Raai Laxmi రాయ్ లక్ష్మీ సొగసుల జాతర..రత్తాలు ఓ రేంజ్‌లో గ్లామర్ ట్రీట్!
అందం, అభినయం కొదువలేని హీరోయిన్లలో రాయ్ లక్ష్మీ ఒకరంటే ఏ మాత్రం సందేహం అక్కర్లేదు. పుష్కలంగా గ్లామర్ ఉన్నప్పటికీ.. హీరోయిన్‌గా నిలదొక్కకపోవడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది. అయితే సినిమా హిట్, ఫ్లాప్ అనే సంబంధం లేకుండా ఆమె తన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. అయితే వయసు మీద పడుతున్న వన్నె తరగని అందాలతో ఆకట్టుకోవడం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అయితే రాయ్ లక్ష్మీ గ్లామర్, బ్యూటీ సీక్రెట్స్ వివరాల్లోకి వెళితే..
రాయ్ లక్ష్మీ కెరీర్: రాయ్ లక్ష్మీ కెరీర్ విషయానికి వస్తే.. బెంగళూరుకు చెందిన ఈ అందాల భామ మోడల్‌గా కెరీర్ ఆరంభించింది. కర్కా కసాదరా సినిమాతో తమిళ సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ధామ్ ధూమ్, మనకథ, అరణ్మనై చిత్రాల్లో నటించింది. అంతే కాకుండా తెలుగులో కాంచనమాల కేబుల్ టీవీ ద్వారా ప్రేక్షకుల పరిచయమైంది. చిరంజీవితో ఖైదీ నంబర్ 150, పవన్ కల్యాణ్‌తో సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో నటించింది. మలయాళంలో రాక్ అండ్ రోల్ సినిమా, హిందీ చిత్రాలు అకీరా, జూలీ 2, భోళా సినిమాల్లో నటించి మెప్పించింది.

రాయ్ లక్ష్మీ బ్యూటీ సీక్రెట్స్: రాయ్ లక్ష్మీ తన బ్యూటీ సీక్రెట్ గురించి చెబుతూ.. ఎక్కువగా ఫ్రూట్స్, ఆకు కూరలకు ప్రాధాన్యం ఇస్తున్నాను. అలాగే శాఖాహర భోజానానికి ఇంపార్టెంట్ ఇస్తాను. పొటీన్స్ ఫుడ్ ఎక్కువగా తీసుకొంటానని చెప్పారు. అంతేకాకుండా సకాలంలో నిద్రపోవడానికి ప్రయత్నిస్తాను. తగినంత నిద్రపోవడం వల్ల నా ఆరోగ్యాన్ని కాపాడుకొంటాను అని రాయ్ లక్ష్మీ చెప్పింది.

చర్మ సౌందర్యానికి రాయ్ లక్ష్మీ: రాయ్ లక్ష్మీ తన శరీర సౌందర్యంపై దృష్టిపెడుతుంది. చర్మ సౌందర్యానికి తక్కువగా క్రీమ్స్ వాడటం, అలాగే సహజసిద్దమైన ఇంట్లో దొరికే వస్తువులతో శరీరం నిగనిగలాడేలా చూసుకొంటుంది. ఎక్కువగా ఫ్రూట్స్ తినడం వల్ల చర్మకాంతి ఉంటుందని అభిమానులకు సలహాలు ఇస్తుంటుంది. అవసరమైతే చర్మ సంబంధిత నిపుణులు సంప్రదిస్తారు. తక్కువగా ఫేషియల్ చేసుకొంటారు. అలాగే శరీరం పటిష్టం ఉండటానికి క్రమం తప్పకుండా వ్యాయామం, వర్కవుట్స్ క్రమం తప్పకుండా చేసేందుకు ప్రయత్నిస్తుంటుందని రాయ్ లక్ష్మీ సన్నిహితులు చెప్పుకొంటారు.
రాయ్ లక్ష్మీ వస్త్రాలంకరణ: రాయ్ లక్ష్మీ ధరించే క్యాస్టూమ్స్ విభిన్నంగా ఉంటుంది. తన వార్డ్ రోబ్‌లో ఎక్కువగా జీన్స్ ఉండేలా.. వాటిపైకి టీషర్ట్స్ మ్యాచ్ అయ్యేలా ఫ్యాషన్ ట్రెండ్స్ పాటిస్తుంది. వీలైనంత ఎక్కువగా డార్క్ కలర్ డ్రస్సులను ధరించడానికి ప్రయత్నిస్తుంటుంది. ఇక చాలా తక్కువగా నగలు ధరించడానికి ప్రయత్నిస్తుంటుంది. సాధ్యమైనంత వరకు సహజత్వంగా ఉండేలా చూసుకొంటాను అని పలు ఇంటర్వ్యూలో రాయ్ లక్ష్మీ చెప్పింది.

రాయ్ లక్ష్మీ ఆరోగ్య సౌందర్యం: రాయ్ లక్ష్మీ తన శరీరానికి సరిపడే విధంగా ఆహారం తీసుకొంటుంది. అలాగే ఎక్కువ మోతాదులో నీళ్లు తాగడం వల్లే నా గ్లామర్ సీక్రెట్. శరీరానికి అవసరమైన నీరు తీసుకోవడం వల్ల చర్మం మెరుస్తుంది. కొవ్వు పదార్తాలు పేరుకుపోకుండా బాడీ సున్నితంగా మారుతుందని తన సౌందర్య రహస్యాన్ని చెప్పింది.

ఇన్స్‌టాగ్రామ్‌లో ఫోటోలు వైరల్: ఇలాంటి పద్దతులు, స్టైల్స్ మెయింటెన్ చేసే రాయ్ లక్ష్మీ ఇటీవల తన ఇన్స్‌టాగ్రామ్‌లో తన అభిమానులకు కిక్కించే విధంగా ఫోటోను పోస్టు చేసింది. రాయ్ లక్ష్మీ ఫ్యాషన్, ట్రెండింగ్ డ్రస్‌ను చూసిన ఫ్యాన్స్ కిర్రాక్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. రాయ్ లక్ష్మీ అందాల అరబోతకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.


Click it and Unblock the Notifications











