ఏదో ఒకనాడు ఆ రోజు వస్తుంది.. ప్రస్తుతానికైతే అదే నా జీవితం.. రాశీ ఖన్నా కామెంట్స్ వైరల్
టాలీవుడ్ ముద్దుగుమ్మ రాశీ ఖన్నా సోషల్ మీడియాలో చేసే హల్చల్ అంతా ఇంతా కాదు. లాక్డౌన్‌లో రాశీ ఖన్నా తన ఫాలోవర్స్‌ను అలరించేందుకు ఫోటో షూట్లతో వల వేస్తోంది. రాశీ ఖన్నా తన అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఎంటర్టైన్ చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్‌లో బిజీ అవుతోంది. తాజాగా రాశీ ఖన్నా తన ప్రేమ, పెళ్లి సంగతులను చెప్పింది.

కలిసొచ్చిన లక్..
విజయ్ సేతుపతి హీరోగా రాబోతోన్న తుగ్లక్ దర్బార్ చిత్రంలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా ఎంపికైంది. మామూలుగా ఈ పాత్రకు ముందుగా అదితీ రావ్ హైదరీని తీసుకున్నారు, డేట్ల సమస్య తలెత్తడంతో రాశీ ఖన్నాను తీసుకున్నారు. అలా విజయ్ సేతుపతి సినిమాలో చాన్స్ కొట్టేసింది.

కొత్త కోణం..
నాలోని కోణమిది.. నేను ఎప్పుడూ గుర్తించని, తెలియని కోణమిది.. మళ్లీ నన్ను కొత్తగా ఆవిష్కరించినందుకు థ్యాంక్స్ అంటూ తన ఫోటోగ్రాఫర్‌ను పొగడ్తలతో ముంచేసింది రాశీఖన్నా. లంగావోణిలో ముసి ముసి నవ్వులు నవ్వుతూ కొంటెగా చూస్తూ ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. అంతకు ముందు చేసిన సాగరకన్య స్టైల్ ఫోటోలు నెట్టింట్లో మంట పెట్టాయి.

షాక్ అయ్యాను..
ప్రేమ పెళ్లి గురించి రాశీ ఖన్నా మాట్లాడుతూ.. ప్రస్తుతానికి నేను సింగిల్‌గానే ఉన్నాను. స్పెషల్ పర్సన్ అంటూ నా జీవితంలో ఎవరూ లేరు. ఒకవేళ అలాంటి వ్యక్తే నా లైఫ్‌లోకి వస్తే అతనితో డేట్‌కి వెళ్తా. లాక్‌డౌన్ సమయంలో చాలామంది వివాహబంధంలోకి అడుగుపెట్టారని తెలిపింది.
Recommended Video

షాక్ అయ్యాను..
రానా పెళ్లి ఫొటో చూసి ఆశ్చర్యపోయిన క్షణం ఇప్పటికీ నాకు గుర్తు ఉందని రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది. కాజల్, నితిన్ తమ సోల్‌మేట్స్‌ను పెళ్లి చేసుకొన్నారని, ఏదో ఒకరోజు తన జీవితంలో కూడా అలాంటి అందమైన రోజు వస్తుందని భావిస్తున్నానని చెప్పింది. ప్రస్తుతానికైతే తినడం, వర్కౌట్లు చేయడం, నిద్రపోవడం.. ఇదే నా జీవితమంటూ రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











