For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బికినీలో బాలకృష్ణ హీరోయిన్ హాట్ షో.. అన్ స్టాపబుల్ అంటూ పరువాల విందు!

  |

  అందం, అభినయం ఉన్నా కొందరు హీరోయిన్లు కనుమరుగై పోతుంటారు. తమ గ్లామర్ తో ఆకట్టుకునేందుకు ఎంత ప్రయత్నించినా అవి సఫలం కావు. అలాంటి వారిలో ది మోస్ట్ బ్యూటిఫుల్ రాయ్ లక్ష్మీ ఒకరు. రాయ్​ లక్ష్మీ అంటే తెలుగు ప్రేక్షకులు పెద్దగా గుర్తు పట్టకపోవచ్చు కానీ, రత్తాలు అంటే మాత్రం ప్రతి ఒక్కరు గుర్తు పడతారు. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమాలో రత్తాలు రత్తాలు సాంగ్​ ఎంత పెద్ద హిట్​ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోయిన్ గా ఆకట్టుకులేకపోయిన ఈ ముద్దుగుమ్మ ఈ ఒక్క స్పెషల్ సాంగ్ తో మాత్రం యమ పాపులర్ అయిపోయింది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు, వీడియోలతో హీట్ పుట్టిస్తున్న ఈ సుందరి తాజాగా మరికొన్ని ఫొటోలు వదిలింది.

  సినిమాలతో హిట్ కానీ..

  సినిమాలతో హిట్ కానీ..

  ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. చిన్న పెద్దా తేడా లేకుండా సామాజిక మాధ్యమాన్ని బాగా ఉపయోగిస్తున్నారు. దీంతో అప్ కమింగ్ నటీనటులకే కాదు ఎప్పుడో సినిమాల్లోకి ఎంటర్ అయి అంతగా గుర్తింపు రాలేని వారికి సైతం ఈ సోషల్ మీడియా ఎంతగానో ఉపయోగపడుతోంది. అందులోను ముఖ్యంగా హీరోయిన్లకు ఈ ఫ్లాట్ ఫామ్ మంచి వేదికగా పనికి వస్తోంది. అందుకే ఇటీవల హీరోయిన్లు సినిమాల సంగతి ఎలా ఉన్నా తమ హాట్ ఫొటోలతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటున్నారు.

  హాట్ ఫొటోలతో ట్రీట్..

  హాట్ ఫొటోలతో ట్రీట్..

  సినిమాలకు దూరమై సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మల్లో రాయ్ లక్ష్మీ ఒకరు. చాలా కాలంగా తెలుగు సినిమాలకు దూరమైన ఈ సుందరి సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులు, యువతకు దగ్గరవుతోంది. ఇందులో భాగంగానే నిత్యం హాట్ ఫొటోలతో నెటిజన్లకు ఐ ఫీస్ట్ ఇస్తూ ఆకట్టుకుంటోంది. దీంతో సినిమాలు లేకున్నా సోషల్ మీడియా ద్వారా హైలెట్ అవుతోంది ఈ రత్తాలు.

  గుర్తింపు తీసుకురాని తొలి చిత్రం..

  గుర్తింపు తీసుకురాని తొలి చిత్రం..

  టీనేజ్‌లోనే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మీ. మోడలింగ్ రంగంలో తనదైన అందచందంతో ఆకట్టుకున్న రాయ్​ లక్ష్మీ పలు అడ్వర్టైజ్ మెంట్స్ తో ఆకర్షించింది. కొద్దికాలం మోడలింగ్ లో రాణించిన తర్వాత సీనియర్ హీరో శ్రీకాంత్ నటించిన 'కాంచనమాల కేబుల్ టీవీ' అనే సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమైంది. అయితే ఈ చిత్రం ఆమెకు అంతగా గుర్తింపును తీసుకురాలేకపోయింది.

  తెలుగు తప్పా మిగతా భాషల్లో..

  తెలుగు తప్పా మిగతా భాషల్లో..


  'కాంచనమాల కేబుల్ టీవీ' మూవీ తర్వాత 'నీకు నాకు' అనే మరో సినిమాలో నటించి అలరించింది గ్లామరస్ ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మీ. అయితే ఈ సినిమా కూడా అంతగా సక్సెస్ కు నోచుకోలేదు. ఇలా తెలుగు సినీ ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో నటించినా సరైనా విజయం మాత్రం దక్కించుకోలేకపోయింది కన్నడ బ్యూటి రాయ్ లక్ష్మీ. తెలుగు సినిమాలతో మంచి విజయాన్ని చూడలేకపోయిన రాయ్ లక్ష్మీ.. దక్షిణాదిలోని మిగతా భాషల్లో మాత్రం పలు హిట్లను సొంతం చేసుకుంది.

  అలా బాలీవుడ్ ఎంట్రీ..

  అలా బాలీవుడ్ ఎంట్రీ..

  ప్రముఖ కొరియోగ్రాఫర్ అండ్ డైరెక్టర్, హీరో రాఘవ లారెన్స్ సూపర్ హిట్ హర్రర్ మూవీ కాంచనలో తన గ్లామర్ తో అట్రాక్ట్ చేసింది రాయ్ లక్ష్మీ. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో తమిళంలో మంచి అవకాశాలను దక్కించుకుంది రాయ్ లక్ష్మీ. ఇలా తమిళం, కన్నడ భాషల్లో చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. ఈ క్రమంలోనే 'అకీరా' అనే సినిమాతో బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చింది.

  బాలయ్య బాబు చిత్రంతో రీ ఎంట్రీ..

  బాలయ్య బాబు చిత్రంతో రీ ఎంట్రీ..

  హిందీలో అకీరా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మీ 'జూలీ 2' అనే సినిమాలో తన అందాలను ఘాటుగా ఆరబోసింది. దీంతో కొంతవరకు బాలీవుడ్ లో పాపులర్ అయిందనే చెప్పవచ్చు. అనంతరం మళ్లీ నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన అధినాయకుడు సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా కూడా అంతగా విజయం సాధించలేదు. ఇక హీరోయిన్ గా లాభం లేదనుకుని పలు స్పెషల్ సాంగ్స్ లలో నర్తించింది.

  అన్ స్టాపబుల్ అంటూ..

  ఇదిలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో రెచ్చిపోతోంది రాయ్ లక్ష్మీ. నిత్యం గ్లామర్ డోస్ పెంచుతూ ఘాటు ఫొటోలు వదులుతోంది. తాజాగా రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న రాయి లక్ష్మీ తన ఎద అందాలను హద్దు లేకుండా ఆరబోసింది. ఈ పిక్ లో ఘాటుగా క్లీవేజ్ షో చేస్తూ రచ్చ చేసింది. అలాగే మరికొన్ని ఫొటోల్లో వయ్యారంగా పోజులిచ్చింది. మరొక పిక్ లో స్టీమర్ పై బికినీతో రైడ్ చేస్తూ 2023లో అన్ స్టాపబుల్ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

  English summary
  Balakrishna Adhinayakudu Heroine Raai Laxmi Hot Photo In Bikini On Steamer Going Viral In Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X