బికినీలో ఐటమ్ బాంబ్ రాయ్ లక్ష్మీ హాట్ షో.. ఆ పోజుల్లో డిఫరెంట్ గా ఎద అందాలు చూపిస్తూ!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది అమ్మాయిలు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. వారిలో పక్క రాష్ట్రాల వారు, పర భాష ముద్దుగుమ్మలు సైతం ఉన్నారు. కానీ అందులో కొంతమందికి మాత్రమే విశేషమైన పాపులారిటీ లభించింది. మరికొందరు మాత్రం హీరోయిన్ గా కాకుండా ఐటమ్ సాంగ్స్ ద్వారా క్రేజ్ తెచ్చుకున్నారు. అలాంటి వారిలో గ్లామరస్ బ్యూటి రాయి లక్ష్మీ ఒకరు.
హీరోయిన్ గా పలు సినిమాలు చేసిన ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయిన ఈ కన్నడ భామ లక్కీ లక్కీ రాయ్ అంటూ.. రత్తాలు రత్తాలు అంటూ మాత్రం విపరీతమైన క్రేజ్ సంపాందించుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో హీట్ పుట్టిస్తూ అట్రాక్ట్ చేస్తోంది.

హాట్ ట్రీట్ తో..
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. చిన్న పెద్దా అంటూ తేడా లేకుండా సాధారణ వ్యక్తుల నుంచి ఫేమస్ సెలబ్రిటీస్ వరకు దీన్ని ఉపయోగించని వారు లేరు. ఇక అప్ కమింగ్ నటీనటులకే కాకుండా అప్పుడెప్పుడో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి అంతగా ఫేమ్ సాధించలేనివారికి సైతం ఈ సామాజిక మాధ్యమం అనేది ఒక మంచి ఫ్లాట్ ఫామ్ గా మారింది.
అందులోను ముఖ్యంగా హీరోయిన్లకు అయితే సోషల్ మీడియా మంచి వేదికగా ఉపయోగపడుతోంది. అందుకే ఈ మధ్య హీరోయిన్లు సినిమాల కంటే ఎక్కువగా ఇందులో హాట్ ట్రీట్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

సోషల్ మీడియా ద్వారా..
సినిమాలకు దూరమై సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంటున్న బ్యూటిఫుల్ హీరోయిన్లలో రాయ్ లక్ష్మీ ఒకరు. చాలా కాలంగా తెలుగు సినిమాలకు దూరమైన ఈ స్టన్నింగ్ బ్యూటి సోషల్ మీడియాలో మాత్రం తనకు సంబంధించిన విషయాలు షేర్ చేస్తూ అభిమానులు, నెటిజన్లు, యువతకు దగ్గరవుతోంది.
ఇందులో భాగంగానే నిత్యం హాట్ ఫొటోలతో నెటిజన్లకు సూపర్ ఐ ట్రీట్ ఇస్తూ అలరిస్తోంది. దీంతో సినిమాలు లేకున్నా సోషల్ మీడియా ద్వారా మాత్రం సూపర్ హైలెట్ అవుతోంది ఈ కన్నడ సుందరి.

మోడలింగ్ తర్వాత..
యంగ్ ఏజ్ లోనే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది కన్నడ హాట్ బ్యూటి రాయ్ లక్ష్మీ. ఈ మోడలింగ్ రంగంలో తనదైన గ్లామర్ తో, హాట్ నెస్ తో ఆకట్టుకోవడంతో.. ఆమెను పలు అడ్వర్టైజ్ మెంట్స్, వ్యాపార ప్రకటనలు వరించాయి. ఈ క్రమంలోనే దర్శక నిర్మాతలను అట్రాక్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మకు మోడలింగ్ తర్వాత సినిమాల్లో అవకాశాలు రావడం మొదలైంది. ఇందులో భాగంగానే తెలుగులో సీనియర్ హీరో శ్రీకాంత్ నటించిన కాంచనమాల కేబుల్ టీవీ సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది.

తెలుగులో రాని విజయం..
'కాంచనమాల కేబుల్ టీవీ' చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి రంగప్రవేశం చేసిన కన్నడ ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మీకి ఆ సినిమా పెద్దగా సక్సెస్ ఇవ్వలేదు. ఈ సినిమా తర్వాత 'నీకు నాకు' అనే మరో చిత్రంలో నటించింది మోస్ట్ గ్లామరస్ బ్యూటి రాయ్ లక్ష్మీ. అయితే ఆ మూవీ కూడా ఆశించినంతగా విజయాన్ని అందుకోలేకపోయింది. ఇలా తెలుగు సినీ ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో నటించినా సరైనా సక్సెస్ మాత్రం చేజిక్కించుకోలేక పోయింది కన్నడ భామ రాయ్ లక్ష్మీ.

ఆ సినిమాలో హాట్ గా..
ఇలా తెలుగు సినిమాలతో విజయాన్ని చూడలేకపోయిన రాయ్ లక్ష్మీ.. దక్షిణాదిలోని మిగతా భాషల్లో మాత్రం పలు హిట్లను తన ఖాతాలో వేసుకుంది. తమిళం, కన్నడ భాషల్లో చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటింది బ్యూటిఫుల్ రాయ్ లక్ష్మీ. అలాగే 'అకీరా' అనే సినిమాతో బాలీవుడ్‌లో కూడా తెరంగేట్రం చేసింది. ఆ సినిమా తర్వాత 'జూలీ 2' అనే చిత్రంలో తన అందాలను ఆరబోసింది. దీంతో కొంతవరకు బాలీవుడ్ లో పాపులర్ అయిందనే చెప్పవచ్చు.
మూడు ఐటమ్ సాంగ్స్ ల్లో..
చాలా కాలం తర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన అధినాయకుడు సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది రాయ్ లక్ష్మీ. కానీ ఆ చిత్రం కూడా ఆమెకు విజయాన్ని ఇవ్వలేకపోయింది. దీంతో హీరోయిన్ గా కాకుండా పలు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసింది. రవితేజ బలుపు చిత్రంలో లక్కీ లక్కీ రాయ్ అనే పాటతో యూత్ ను ఆకట్టుకున్న రాయ్ లక్ష్మీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో, చిరంజీవి ఖైదీ నెంబర్ 150 చిత్రంలో రత్తాలు రత్తాలు అంటూ అదరగొట్టింది.
హాట్ సొగసును అలా చూపిస్తూ..
సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలతో ఆకట్టుకుంటోంది కన్నడ సుందరి రాయ్ లక్ష్మీ. తాజాగా మరికొన్ని హాట్ పిక్స్ వదిలింది. బ్లాక్ కలర్ బికినీ వేసుకున్న లక్ష్మీ రాయ్ అటువైపు సముద్రాన్ని చూస్తూ ఇటువైపు తన స్టన్నింగ్ బ్యాక్ అందాలను చూపించింది. ఇదే కాకుండా రెడ్ కలర్ డ్రెస్సులో తన ఎద, థైస్ అందాలను డిఫరెంట్ పోజుతో ప్రదర్శించింది. ఈ రెండు ఫొటోల్లో తన సూపర్ హాట్ సొగసును మరింత హాట్ గా ఆరబోసింది. ఫలితంగా ఆమె అందాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications











