నా బికినీ బాడీ చూస్తుంటే నాకే.. ఫైనల్‌గా! రాయ్ లక్ష్మి
రాయ్ లక్ష్మి అలియాస్ లక్ష్మీ రాయ్.. ఈ పేరు తెలియని వారుండరు లెండి. స్టార్ హీరోయిన్ కాకపోయినా మాంచి ఘాటు హీరోయిన్. సెక్సీ లుక్స్‌తో వెండితెరకు అందం తీసుకురావడంలో రాయ్ లక్ష్మిది అందె వేసిన చేయి. నాజూకు అందాలతో కవ్విస్తున్న ఈ రోజు రాయ్ లక్ష్మి అందాలు వేరు.. ఒకప్పటి లక్ష్మి రాయ్ అందాలు వేరు. అప్పట్లో బొద్దుగా ఉంటూనే హాట్ హాట్‌గా కనిపించే ఈ భామ క్రమంగా నాజూకుగా తయారై ప్రేక్షకులను ఆశ్చర్య పరిచింది. తన సొగసుల తాలూకు ఫొటోలను నెట్టింట పోస్ట్ చేస్తూ సెగలు పుట్టిస్తోంది.
సోషల్ మీడియాను తమ అందాలతో వేడెక్కించడంలో నేనంటే నేనే ముందు అంటూ నేటితరం హీరోయిన్స్ ముందుకొస్తున్నారు. బికినీ వేసి అందమైన ఫోజులిస్తూ కుర్రాకారు మతి పోగొడుతున్నారు. అయితే వాటన్నింటిలో రాయ్ లక్ష్మి బికినీ ట్రీట్ మరింత ప్రత్యేకమని చెప్పుకోవాలి. అవకాశాలతో సంబంధం లేకుండా కేవలం హీటు పుట్టించడమే లక్ష్యంగా అందాలతో కవ్విస్తుంటుంది హాట్ బ్యూటీ లక్ష్మీరాయ్.

కాగా తాజాగా తన బికినీ లుక్ ఒకటి పోస్ట్ చేసిన రాయ్ లక్ష్మి.. గతంలో తన అందాలు, ఇప్పుటి తన అందాలను పోల్చుతూ ట్యాగ్ లైన్ యాడ్ చేసింది. ''చాలా కష్టపడి ఈ బికినీ బాడీని సొంతం చేసుకున్నా. గతంలో నేను ఎలా ఉన్నానో నాకే గుర్తులేదు. బరువు తగ్గడానికి ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కొన్నా. చివరకు కొత్త లుక్ వచ్చేసింది. కేవలం శరీరాకృతే కాదు.. అన్నిన్నిటిలో మార్పు వచ్చింది'' అని రాయ్ లక్ష్మి పేర్కొంది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక రాయ్ లక్ష్మి సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే 'వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి' అనే హారర్ కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ భామ అంతగా సక్సెస్ కాలేక పోయింది. ప్రస్తుతం యోధా 2, రాణి రాణమ్మ అనే రెండు తెలుగు సినిమాల్లో, శృంగార అనే కన్నడ సినిమాలో నటిస్తోంది రాయ్ లక్ష్మి.


Click it and Unblock the Notifications











