Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
హాట్ హాట్‌గా రాయ్ లక్ష్మీ.. బోల్డ్ బ్యూటీగా అదరగొట్టిన రత్తాలు
దక్షిణాదిలో పలు విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకొంటున్న అందాల తార రాయ్ లక్ష్మీ గ్లామర్ ఫోటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమెకు సంబంధించిన ఫోటోలు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇక రాయ్ లక్ష్మీ లేటేస్ట్ ఫోటోషూట్, ఆమె లేటేస్ట్ సినిమాకు సంబంధించిన వివరాలు మీకోసం..
14 ఏళ్ల కెరీర్లో 50కి పైగా సినిమాలు
దక్షిణాదిలో అందాల భామ రాయ్ లక్ష్మీ కెరీర్ సుదీర్ఘంగానే సాగింది. దాదాపు 14 ఏళ్ల కెరీర్లో పలు భాషల్లో దాదాపు 50 చిత్రాలకు పైగానే నటించింది. అయితే తన ప్రతిభకు తగినట్టుగా ఆమె కెరీర్ గ్రాఫ్ అంతగా పెరిగిన దాఖలాలు లేకపోవడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఖైదీ నంబర్ 150 మూవీతో
తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన రాయ్ లక్ష్మీ ఇటీవల చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన ఖైదీ నంబర్ 150 చిత్రంలో రత్తాలుగా స్పెషల్ సాంగ్‌తో టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ ఆమెను సక్సెస్ వరించలేదు. దాంతో తెలుగులో మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నారు.
హిందీలో ఎంట్రీ నిరాశగానే
ఇక హిందీలో కూడా రాయ్ లక్ష్మీ నిరాశే ఎదురైంది. 2017లో జూలీ 2 చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. సినీ నటి నగ్మా జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమంటూ ప్రచారం జరిగినా ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దాంతో ఆమె బాలీవుడ్ ఆశలు ఆవిరైపోయాయి.
తమిళంలో సిండ్రెల్లాగా
అయితే తనకు ఎదురైనా అపజయాలు, నిరాశను పక్కన పెట్టి ప్రతీసారి కొత్తదనం కోసం ప్రయత్నిస్తుంటున్నారు. తమిళంలో ఆమె నటిస్తున్న సిండ్రెల్లా చిత్రం ఇప్పుడు క్రేజీ ప్రాజెక్టుగా మారింది. ఇటీవల దర్శకుడు ఎస్జే సూర్య రిలీజ్ చేసిన స్నీక్ పీక్ వైరల్‌గా మారింది. ఇప్పుడు ఆశలన్నీ ఈచిత్రంపైనే పెట్టుకొంది ఈ అందాల భామ.
వైరల్‌గా లేటేస్ట్ ఫోటోషూట్
ఇదిలా ఉండగా, రాయ్ లక్ష్మీ చేసిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. హాట్ హాట్‌గా కనిపిస్తూ పెట్టిన ఫోటోలు ట్రెండింగ్‌గా మారాయి. తాజా ఫోటోషూట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. పలు యాంగిల్స్‌లో రాయ్ లక్ష్మీ ఫోటోలు అభిమానులు ఆకట్టుకొంటున్నాయి.