది.

బాలయ్యతో అలా.. మెగా హీరోలతో స్పెషల్
బాలకృష్ణ నటించిన 'అధినాయకుడు' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది రాయ్ లక్ష్మీ. ఆ తర్వాత రవితేజ - గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన 'బలుపు' అనే సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఇది సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆ వెంటనే పవన్ కల్యాణ్ నటించిన 'సర్ధార్ గబ్బర్ సింగ్', మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150'లోనూ ఐటెం సాంగ్స్‌తో అదరగొట్టేసిందామె.

అందులోనే హల్‌చల్... కవ్విస్తోన్న బ్యూటీ
రాయ్ లక్ష్మీ సినిమా షూటింగ్‌లు ఉన్నా లేకున్నా చాలా రోజులుగా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ బిజీగా ఉంటోంది. ఇందులో తన కెరీర్ గురించిన విషయాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. దీంతో ఈమెను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది.

డేటింగ్ మేటర్ రివీల్ చేసేసిన రాయ్ లక్ష్మీ
ప్రస్తుతం రాయ్ లక్ష్మీ ఇతర భాషలతో పాటు కొన్ని తెలుగు సినిమాల్లోనూ నటిస్తోంది. వీటికి సంబంధించిన షూటింగుల్లో సైతం పాల్గొంటోంది. ఈ మధ్యనే హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోన్న సమయంలో గాయాలపాలైంది. కెరీర్ పరంగా హ్యాపీగానే ఉన్న ఈ అమ్మడు.. తాజాగా తన ఎంగేజ్‌మెంట్ విషయాన్ని వెల్లడిస్తూ ఓ పోస్టును పెట్టింది. దీంతో మరోసారి వార్తల్లో నిలుస్తోంది.
అమృత అయ్యర్ బ్యూటీఫుల్ ఫోటో గ్యాలరీ.. చిరునవ్వుతో కట్టిపడేస్తున్న బ్యూటీ

వాళ్లు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం
తాజాగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్న విషయాన్ని వెల్లడించింది రాయ్ లక్ష్మీ. 'కొంత కాలంగా చాలా మంది పదే పదే అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలనుకున్నా. మా ఎంగేజ్‌మెంట్ తేదీ ఫిక్సయింది. ఈ నెల 27న జరగనున్న మా నిశ్చితార్థానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను గత వారమే మా సన్నిహితులకు పంపా'మని చెప్పింది.
Recommended Video

పర్సనల్ అంటూనే రహస్యాన్ని బయట పెట్టి
ఇదే ట్వీట్‌లో రాయ్ లక్ష్మీ 'నేను నా రిలేషన్‌షిప్‌ని దాచాలనుకోవడం లేదు. ఆ మాటకొస్తే నా గురించి వేరేవాళ్లకు అనవసరం. నాకంటూ కొంత స్వేచ్ఛ కావాలి. నా జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలను బయటపెట్టాలనుకోవడం లేదు. నా 'లవ్'తో జీవితాన్ని పంచుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను' అని రాసుకొచ్చింది. మొత్తానికి పర్సనల్ అంటూనే మేటర్ రివీల్ చేసింది.


Click it and Unblock the Notifications











