twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Raai Laxmi హాట్ సెల్ఫీ.. కేవలం ఎద అందాలు ఫోకస్ అయ్యేలా పోజు!

    |

    తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది అమ్మాయిలు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. వారిలో పక్క రాష్ట్రాల వారు, పర భాష హీరోయిన్స్ సైతం ఉన్నారు. కానీ అందులో కొంతమందికి మాత్రమే విశేషమైన గుర్తింపు లభించింది. మరికొందరు మాత్రం హీరోయిన్ గా కాకుండా ఐటమ్ సాంగ్స్ ద్వారా క్రేజ్ తెచ్చుకున్నారు. అలాంటి వారిలో గ్లామరస్ బ్యూటి రాయి లక్ష్మీ ఒకరు. హీరోయిన్ గా పలు సినిమాలు చేసిన ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. కానీ, లక్కీ లక్కీ రాయ్ అంటూ.. రత్తాలు రత్తాలు అంటూ మాత్రం విపరీతమైన క్రేజ్ సంపాందించుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో యువతను ఆకట్టుకుంటోంది.

    హాట్ ట్రీట్ తో అలా..

    హాట్ ట్రీట్ తో అలా..

    ఇటీవల కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. చిన్న పెద్దా అంటూ తేడా లేకుండా సాధారణ వ్యక్తుల నుంచి స్టార్ సెలబ్రిటీస్ వరకు దీన్ని ఉపయోగించని వారు లేరు. ఇక అప్ కమింగ్ నటీనటులకే కాదు ఎప్పుడో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అంతగా గుర్తింపు తెచ్చుకోలేని వారికి కూడా సోషల్ మీడియా అనేది ఒక మంచి ఫ్లాట్ ఫామ్ గా మారింది. అందులోను ముఖ్యంగా హీరోయిన్లకు సోషల్ మీడియా మంచి వేదికగా ఉపయోగపడుతోంది. అందుకే ఇటీవల హీరోయిన్లు సినిమాల కంటె ఎక్కువగా ఇందులో హాట్ ట్రీట్ తో పిచ్చెక్కిస్తున్నారు.

     సోషల్ మీడియా ద్వారా..

    సోషల్ మీడియా ద్వారా..

    సినిమాలకు దూరమై సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంటున్న ముద్దుగుమ్మల్లో రాయ్ లక్ష్మీ ఒకరు. చాలా కాలంగా తెలుగు సినిమాలకు దూరమైన ఈ గ్లామరస్ బ్యూటి సోషల్ మీడియాలో మాత్రం తనకు సంబంధించిన విషయాలు షేర్ చేస్తూ అభిమానులు, యూత్ కు దగ్గరవుతోంది. ఇందులో భాగంగానే నిత్యం హాట్ ఫొటోలతో నెటిజన్లకు ఐ ట్రీట్ ఇస్తూ ఆకట్టుకుంటోంది. దీంతో సినిమాలు లేకున్నా సామాజిక మాధ్యమం ద్వారా మాత్రం సూపర్ హైలెట్ అవుతోంది ఈ కన్నడ భామ.

     మోడలింగ్ తర్వాత..

    మోడలింగ్ తర్వాత..

    చిన్న వయసులో ఉన్నప్పుడే గ్లామర్ ఫీల్డ్ అయిన మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ రాయ్ లక్ష్మీ. మోడలింగ్ లో తనదైన గ్లామర్​తో ఆకట్టుకున్న రాయ్​ లక్ష్మీ పలు అడ్వర్టైజ్ మెంట్స్ తో దర్శక నిర్మాతలను ఆకర్షించింది. కొద్దికాలం మోడలింగ్ లో రాణించిన తర్వాత సినిమా ఆఫర్లు ఆమె దరికి చేరాయి. ఈ క్రమంలోనే సీనియర్ హీరో శ్రీకాంత్ నటించిన 'కాంచనమాల కేబుల్ టీవీ' అనే సినిమాలో నటించింది.

    అంతగా రాని విజయాలు..

    అంతగా రాని విజయాలు..

    'కాంచనమాల కేబుల్ టీవీ' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ రాయ్ లక్ష్మీకి పెద్దగా సక్సెస్ రాలేదు. ఈ మూవీ తర్వాత 'నీకు నాకు' అనే మరో చిత్రంలో నటించింది మోస్ట్ గ్లామరస్ బ్యూటి రాయ్ లక్ష్మీ. అయితే ఈ సినిమా కూడా అంతగా విజయాన్ని దక్కించుకోలేదు. ఇలా తెలుగు సినీ ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో నటించినా సరైనా విజయం మాత్రం దక్కించుకోలేకపోయింది కన్నడ భామ రాయ్ లక్ష్మీ. తెలుగు సినిమాలతో సక్సెస్‌ను చూడలేకపోయిన రాయ్ లక్ష్మీ.. దక్షిణాదిలోని మిగతా భాషల్లో మాత్రం పలు హిట్లను తన ఖాతాలో వేసుకుంది.

    హిందీలోనూ డెబ్యూగా..

    హిందీలోనూ డెబ్యూగా..

    తమిళం, కన్నడ భాషల్లో చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన బ్యూటిఫుల్ రాయ్ లక్ష్మీ 'అకీరా' అనే సినిమాతో బాలీవుడ్‌లో కూడా తెరంగేట్రం చేసింది. ఆ సినిమా తర్వాత 'జూలీ 2' అనే చిత్రంలో తన అందాలను ఆరబోసింది. దీంతో కొంతవరకు బాలీవుడ్ లో పాపులర్ అయిందనే చెప్పవచ్చు. అనంతరం మళ్లీ నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన అధినాయకుడు సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ అది కూడా ఆమెకు సక్సెస్ ను ఇవ్వలేకపోయింది. దీంతో హీరోయిన్ గా కాకుండా పలు స్పెషల్ సాంగ్స్ లలో నర్తించింది.

    రత్తాలు.. రత్తాలు అంటూ

    రత్తాలు.. రత్తాలు అంటూ

    స్పెషల్ సాంగ్స్ లో ముందుగా రవితేజ బలుపు చిత్రంలో లక్కీ లక్కీ రాయ్ అనే పాటతో యూత్ ను ఆకట్టుకుంది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో కూడా ఒక ఐటమ్ సాంగ్ చేసింది బ్యూటిఫుల్ లక్ష్మీ రాయ్. అనంతరం చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 చిత్రంలో రత్తాలు రత్తాలు అంటూ అదరగొట్టింది. ఈ సినిమాలో చిరంజీవితో ఆడిపాడిన లక్ష్మీ రాయ్ ప్రేక్షకుల దృష్టిలో బాగా పడిందనే చెప్పవచ్చు.

    బ్రాలో ఎదపై ఫోకస్ పెట్టి..

    ఇటీవల సిండ్రెల్లా (2021), జనతాబార్ (2022) చిత్రాల్లోనూ మెరిసిన కన్నడ సుందరి రాయ్ లక్ష్మీ సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో అదరగొడుతోంది. తాజాగా సెల్ఫీ దిగిన ఈ గ్లామరస్ బ్యూటి తన ఎద అందాలు మాత్రమే కనిపించేలా పోజు ఇచ్చింది. అలా బ్రా చూపిస్తూ కేవలం ఎదపై ఫొకస్ పెడుతూ సెల్ఫీ దిగి ఓవర్ డోస్ హాట్ షో చేసింది. సన్ గ్లాసెస్ పెట్టుకున్న రాయ్ లక్ష్మీ సెల్ఫీ పిక్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. దీంతో యూత్ లో మరింతగా క్రేజ్ సంపాదించుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.

    English summary
    Balupu Movie Actress Raai Laxmi Hot Selfie And Exposing Her Cleavage Goes Viral In Social Media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X