బాయ్‌ఫ్రెండ్‌తో నా ఫస్ట్ డేటింగ్ అనుభవం అలా.. బ్రేకప్ ఎలా అంటే.. రాశీఖన్నా
అందం, అభినయం, టాలెంట్ కలిసి ఉన్న యువతార రాశీఖన్నా విభిన్న పాత్రలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నారు. తాజాగా, ప్రతీరోజు పండగే, వెంకీ మామ చిత్రాల విజయాలను తన ఖాతాలో వేసుకొన్న ఈ అందాల భామ మంచి జోష్‌తో కెరీర్‌గ్రాఫ్‌ను పరుగులు పెడుతున్నారు. తాజాగా తన బాయ్‌ఫ్రెండ్‌తో ఫస్ట్ డేటింగ్ అనుభవాన్ని ఇలా చెప్పుకొచ్చారు. వివరాల్లోకి వెళితే...

16 ఏళ్ల వయసులో
నాకు అప్పుడు 16 ఏళ్లు. ఆ సమయంలో నాకు బాయ్‌ఫ్రెండ్ ఉండేవాడు. అతడి బర్త్ డే రోజు నన్ను పార్టీకి ఆహ్వానించాడు. ఆ పార్టీకి నేను వెళ్లడంతో హ్యాపీగా ఫీలయ్యాం. మేమిద్దరం మెక్‌డొనాల్డ్‌కు వెళ్లాం. అయితే ఆ సమయంలో దానిని డేటింగ్ అంటారనే విషయం కూడా నాకు తెలియదు అని రాశీఖన్నా పేర్కొన్నారు.

భాయ్‌ఫ్రెండ్‌తో డేటింగ్‌కు వెళ్లి
అప్పుడు నేను చాలా మితభాషిని. మెక్‌డొనాల్డ్‌కు వెళ్లాక నాకు కావాల్సిందేదో ఆర్డర్ ఇచ్చుకొన్నాను. అతడిని పట్టించుకోకుండా నా మట్టుకు నేను తింటూ ఉన్నాను. మధ్య మధ్య అతడిని చూస్తూ స్మైలిస్తూ తింటున్నాను. అలా నా ఫస్ట్ డేటింగ్ జరిగింది. మా మధ్య వచ్చిన అభిప్రాయ భేదాల వల్ల మా అఫర్‌కు బ్రేక్ ఇద్దామని పరస్పరం నిర్ణయం తీసుకొన్నాం. ఇప్పటికీ మేమిద్దరం ఫ్రెండ్స్ మాదిరిగానే ఉంటాం అని రాశీఖన్నా చెప్పారు.

బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ అలా
ఆ తర్వాత నా బాయ్‌ఫ్రెండ్‌తో నా బ్రేక్ జరిగింది. మళ్లీ ఎప్పుడూ అఫైర్ల విషయానికి వెళ్లలేదు. సినిమా పరిశ్రమలోకి వచ్చాక కెరీర్‌ను చక్కదిద్దుకోవడమే పని. సినిమా ఆఫర్లను చేజిక్కించుకోవడం, షూటింగులు, ప్రమోషన్స్, తదుపరి సినిమాకు రెడీ కావడం లాంటి విషయాలతో బిజీ అయ్యాను. ప్రేమ, పెళ్లి గురించి ఆలోచించే అవకాశమే రాదు అని రాశీ ఖన్నా వెల్లడించారు.
Recommended Video

పెళ్లిపై నా అభిప్రాయం ఏమిటంటే..
ఇక పెళ్లి విషయంలో నాకు ఎలాంటి అభిప్రాయాలు, ప్రణాళికలు లేవు. నా భర్త ఇలా ఉండాలి? అలాంటి లక్షణాలు ఉండాలి అనే ఆప్షన్లు కూడా లేవు. కాకపోతే నాకు పొడుగ్గా ఉండే భర్త కావాలి. ఎందుకంటే నా హైట్ ఎక్కువ కాబట్టి నా ఎత్తుకు తగినట్టు ఉండాలి. అంతకంటే నాకు ఏమీ డిమాండ్లు లేవు అని రాశీఖన్నా చెప్పారు.


Click it and Unblock the Notifications











