Raai Laxmi: గుర్రంతో హాట్‌గా లక్ష్మీ రాయ్ పోజులు.. మతి పోగొడుతున్న రత్తాలు ఫొటోలు
రాయ్ లక్ష్మీ అంటే తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు కానీ, రత్తాలు అంటే మాత్రం ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ 150 మూవీలో రత్తాలు రత్తాలు సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అప్పుడెప్పుడో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ నటనతో బాగానే ఆకట్టుకుంది. అయితే తర్వాత పలు సినిమాల్లో నటించిన అంతగా పేరు రాలేదు. దీంతో తెలుగులో దూరమైన ఈ భామ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటుంది. తన గ్లామర్‌తో హాట్ ఫొటో షూట్లు చేస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లను కనువిందు చేస్తుంది. తాజాగా రెడ్ డ్రెస్‌లో అందాలను హాట్‌గా ప్రదర్శిస్తూ యూత్‌ను అట్రాక్ట్ చేస్తోంది.

అభిమానులకు చేరువగా..
ఇటీవల కాలంలో సినిమాలతో ఫుల్ బిజీగా ఉండటే కాకుండా సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గా ఉంటున్నారు సెలబ్రిటీలు. ముఖ్యంగా మరింత ఎక్కువగా ఉంటూ అభిమానులకు చేరువ అవుతున్నారు. ఈ క్రమంలోనే తన గ్లామర్ ఫొటోలతో ఫ్యాన్స్‌కు ఐ ట్రీట్ ఇస్తుంది రాయ్ లక్ష్మీ.

శ్రీకాంత్ సరసన..
టీనేజ్‌లోనే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ రాయ్ లక్ష్మీ. అందులో తనదైన గ్లామర్‌తో ఆకట్టుకున్న రాయ్ లక్ష్మీ.. ఆ తర్వాత శ్రీకాంత్ హీరోగా చేసిన 'కాంచనమాల కేబుల్ టీవీ' అనే మూవీతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమైంది. కానీ, ఈ చిత్రం ఆమెకు అంతగా గుర్తింపును తీసుకు రాలేదు.

అంతగా రాని సక్సెస్..
ఆ తర్వాత 'నీకు నాకు' అనే చిన్న సినిమా మాత్రమే చేసింది. అది కూడా అంత సక్సెస్‌ను ఇవ్వలేకపోయింది. ఇలా, తెలుగు సినీ ఇండస్ట్రీలో పలు చిత్రాలు చేసినా సక్సెస్‌ను చూడలేకపోయిన రాయ్ లక్ష్మీ.. దక్షిణాదిలోని మిగతా భాషల్లో మాత్రం పలు హిట్లను తన ఖాతాలో వేసుకుంది.

బాలకృష్ణతో రీ ఎంట్రీ..
అలాగే తమిళం, కన్నడ భాషల్లో చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. ఈ క్రమంలోనే 'అకీరా' అనే సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. 'జూలీ 2' అనే సినిమా చేసి అందాలను ఆరబోసింది. మళ్లీ నందమూరి బాలకృష్ణ నటించిన అధినాయకుడు మూవీతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది.

ఐటమ్ సాంగ్స్‌తో హిట్..
ఆ తర్వాత రవితేజ నటించిన 'బలుపు' అనే సినిమాలో స్పెషల్ సాంగ్‌తో అలరించింది. ఈ సాంగ్ సూపర్ డూపర్ హిట్ కావడంతో.. అనంతరం పవన్ కల్యాణ్ 'సర్ధార్ గబ్బర్ సింగ్', మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150'లోనూ ఐటెం సాంగ్స్‌తో ఊపేసింది. ఈ పాటతోనే రత్తాలుగా టాలీవుడ్లో క్రేజ్ సంపాందించుకుంది.

గుర్రాలతో హాట్‌గా..
ఇక సోషల్ మీడియాలతో తన అందాలను ఆరబోసే రాయ్ లక్ష్మీ రాయ్ తాజాగా కనువిందు చేసేలా ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో రెడ్ డ్రెస్‌లో గుర్రంతో పోజులిచ్చింది. మత్తెక్కించేలా చూస్తూ గుర్లాలతో ఫొటోలు దిగిన రాయ్ లక్ష్మీ కుర్రాళ్ల మతి పోగొట్టేలా ఉంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











