గోవాకు గుడ్ బై.. హైద్రాబాద్‌లో వాలిన రాశీ ఖన్నా
రాశీ ఖన్నా ఈ మధ్య గోవాలో బికినీ అందాల ఆరబోత చేసిన సంగతి తెలిసిందే. బికినీలో మొదటిసారిగా రాశీ ఖన్నా దర్శనమివ్వడంతో అందరూ షాక్ అయ్యారు. మామూలుగా అయితే రాశీ ఖాన్న బొద్దుగా ఉండేది. కానీ ఇప్పుడు పూర్తిగా జీరో సైజ్‌లోకి మారింది. అలా తాను బికినీ షేప్‌లోకి వచ్చానని పరోక్షంగా చెబుతూనే అందాల విందు చేసింది. అంతే కాకుండా తాను ఇలా జీరో సైజ్‌లోకి మారేందుకు ఎంత కష్టపడిందో చెప్పేసింది.
రాశీ ఖన్నా బాలీవుడ్‌లో ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రాబోతోన్న ఈ సిరీస్ షూటింగ్ గోవాలో జరిగింది. అందుకోసమే రాశీ ఖన్నా గోవాలో కొన్ని రోజులు ఉంది. అలా ఆ సమయంలో అక్కడి రిసార్టులు, బీచ్‌లో బికినీలో హోయలను చూపించింది. అయితే ఇప్పుడు రాశీ ఖన్నా గోవాకు గుడ్ బై చెప్పేసింది. షూటింగ్‌కు కాస్త గ్యాప్ ఇవ్వడంతో సొంతింటికి చేరినట్టు చెప్పుకొచ్చింది.

హైద్రాబాద్‌కు వచ్చాను.. ఇంటికి రావడం ఎంతో సంతోషంగా ఉందంటూ రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది. రాశీ ఖన్నా హైద్రాబాద్‌లోనే ఓ ఇంటిని కొనుగోలు చేసిందన్న సంగతి తెలిసిందే. ఇక్కడే ఆఫర్లు ఎక్కువగా వస్తుండటంతో హైద్రాబాద్‌లోనే రాశీ ఖన్నా సెటిలైంది. ప్రస్తుతం రాశీ ఖన్నాకు కోలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉంది. రాశీ ఖన్నా అక్కడి ప్రేక్షకులను వరుసగా రెండు సినిమాలతో పలకరించేందుకు రెడీగా ఉంది.


Click it and Unblock the Notifications











