Don't Miss!
- Sports
INDvsAUS : స్పిన్నర్ల ఎంపికపై ఆసీస్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
- News
మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Finance
High Tax: ఆ ఇన్వెస్టర్లకు ఝలక్.. టాక్స్ రేటు 5 నుంచి 20 శాతానికి పెంపు.. ఎప్పటి నుంచంటే..
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
రెచ్చిపోయిన రత్తాలు.. బికినీలో ముద్దులు పెడుతూ సెల్ఫీ.. పాపం కుర్రకారు తట్టుకోగలరా?
తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం అయిన లక్ష్మీ రాయ్ హీరోయిన్ గా అయితే సరిగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. కెరీర్ ఆరంభంలో సంప్రదాయమైన పాత్రలతో డీసెంట్‌గా కనిపించిన ఈ అమ్మడు పెద్దగా అవకాశాలు రాకపోవడంతో పేరు మార్చుకోవడమే కాక గ్లామర్ డోస్ కూడా పెంచేసింది. అయితే తాజాగా ఈ భామ తన బికినీ ఫోటోషూట్ షేర్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

అలా ఎంట్రీ
కార్క కసాద్రా అబే తమిళ సినిమాతో సినీ రంగప్రవేశం చేసిన రాయ్ లక్ష్మీ శ్రీకాంత్ నటించిన 'కాంచనమాల కేబుల్ టీవీ' అనే మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రాయ్ లక్ష్మి మొదటి సినిమాలో చాలా పద్దతైన పాత్రలో నటించింది. కానీ తెలుగులో మంచి అవకాశాలు రాకపోవడంతో ఆమె బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

రాయ్ లక్ష్మిగా మారి
అయితే అక్కడ కూడా పెద్దగా అవకాశాలు రాకపోవడంతో అప్పటి నుంచి స్కిన్ షో చేస్తూ అక్కడ హాట్ బాంబ్ లా మారిపోయింది. నిజానికి లక్ష్మీ రాయ్ గా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె అవకాశాలు రాకపోవడంతో పేరు మార్చుకుని రాయ్ లక్ష్మిగా మారింది. అయినా ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. తర్వాత మరో సినిమా చేసి బాలీవుడ్ మీద మనసు పడింది.

కాలం కలిసి రాలేదు
అయితే బాలీవుడ్ లో కూడా లక్ష్మికి కాలం కలిసి రాలేదు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా అయిన ఖైదీ నెం 150 సినిమాలో రత్తాలు రత్తాలు అంటూ ఒక మాస్ ఐటెం సాంగ్ చేసింది. ఈ క్రమంలో కుర్ర కారు అందరినీ ఆకట్టుకుని పూర్తి స్థాయిలో ఐటెం భామ గా మారిపోయింది. సెక్సీ లుక్స్‌తో వెండితెరకు అందం తీసుకు రావడంలో రాయ్ లక్ష్మిది అందె వేసిన చేయి.

పెళ్లి డేట్ కూడా కూడా ఫిక్స్
అయితే ఎందుకోగానీ అందుకు ఐటెమ్ సాంగ్‌లు, లేదా చిన్న చిన్న గ్లామర్ పాత్రలు తప్ప హీరోయిన్ గా లేదా మంచి పాత్రలు అయితే రావడం లేదు పెద్దగా ఛాన్స్ లు రావడం లేదు. ఈ మధ్యనే మ్యారేజ్ చేసుకుని కొత్త లైఫ్ మొదలు పెట్టాలని నిర్ణయించుకుని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా ఆమె ప్రకటించింది. ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్న ఈ భామ పెళ్లి డేట్ కూడా కూడా ఫిక్స్ చేసుకున్నానని త్వరలో పెళ్లి కొడుకు ఎవరనేది కూడా చెబుతానని వెల్లడించింది.
Recommended Video

బికినీలో రచ్చ రచ్చ
ఇక ఈ భామ తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫోటోలు సంచలనంగా మారాయి. సమయం చిక్కితే ఇన్స్‌టాగ్రామ్‌లో సందడి చేసే రాయ్ లక్ష్మీ తాజాగా బికినీలో ఉన్న ఫోటోలు షేర్ చేసింది. దాదాపు 30 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న ఆమె అకౌంట్‌లో ఆ ఫోటోలురచ్చ రేపాయి. ఆమె బికినీలో శృంగారం ఒలకబోస్తూ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.