Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నైట్ షూటింగ్‌లతో విసిగిపోయినట్టుంది.. రాశీ ఖన్నా పోస్ట్ వైరల్
ప్రస్తుతం రాశీ ఖన్నా ఎంత బిజీగా ఉందో అందరికీ తెలిసిందే. తెలుగులో హిట్లు కొట్టినా కూడా ఇక్కడి వాళ్లు అంతగా పట్టించుకోవడం లేదు. రాశీ ఖన్నాకు ప్రస్తుతం కోలీవుడ్‌లో ఫుల్ ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే వరుసగా రెండు చిత్రాలను లైన్లో పెట్టేసింది. అంతే కాకుండా మరో పాన్ ఇండియన్ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇలా క్షణం తీరిక లేకుండా రాశీ ఖన్నా ఫుల్ బిజీగా ఉంటుంది. ఆ మధ్య అయితే రాశీ ఖన్నా పండుగలన్నా తేడా కూడా లేకుండా పని చేసేది.
లాక్డౌన్ వల్ల సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. అన్ లాక్ ప్రక్రియ మొదలవ్వడంతో అన్ని చిత్రాలను ఒకే సారి లైన్లో పెట్టేసింది రాశీ ఖన్నా. తమిళంలో రెండు ప్రాజెక్ట్‌లను వరుసగా షూటింగ్‌లు చేస్తూ అక్కడో షెడ్యూల్ ఇక్కడో షెడ్యూల్ అన్నట్టుగా పూర్తి చేసింది. వీకెండ్స్, పండుగలు అన్న తేడా లేకుండా పని చేసింది. అయితే మధ్యలో తన బర్త్ డే, చెల్లి పెళ్లి వేడుకలకు మాత్రం రెస్ట్ తీసుకుంది.
తాజాగా రాశీ ఖన్నా మళ్లీ తన షూటింగ్‌లతో బిజీ అయిపోయింది. అయితే రాత్రి పూట షూటింగ్‌లంటే ఎవ్వరికైనా కాస్త చిరాగ్గానే ఉంటుంది. నైట్ అవుట్ చేయడమంటే అది కూడా ఇలాంటి చలి వాతావరణంలో రాత్రి షూటింగ్ అంటే మాత్రం ఎవ్వరైనా వెనుకడుగు వేస్తుంటారు. అలా రాశీ ఖన్నా తన నైట్ షూటింగ్‌ను తలుచుకుని పూర్తిగా డల్ అయిపోయినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు రాశీ ఖన్నా చేసిన పోస్ట్, షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతంది.