న్యూ ఇయర్ స్పెషల్ విషెస్.. కళ్లతో కాల్చేస్తోన్న రాశీ ఖన్నా
రాశీ ఖన్నా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాను ఎలా ఊపేస్తోందో అందరికీ తెలిసిందే. హాట్ హాట్ ఫోటోలు, వెరైటీ ఫోటో షూట్‌లు చేస్తూ ఫాలోవర్లను సంపాదించుకుంటోంది. మామూలుగా ఇంతకు ముందు సోషల్ మీడియాలో ఫోటో షూట్లపై అంతగా శ్రద్ద పెట్టని రాశీ ఖన్నా ఇప్పుడు మాత్రం రెట్టింపు వేగంతో దూసుకుపోతోంది. చెల్లి పెళ్లి అంటూ రాశీ ఖన్నా చేసిన సందడి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
అంతకు ముందు సినిమా షూటింగ్‌లతో ఫుల్ బిజీగా ఉంది. కోలీవుడ్‌లో వరుసగా రెండు ప్రాజెక్ట్‌లను ఒకే సారి షూట్ చేసింది. అక్కడ పూర్తయితే ఇక్కడ.. ఇక్కడ అయిపోతే అక్కడా అన్నట్టుగా రెండు సినిమాలతో రాశీ ఖన్నా బిజీగా ఉండేది. ప్రస్తుతం మాత్రం రాశీ ఖన్నా షూటింగ్‌లకు దూరంగానే ఉంటోంది. రాశీ ఖన్నా తన బర్త్ డే సందర్భంగా హైద్రాబాద్‌కు వచ్చింది. ఇక అప్పటి నుంచి రాశీ ఖన్నా ఇటే ఉంటోంది.

ప్రస్తుతం రాశీ ఖన్నా తన అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపింది. ఈ రోజు మీ తాగే కాఫీలో ఓ మ్యాజిక్ కనిపిస్తుందని ఆశిస్తున్నాను.. అపరిచితులు కూడా మిమ్మల్ని చూసి ఓ స్మైల్ ఇస్తారు.. వేసే ప్రతీ అడుగులో ఏదో తెలియని కొత్త అనుభూతిని ఫీల్ అవుతుంటారు.. ఈ రోజు మీతో మీరు కచ్చితంగా ప్రేమలో పడతారు.. ఇదంతా కొత్త ఏడాది వచ్చిందన్న ఫీల్.. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











